Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక సారి మా స్వగృహంలో (విజయవాడ) సాయి నామ సంకీర్తన, ఏకాహం జరుగుతుండగా రాత్రి తొమ్మిది గంటలకి నామం పాడుతూ బాబా పై ధ్యానంతో ఇంట్లో పనులు చేసుకుంటున్నాను.
ఆ సమయంలో డెబ్బై సంవత్సరాలు వయసు గల ఒక ముసలాయన గళ్ళ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి ఉన్నాడు.
ఇంటి బయట మా వారుంటే వారిని భిక్ష అడిగాడట. ఆయన వచ్చి నన్ను అడిగారు, నేను చేస్తున్న పని మా వారికి అప్పజెప్పి బయటికి వచ్చి చూసాను.
అమ్మా! భోజనం పెడతావా” అని అడిగాడు, నేను సరే అన్నాను.
ఎక్కడ పెట్టాలి అని చూస్తుంటే ”ఎక్కడ పెట్టిన ఫర్వాలేదు, ఇలా రోడ్డు మీద పెట్టినా నేను తింటాను తల్లీ! అన్నాడు.
మరీ రోడ్డు మీద ఏం పెడతామని నేను మా వారిని అడిగి ఆయన్ని లోపలి రప్పించాను. లోపల దేవుడి గదిలో విస్తరి వేసి అన్నీ వడ్డించి ఆయన్ని పిలిచాను.
నేను ఎక్కువ తినను, కొంచెమే సరిపోతుంది అంటూ కొంచెం అన్నం మాత్రమే పెట్టించుకున్నాడు.
బయట జరిగే నామాన్ని భజనని ఆస్వాదిస్తూ, ”నేను అందరి ఇళ్లకు వెళ్ళను భజనలు జరిగే చోటుకే వెడతానని, నేను భోజనం చేసి మూడు రోజులయ్యింది, బాగా ఆకలి వేస్తుంది” అంటూనే ఏమి తినకుండా అన్నం కెలుకుతూ విస్తరి ముందు రెండు గంటలు కూర్చున్నాడు.
ఏదో తిన్నాను అనిపించి మజ్జిగ పొయ్యమన్నాడు. నేను మజ్జిగ కొంచెం పుల్లగా ఉందని పొయ్యటానికి తటపటాయిస్తుంటే,
”అమ్మా నాకు రుచితో సంబంధం లేదు. ఎలా ఉన్నా నేను తినేస్తాను. పెట్టే మనసే నాకు ముఖ్యం, నేను చూసేది నా మీద భక్తి, ప్రేమలు మాత్రమే. నాకు ఇష్టం అయిన వారు ఇంటికి మాత్రమే వస్తాను” అన్నాడు.
ఆయన భోజనం చేసిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెళుతూన్నట్లుగా ఆయన, పంపలేక పంపలేక పంపుతూన్నట్లుగా మేము బాధ పడ్డాము. ఇది ఒక అపూర్వ సంఘటన .
మరో సారి (విజయవాడ) మా కొత్త ఇంటి గృహ ప్రవేశం అయింది. గృహ ప్రవేశం అయిన ఇంట్లో బాబా నామ సంకీర్తన చేయించాలని నా సంకల్పం.
ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఇష్టం లేదు. వాళ్ళు వద్దు అన్నారన్న బాధతో, ఇంట్లో ఉన్న ఒక షోకేస్ క్రింద నేను పడుకున్నాను.
ఆ షోకేస్ పైన బాబా ఫోటో ఒకటి ఉంది. బాబా నామ సంకీర్తన జరిగితే బావుండునని నేను తలపోస్తూంటే, పైన ఉన్న బాబా ఫోటో నా తల పైన పడింది.
”అయ్యో!” అని తీసి కళ్ళకద్దుకుని, తిరిగి పైన తగిలించాను. మళ్ళీ నేను బాబా నామం అనుకోగానే తిరిగి తిరిగి ఆ ఫోటో నా మీద పడటం నేను పైన తగిలించడం జరిగింది.
అప్పుడు నేను మా వాళ్ళతో ”చూడండి, ఫోటో కూడా కింద పడిపోతుంది, నామం పెట్టిస్తే బావుంటుంది” అని అన్నాను.
వాళ్ళు మరి ఏమనుకున్నారో ఏమో నామ సంకీర్తన చేయించడానికి వప్పుకున్నారు.
ఈ కార్యక్రమం కూడా మా తమ్ముడు మల్లిఖార్జున రావు, మరదలు పద్మావతి గార్లు దగ్గరుండి జరిపించారు.
మా తమ్ముడికి బాబా గారు ధ్యానంలో ”మీ అక్క జోరీగలాగా నా వెనకాల పడితే నేను వచ్చాను” అని చెప్పారట.
ఆ సంకీర్తనకి నాకు బాబా గారి నిజ దర్శనం కాలేదు. ”బాబా మీరు వచ్చే వరకు నేను ప్రసాదం దాచివుంచుతాను” అని బాధగా రోజు ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉన్నాను.
ఆరవ రోజు ఉదయం, ఆ రోజు శనివారం అవటాన నేను వేంకేటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజ చేయించి వచ్చాను.
పది నిమిషాలకి ఒక ముసలి అతను వచ్చి భిక్ష అడిగాడు. నేను ఆయన్ని పరికించి చూసాను. ఆయన లైట్ యెల్లో కలర్ లాల్చీ, పైజామా పట్టువి కట్టుకొని, నుదుట నిలువు బొట్టు, సింధూరం పెట్టుకుని, ఆకృతి అచ్ఛంగా బాబా లాగానే ఉంది.
దక్షిణ కోసం కాకుండా కేవలం, భిక్ష స్వీకరించడానికి మాత్రమే వచ్చాడేమోనని నేను దక్షిణ ఇవ్వబోతే, అవి అతని పాదాల మీద పడ్డాయి.
నేను అయ్యో! కింద పడిపోయాయి అని నొచ్చుకుంటూంటే ”ఫర్వాలేదులే తల్లీ బాధపడకు” అన్నాడు.
మరో సారి నా మేనకోడలు శ్రీమతి భవాని కొత్త ఇల్లు గృహప్రవేశం తర్వాత నామ సప్తాహం చేస్తున్నారు బాబాకి హారతిస్తున్నారు ఆ హారతిలో నాకు వేంకటేశ్వరస్వామీ రూపం కనపడింది.
సాయిబాబా వేంకేటేశ్వర స్వామీ రూపం దాల్చినట్లు అనిపించింది.
అదే విషయాన్నీ చెబుదామని మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పటం మొదలుపెట్టి నా మాట పూర్తి అవ్వనేలేదు గుమ్మంలో నల్లని ఎతైన మనిషి నామాలతో, పట్టుపంచె, నల్ల కోటు వేసుకుని, పెద్ద పెద్ద తాళాలతో వాయించుకుంటూ ఒక మనిషి వచ్చి నిలబడ్డాడు.
ఆయన దగ్గర భిక్ష (జోలె), గొడుగు కూడా ఉంది. ఆయన వారి ఇంట భిక్ష స్వీకరించాడు.
నాకు హారతిలో వేంకటేశ్వర స్వామి రూపంలో కనపడి వెంటనే మా మరదలు ప్రసాదాల ఏర్పాటు (భోజనం) చేయటం,
అదే సమయంలో నల్లని ఎతైన మనిషి నామాలతో రావటం బాబాయే ఆ రూపంలో వచ్చి స్వీకరించాడు అని మా భావన, నమ్మకం, ప్రగాఢ మయిన దృఢ విశ్వాసం.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- సావిత్రిబాయి
- భక్తురాలు అనుకున్న నాడే(బాబు పుట్టిన రోజు) వారి ఇంట పూర్ణాహుతి జరిపించుకున్న బాబా వారు.
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- బండలపై బాబా రూపం
- బాబా చేసే లీలను అందరితో పంచుకొంటాను అని మొక్కుకున్న భక్తురాలు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments