Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భరత్ రావు గారి అనుభవములు నాల్గవ భాగం
ఒకరోజు మా ఇంటికి మా వియ్యాలవారు వచ్చారు. అందరం కలిసాము కదా సరదాగా ఎక్కడికయినా వెళదాం అనుకుని,
ఎక్కడికి అని బాగా అలోచించి హైద్రాబాద్ కి కొద్ది దూరంలో విజయవాడ హైవే మీద దేశముఖ్ అనే గ్రామంలో సాయిబృందావనం అనే బాబా గుడికి వెళదాము అని నిర్ణయించుకున్నాము.
వెళ్లే ముందు పెద్ద వాళ్ళు షుగర్ పేషెంట్ లు ఉన్నారు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలుగకుండా భోజనాలు పెట్టి తీసుకు వెళదామనుకుని పప్పు, అన్నం, కుక్కర్ లో పెడితే,
పప్పును, ఇంట్లో పెరుగు ఉంది. అవి వేసుకుని తినేస్తే కనుక అందరమూ బయలుదేరి పోవచ్చు అన్నది ఆలోచన.
పప్పు కింద , అన్నం పైన గిన్నెలో పసి పిల్లవాడికి మెత్తగా ఉండటం కోసం అన్నం ఎక్కువ నీళ్ళు పోసి కుక్కర్ పెట్టింది మా ఆవిడ.
విజిల్స్ వచ్చాయి. కుక్కర్ చల్లారింది. మూత తీసేసరికి ఆశ్చర్యం! కింద నున్న పప్పు ఉడికింది. అన్నిటికన్నా పైన ఉన్న పసి పిల్లాడి అన్నం ఉడికింది. కానీ మధ్యలో పెట్టిన అన్నం ఉడకలేదు సరి కదా కనీసం గిన్నె కూడా వేడెక్కలేదు.
చేసేది లేక బాబు కి అన్నం పెట్టుకుని, ఇంట్లో పుచ్చకాయ ఉంటే కోసుకుని అందరమూ తలా ఒక ముక్క తిన్నాము. మరియు ఒక గిన్నె నిండా పెరుగు కూడా ఉంది.
అది కూడా గిలక్కొట్టి తలా ఒక గ్లాసుడు చిక్కటి మజ్జిగ తాగి, బయలు దేరి దేశముఖ్ బాబా గుడికి వెళ్ళాం.
లోపలికి వెళుతూంటే ఆఫీస్ రూమ్ నుండి ఒకాయన పరిగెత్తుకుని మా దగ్గరకి వచ్చి దర్శనం తరువాత చేసుకుందురు. ముందు అర్జెంటు గా భోజనాలు చేసిరండి అంటూ మమ్మల్ని భోజన శాలకు పంపించారు.
అలా ఎప్పుడు చెయ్యరు. అక్కడ ముందు దర్శనం అక్కడే భోజనానికి టిక్కెట్స్ ఇస్తారు. అందుకు బిన్నంగా జరిగింది.
ఇంట్లో పెద్ద వాళ్ళ కోసం అన్నం వండబోతే ఆ అన్నం ఉడక లేదు. బాబా అందరికి భోజనం ఇక్కడ ఏర్పాటు చేసారు మరి.
భోజనంకి వెళ్ళాము, సాంబార్ వేసుకున్నాక ఒకాయన వచ్చి మన్నించండి. ఈ రోజు మజ్జిగ వేయలేకపోతున్నాము. ఎందుకంటే బిందెడు పాలు ఒలికి పోయాయి అందుకని పాలు తోడు పెట్టలేకపోయాము. దయచేసి మమ్మల్ని మన్నించండి. అన్నాడాయన.
మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మజ్జిగ దొరకదు అనేమో ఇంటి దగ్గర అందరం చిక్కటి మజ్జిగ తాగి మరీ బయలుదేరాము. బాబాకి మనమీద ఎంత దయ అని అనుకోకుండా ఉండగలమా!
The above miracle has been typed by: Shiv Kumar Bandaru
భరత్ రావు గారి అనుభవములు ఐదవ భాగం తరువాయి…..
Latest Miracles:
- కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio
- బాబా హారతిలో వెంకటేశ్వరస్వామీ రూపం ను గాంచిన భక్తురాలు
- బాబా ఆరాధన చేతబడి నిరోధిస్తుంది–Audio
- ‘సీతక్క’ నీ ఇంట బాబా వచ్చి పొంగలి తిన్నారు
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments