భక్త శబరి…???భక్తి పరీక్షా???



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారికి మార్చ్ 2016 లో జరిగిన  చాలా అద్భుతమైన అనుభవం:

ఈ మధ్యనే జరిగిన ఒక లీల గురించి మీకు చెబుతాను.  ఈఅధ్బుతమైన లీల క్రిందటి గురువారం జరిగింది.  మా ఇంటిలో మేమంతా ప్రతిరోజు రాత్రి కూడా మామూలుగానే భోజనాలు చేస్తాము.  కొంత మంది గురువారాలలో ఫలహారాలు చేస్తారు.  నేను గత మూడు వారాలుగా రాత్రి చపాతీలు చేయడం మొదలుపెట్టాను.   మొదటి చపాతీ బాబా గారికి నైవేద్యంగా సమర్పించవచ్చని నా ఉద్దేశ్యం.  కాని క్రిందటి వారం చపాతీలు చేద్దామని చూస్తే పిండి అయిపోయింది.  నేను ముందర గమనించలేదు.  అప్పటికే రాత్రి 7గంటలయింది. మా అత్తగారు యోగా క్లాసులకి వెళ్ళారు.  మా వారు ఇంటికి వచ్చేసరికి ఆలశ్యమవుతుందని ఫోన్ చేశారు.  రాత్రి వేళ కావడంవల్ల పాపతో నేను బయటకు వెళ్ళలేక ఆ రోజుకి  అన్నం వండేశాను.  అపుడే బయట అరటి పండ్లు అమ్మే అతను వచ్చాడు. వెంటనే నేను అరటిపళ్ళు కొని బాబాకి చపాతీ బదులుగా రెండు అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించాను.  ఆ రోజు రాత్రి మా మామయ్య గారు, అత్తయ్యగారు 8.30 కల్లా భోజనాలు చేసేశారు. రాత్రి 9-15 కి నేను, మావారు ఇద్దరం భోజనాలు చేస్తున్నాము. ఇంతలో ఒక ముసలాయన ఆకలిగా ఉంది అన్నం పెట్టమని పిలిచారు.  అప్పటికే మేమిద్దరం సగం అన్నం తినేశాము.  ఆముసలాయన ఒక స్టీలు కంచం కూడా తెచ్చుకున్నారు.  ఆసమయానికి మేము అన్నం తినేశాము. ఇంకా కొద్ది అన్నం మిగిలితే పారవేయడం ఎందుకని ఇద్దరం చెరి సగం పెట్టుకున్నాము. ఆ సమయంలోనే ఆ ముసలాయన అన్నం పెట్టమని అడగడం జరిగింది. మా ఇంటి వెనకాలే మా తోడికోడలు కూడా ఉన్నారు. ఆవిడని పిలిచి అడుగుదామనుకుంటే తలుపు వేసి ఉంది.   వెంటనె నేను చేయి కడుక్కుని నేను కంచంలో పెట్టుకున్న అన్నాన్నిఆముసలాయన కంచంలో వేశాను.  మావారు కూడా తన కంచంలోని అన్నాన్ని కూడా అతని కంచంలో వేశారు.  ఆముసలాయన అన్నంలోకి ఏదయినా వేయమని అడిగాడు. అప్పటికే మేము చాలా మట్టుకు భోజనాలు కానిచ్చేయడం వల్ల కేవలం పచ్చడి మాత్రమే మిగిలింది.  మేము రాత్రి వేళల్లో మజ్జిగ అన్నం తినము.  కూర, పచ్చడితో మాత్రమే తింటాము. పచ్చడి తీసుకుని వచ్చి అతని కంచంలో వడ్డించాను.  ఆ ముసలతను గుమ్మం బయటే కూర్చుని అన్నం తిన్నాడు.  మా వారు అతనికి త్రాగడానికి మంచి నీరు ఇచ్చారు.  అయన అన్నం అంతా తిన్నతరువాత ఆఖరుగా ఒక పెద్ద అన్నం ముద్దను చేతిలోకి తీసుకుని ఇలా అన్నారు “నేను ఆఖరి ముద్దను కాకులకో లేదా పక్షులకోవేస్తాను నేను క్రింద వేసానని బాధపడకండి”  అని ఒక విధంగా నవ్వి క్రింద వేశారు. వేసిన తరువాత మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు.

నేను బాబా దగ్గిర పెట్టిన అరటి పండ్లు రెండూ తెచ్చి ఒకటి మావారికి రెండోది నేను తిన్నాను.  అపుడు నాకొక ఆలోచన వచ్చింది. ముసలాయన రూపంలో వచ్చి అన్నం పెట్టమని అడిగినది బాబాయేనేమోనని. వెంటనే వెబ్ సైట్ లో బాబా ప్రశ్నలకు జవాబులలో ప్రశ్న తలచుకుని సమాధానం చూశాను.  “ప్రతి జీవిలోను నన్నే చూడు” అని సమాధానం వచ్చింది.

ఇక్కడ నేను మీకు మరొక విషయం చెప్పాలి.  అతనికి అన్నం సరిపోలేదేమోనని, అరటిపండు ఇస్తే వద్దన్నాడు.  కారణం ఆఅరటిపండు అంతకు ముందే బాబావారికి నైవేద్యం రూపంలో చేరింది కనుక.  జరిగినదంతా అర్ధం చేసుకునేసరికి నా కళ్ళల్లో నీరు వచ్చింది.  దివి నుండి భువికి దిగి వచ్చి మా ఎంగిలి మెతుకులు తిన్నారు బాబా అని చాలా బాధ కలిగింది.  తరువాత మావారిని అడిగాను ఇతనిని ఇంతకు ముందు ఎప్పుడయినా ఈప్రాంతంలోచూసారా అని.  గత 30 సంవత్సరాలుగా నేనితనిని ఇంతవరకు చూడలేదని చెప్పారు.  కాని నాకు ఎక్కడో చూసిన విధంగా అనిపించింది.  మళ్ళీ వస్తాను అని చెప్పారు కాబట్టి బాబా వారి రాక కోసం ఎదురు చూస్తున్నాను.

ఆ రోజు ఉదయం భక్తి టీ.వీ. లో ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు ప్రసారమవుతున్న విజయేశ్వరీదేవి గారి ఆధ్యాత్మిక ప్రసంగం, పని చేసుకుంటూనే వింటు ఉన్నాను. దాని సారంసమేమిటంటే…  యజ్ఞం  చేయడానికి కావలసినది ధన కనక వస్తు వాహనాలు కాదు.  ముఖ్యంగా కావలసినది స్వచ్చమయిన మనస్సు.  మంచి దయార్ద్రహృదయం.  అంతే గాని విధి విధానాల ప్రకారం చేసిన యజ్ణ  యాగాదులు కాదు.  కీర్తి కోసం, యశస్సు కోసం చేసినయజ్ణ యాగాదులు సత్ఫలితాలనివ్వవనీ, అన్ని దానాలకన్నాఅన్నదానం మహత్తరమయినది.

భక్తురాలయిన శబరి విషయంలో శ్రీరామ చంద్రమూర్తి వారు మనకి ఏమని బోధించారో చూడండి. “ముఖ్యంగా కావలసినది భక్తి.  అంతేగాని కులం, మతం కాదు.  మనం ఏమి సమర్పిస్తున్నాము అన్నది కూడా కాదు.  శబరి రాముల వారికి పండ్లను సమర్పించింది.  పండ్లు   పుల్లగా ఉన్నవేమోనని కాస్త కొరికి రుచి చూసి తియ్యటి పండ్లను ఆయనకు సమర్పించింది.  శ్రీరామ చంద్రుల వారు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ప్రీతితో ఆరగించారు.  ఆయన ఆమెలోని భక్తిని మాత్రమే చూశారు గాని, ఎంగిలి పండ్లను సమర్పించిందనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.  భక్తుడు భక్తితో సమర్పించినది ఏదయినా భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు.”

శ్రీ సాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయం కూడా  గమనించండి. బాలారాం కొడుకు గోవింద్ తన తండ్రికి క్రియా కర్మ చేయటానికి  వెడుతు, షిరిడీకి వెడతానని తర్కడ్ వద్దకు వచ్చి చెప్పాడు.  అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడ్ భార్యకు తోచింది.  కాని ఇది వరకే బాబాకు నైవేద్యంగా అర్పించిన పేడా తప్ప ఇంట్లో వేరే ఏదీ లేదు.  ప్రేమతో పెట్టితే ఏదైనా సాయి సంతోషంగా తిటారని ఆమె ఆ పేడాను ఆ అబ్బాయి సూతకంలో ఉన్నా అతని చేతికిచ్చి పంపింది. కాని గోవిందు షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు పేడా గదిలోనే మర్చిపోయాడు. కాని బాబా అతనికి తర్ఖడ్ భార్య ఇచ్చిన పేడాను గుర్తు చేసి, అతని చేత తెప్పించుకుని ప్రీతితో ఆరగించారు.

38 వ.అధ్యాయంలోని  “సమయా సమయాలలో అతిధులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖ పెట్టడం గృహస్థుల ధర్మం. అన్నం పెట్టకుండా వారిని పంపి వేయడం అధోగతిని ఆహ్వానించుకున్నట్లే.  వస్త్ర పాత్రాది దానంలో పాత్రతను చూచి ఆలోచించి ఇవ్వాలి.  కాని అన్నదానంలో ఆ ఆలోచన అవసరంలేదు.  ఇంటి ముందు ఎవరు ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టకుండా వారి ననాదరం చేయటం ధర్మం కాదు.”

అనుకోని అతిధిగా వచ్చి అన్నం పెట్టమని అడిగిన వానికి ఎంగిలి మెతుకులు పెట్టామే అని బాధ పడినా,  38 వ.అధ్యాయంలో బాబా వారు చెప్పినట్లుగా సమయా సమయాలు చూడకుండా అతిధిని ఆదరించడం  గృహస్థ ధర్మం.  ఆ ధర్మాన్ని ఆవిడ పాటించారు.  ఎంగిలి పెట్టాకూడదనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఆకలిని తీర్చారు. 

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles