భక్తురాలు భక్తి, ప్రేమలతో పెట్టిన ఎంగిలి అన్నాన్ని స్వీకరించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


A. త్యాగరాజు గారి అనుభవం మూడవ భాగం:

మాకు తెలిసిన ఆవిడ పేరు. కృష్ణవేణి ఆవిడ, ఆవిడ భర్త కూడా బాబా భక్తులు.

కొన్ని గురువారాలు రాత్రి పూట భోజనం చేయము అని అనుకున్నారా దంపతులు. చపాతీలు చేయాలనీ నిర్ణయించుకుందావిడ.

మొదటి వారం చపాతీలు చేసుకుతిన్నారు. రెండవ వారం వచ్చేసరికి ఇంట్లో గోధుమపిండి అయిపోయింది.

వాళ్ళ అమ్మాయి చిన్నపిల్ల కావటాన దాన్ని తీసుకుని బయకు వెళ్ళే వీలులేక అన్నం వండేసింది.

ఈ లోపు అరటిపండ్లు అమ్మకానికి వస్తే కొని చపాతీలకు బదులుగా అరటిపండ్లు బాబాకి నైవేద్యం పెట్టిది,

ఆ రోజు రాత్రి వాళ్ళు భార్య భర్తలు ఇద్దరూ భోజనం చేస్తూ వుండగా ఒక ముసలాయన గుమ్మం దగ్గరకి వచ్చి ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమంటూ అడిగాడట. అప్పటికే వాళ్ళు సగం అన్నం తినేశారు.

ఆ ముసలాయన ఒక స్టీల్ కంచం కూడా తెచ్చుకున్నాడు. వాళ్ళు మజ్జిగ పోసుకున్నాక కూడా కొంచెం అన్నం మిగిలితే పారవేయడం ఇష్టం లేక ఆ మిగిలిన అన్నం కూడా ఆ భార్య భర్తలు చెరిసగం వేసేసుకున్నారు.

ఈ లోపు ఆ ముసలాయన గుమ్మం లోకి వచ్చి అన్నం అడిగాడు.

అయ్యో! అంత అన్నం ఇప్పుడే వేసుకున్నాము అంటూ, కృష్ణవేణి గారి తోడికోడలు పక్కనే ఉంటారు, వాళ్ళు గుమ్మం చూస్తే తలుపులు వేసేసి ఉన్నాయట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమైనా అన్నం ఉంటె పెడతారేమోనని.

ఇంక ఆవిడ చేసేది ఏమి లేక చెయ్యి కడుక్కుని వచ్చి తన కంచంలో ఉన్న అన్నాన్ని ఆ ముసలాయన కంచంలో వేసింది.

వాళ్ళాయన కూడా తన కంచంలో ఉన్న అన్నం ఆ ముసలాయన కంచంలో వేసాడు. ఒట్టి అన్నమే చూసి అన్నం లోకి ఏమైనా వెయ్యమని అడిగితే పచ్చడి కూడా వేసిందట.

ఆ ముసలాయన గుమ్మంలో కూర్చుని అన్నం తిని, ఆఖరి ముద్దను తీసి, “నేను ఈ ముద్దను పక్షులకు వేస్తాను. నేను కింద పెడుతున్నాను, నేను ఇలా చేసానని ఏమి అనుకోవద్దు” అంటూ తమాషాగా నవ్వి ఆ ముద్ర కింద పెట్టి వెళ్లి పోయాడట.

బాబాకి నైవేద్యంగా పెట్టిన అరటిపండ్లు, ఆ భార్య భర్తలు చెరోకటి తింటుండగా ఆవిడకి ఇందాక వచ్చింది ‘బాబా’ యేమో అని అనుమానం వచ్చిందట.

వెంటనే వెబ్ సైట్ ఓపెన్ చేసి మన ప్రశ్నలకు బాబా జవాబులు అన్న శీర్షిక తీసి ప్రశ్న అడిగితే, అందులో ఆవిడకి సమాధానం ప్రతి జీవిలోనూ నన్నే చూడు అన్న సమాధానం వచ్చింది.

అతనికి అన్నం సరిపోదేమోనని అరటిపండ్లు ఇస్తే వద్దన్నాడు. కారణం అంతకు ముందే అరటిపండ్లు నైవేద్య రూపంలో బాబాకి చేరింది కనుక.

జరిగింది ఆవిడకి అర్ధం అయ్యే సరికి ఆవిడ కళ్ళల్లో  నీళ్ళు వచ్చాయి.

దివి నుండి భువికి దిగి వచ్చి మా ఎంగిలి మెతుకులు తిన్నాడు ‘బాబా’ అని అనుకుంటుంది. ఆ తరువాత వారిద్దరూ కూర్చుని ఈ మనిషిని మనం ఎప్పుడూ చూడలేదు అన్న విషయం గ్రహించారు.

ఆయన వెళ్తూ నేను మరల వస్తాను అంటూ వెళ్ళిపోయాడు.

అదే రోజు ఉదయం రోజు లాగానే ఉదయం 6 గంటలకు భక్తి టీవీలో, ఆధ్యాత్మిక ప్రవచనం వింటూ పని చేసుకుంటుంది.

ఆ ముసలాయనకి అన్నం పెట్టక ఆ ప్రవచనం గుర్తుకు వచ్చిందావిడకి.

అందులో ఒక కథ కూడా ఉంది. ఆ కథలో మహాభారతం లో యుధిష్టరుడు ఒక యజ్ఞం చేసాడు. దాని కోసం వచ్చిన వారందరికీ కానుకలతో సత్కరించాడు.

గొప్ప అన్న దానాలు జరిపిస్తున్నాడు. ఆ వచ్చిన వారంతా భోజనాలు చేసి రాజును దీవించి వెడుతున్నారు.

ఆ సమయంలో అక్కడికి ఒక ముంగిస వచ్చింది. ఆ ముంగిస ఒక వైపు బంగారంగా మారి ఉంది.

అక్కడ అన్నదానం చేసిన చోట పడి ఉన్న అన్నపు మెతుకులతో పొర్లాడుతోంది. అక్కడ ఉన్న వారంతా దాని చర్యలు గమనిస్తున్నారు.

ఆ ముంగిసకి మాట్లాడే శక్తి కూడా ఉంది. “రాజా! ఒక రాజ్యం లో కడు బీదవాడు, తన భార్య కొడుకు, కోడలితో కలసి నివసిస్తున్నాడు. వారికి పూట గడవని స్థితి, తినటానికి చాలా కష్టంగా ఉండేది.

ఆ కుటుంబం లోని వారంతా భక్తి తత్పరులు. ఒకసారి ఆ రాజ్యం లో కరువు సంభవించింది.

ఇక వీరి కుటుంబం పస్తులు ఉండవలసి వచ్చింది. ఒక రోజు ఆ కుటుంబం పెద్ద బయకు వెళ్లి అతి కష్టం మీద కాసిని బియ్యం తెచ్చాడు.

భార్య అన్నం వండి నలుగురికి సమ భాగాలు చేసింది. సరిగ్గా వారు ముద్ద నోట్లో పెట్టుకోబోతూండగా వీధి గుమ్మం తలుపు శబ్దం అయ్యింది.

ఇంటి యజమాని తలుపు తీసాడు. బయట ఒక బాటసారి నిలబడి వున్నాడు. ఆకలితో చాలా నీరసంగా, సొమ్మసిల్లి పడిపోయేటట్లుగా ఉన్నాడు.

అప్పుడా యజమాని, ఆ బాటసారిని లోపలికి పిలిచి, “మీరు చాలా ఆకలిగా ఉన్నట్లున్నారు” అన్నాడు. ఆ బాటసారి “అవును! నేను చాలా ఆకలితో ఉన్నాను. చాలా రోజులనుండి నేను ఏమి తిండి తినలేదు” అన్నాడు.

“అయ్యా! మీరు మంచి సమయానికే వచ్చారు. మేము ఇప్పుడే భోజనానికి కూర్చోబోతున్నాము”, అంటూ తన భాగాన్ని(అన్నం) ఆ బాటసారికి ఇచ్చాడు.

అది ఆయన తిన్నాడు. అయినా ఆ బాటసారి ఆకలి తీరకపోవటంతో ఇంట్లోని వారంతా తమ తమ వాటా అన్నాన్ని ఆ బాటసారికి ఇచ్చారు.

ఆయన అంతా తిని తృప్తిగా బయటకి వెళ్లి పోతుండగా ఇల్లు కాంతులతో నిండి పోయి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.

అప్పుడు భగవంతుడు వారితో “ఈ రోజు మీరు లోకంలో అన్నిటికంటే ఉత్తమమైన యజ్ఞం చేసారు. అందుకే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను” అన్నాడు.

ఆ సమయంలో నేను అక్కడ ఆ వైపు వెళ్ళటం వారందరికీ మోక్షం రావటం నేను చూసాను అంది.

ఆ బాటసారి భుజించగా కింద పడిన మెతుకులతో నేను పొర్లటం జరిగింది. అందుకని నా శరీరం లో సగ భాగం బంగారంగా మారిపోయింది.

అప్పటి నుండి మిగిలిన శరీర భాగం కూడా బంగారంగా మారటానికి ఎక్కడ యజ్ఞం జరిగినా అక్కడికి వెళ్లి ఇలా పొర్లాడుతూనే వున్నాను. కానీ ఇంతవరకు ఫలితం కనపడలేదు.

ప్రజలంతా నువ్వు ఎంతో గొప్ప యజ్ఞం చేస్తున్నావని అంటూంటే విని ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నాను.

అయినా నాశరీరం లో ఎటువంటి మార్పు రాలేదు. ఆ పేదవాడు చేసిన యజ్ఞం కంటే నీ యజ్ఞం ఏం గొప్పది కాదులే అంటూ ఆ ముంగిస అక్కడి నుండి అదృశ్యం అయింది.

యుధిష్ఠరుడికి జ్ఞానోదయమైంది, యజ్ఞం చేయాలంటే ధన వస్తు, వాహనాలు కాదు, ముఖ్యంగా కావలసింది స్వచ్ఛమైన మనసు, దయార్ద్ర హృదయం అంతే కానీ, విధి విధానాలతో చేసిన యజ్ఞ యాగాదులు కాదు. కీర్తి, పేరు కోసం చేసే అన్నదానం గొప్పది కాదు అని యుధిష్టరుడు తెలుసుకున్నాడు.

ఇప్పుడు ఈవిడ దగ్గర కూడా ‘భక్త శబరి నుండి శ్రీ రాముడు ఎలాగైతే ఎంగిలి పళ్ళను స్వీకరించాడో’ అలాగే కృష్ణవేణి గారి దగ్గర నుండి ఆవిడ భక్తి ప్రేమలే బాబా చూసాడే కానీ, ఆవిడ ఎంగిలి పెట్టిందన్న భావన ఆయనలో అసలే లేదు.

శ్రీ సాయి సచ్చరిత్రలో’ బాబా 38 వ అధ్యాయంలో చెప్పినట్టుగా సామయా సమయాలను చూడకుండా అతిధిని ఆదరించడం గృహస్తు ధర్మం. ఆ ధర్మాన్ని పాటించింది ఆవిడ. బాబాయే ఆ రూపంలో వచ్చారని భావిస్తే ఆవిడలోని భక్తిని బాబా పరీక్షించాడనిపించింది.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

A. త్యాగరాజు గారి అనుభవం నాల్గవ భాగం తరువాయి……

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles