భక్తురాలు అనుకున్న నాడే(బాబు పుట్టిన రోజు) వారి ఇంట పూర్ణాహుతి జరిపించుకున్న బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


48 వ రోజు భిక్షకి వెళ్ళాలి. నేను ఎక్కువ చెయ్యలేక 5 ఇళ్లల్లో అడుగుతానులే అదీ మా friend’s ఇళ్ళల్లో మాత్రమే అడుగుదాము అని అనుకున్నాను.

అడిగిన భిక్ష తాలూకా డబ్బు కానీ వస్తువులు కానీ అవతలి వారు ఏమిచ్చినా తీసుకోవాలి. వారు ఇచ్చినదంతా గురువుగారి ఆశ్రమానికి పంపిస్తారు.

మా వారు కారులో తీసుకెళ్ళి ఒక చోట భిక్ష కోసం దిగబెట్టారు. నాతో పాటు మరో ఆవిడ కూడా వచ్చింది. ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆగాను.

కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. ఆ అపార్టుమెంట్ లో 80 ఇల్లు ఉన్నాయి. అన్ని ఇల్లూ నాతో పాటు వచ్చినావిడ తిప్పించింది.

గాజు పెంకులు ముళ్ళు ఉన్నాయి, నడవటం కష్టం వేసింది. మధ్యాహ్నం హారతి సమయానికి ఇంటికి వచ్చేదామనుకున్నాను.

అందరిళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్లనేలేదు .

కాయిన్స్ అలా వస్తుండేవి కదా దానితో పాటు 3  అనే అంకె కూడా వస్తుండేది.

మా ఇంటి పక్కింటావిడ మీది సైట్స్ బిజినెస్ కదా గాయత్రి. మీకు 3 సైట్స్ వస్తాయేమో అంది. ఏమో అనుకున్నాము.

మేము పారాయణం (శ్రీ సాయి సచ్చరిత్ర) చేస్తుండగానే అంటే 7 వారాలు చేస్తాము కదా ఆ 7 వారాలలోనే డాక్టర్స్ కాలనీ లో ఒక సైటును చాలా రోజులుగా కొనాలని ట్రై చేస్తున్నాము.

కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అడపాదడపా మా వారు వెళ్ళి వాళ్ళని కలిసి వస్తున్నారు. అడిగి వస్తున్నారు.

మా వారు వాళ్ళని మా ఆవిడ ఇలా బాబా గారి జ్యోతి పెట్టుకుంది రండి చూడడానికి అని పిలిచారట. అనుకోకుండా వాళ్ళు బాబా భక్తులు.

వాళ్ళు మా ఇంటికి వచ్చారు. 5  వ వారం జరుగుతుండగా అక్కయ్య పాలెంలో ఒక సైట్ వాళ్ళు , వాళ్ళు కూడా బాబా భక్తులే వాళ్ళని కూడా చూడడానికి రమ్మంటే వాళ్ళూ వచ్చారు.

మొదటది రెండు రోజుల్లో అగ్రిమెంట్ అయ్యింది. రెండవది కూడా వాళ్ళు వచ్చి జ్యోతిని చూసి వెళ్ళటం వెంటనే అగ్రిమెంట్లు అవ్వటం జరిగింది.

ఆ అగ్రిమెంట్లు అన్నీ మా ఇంట్లోనే బాబా సమక్షంలో జరుగుతున్నాయి.

3వది కూడా విశాలాక్షి నగర్లో ఒక సైట్. మా వారి స్నేహితుడాయన. ఆయన అసలు ఎవరి మాట వినడు.

పూజ మూలంగా ఇంట్లో అంతా జనం ఉన్నారు, ఇలాంటి సమయంలో ఇలా వ్యవహారాల గురించి మాట్లాడుకోవటం ఎలా అని నేను అనేదాన్ని.

వాళ్ళు వచ్చి మాకు ఇక్కడైతేనే బావుంటుంది అంటూ లోపల రూంలో కూర్చొని మరీ మాట్లాడుకునేవారు . అలా మూడు సైట్స్ అయ్యాయి.

49 వ రోజు మధ్యాహ్నం హారతి అయిపోయాక చాలా మంది నైవేద్యానికి స్వీట్స్ అన్నీ చాలా తీసుకుని వచ్చారు.

అన్నీ ఏం చెయ్యాలా అనుకుంటూ భోజనాలలో వడ్డన చేద్దామనుకుని భోజనాల కోసం ఏర్పాటు చేసేలోగా మా చెల్లెలు వెళ్లి బాబా గారి పూజ గది తలుపు తీసి లోపలికి తొంగి చూసింది.

గోడపైన ఏదో ఆకారం లాగా సగం సగం గీస్తున్నట్లుగా దానికి కనపడింది.

అక్క ”బాబా గారు” నీకేదో బహుమతి ఇస్తున్నారే అక్కా అంది. ఆ గది నుండి అదీ స్వీట్స్ కూడా తీయకుండా వదిలేసి వచ్చేసింది.

అరగంట తరువాత ఆ గదిలోకి తొంగి చూస్తే గోడపైన భిక్ష పాత్ర లోంచి బియ్యం గింజలు పడుతున్నట్లుగా అలా డ్రాయింగ్ లాగా కనపడింది. దాన్ని అందరూ చూసారు.

గురువు గారు జ్యోతి పెట్టాక 7 వారాలు అయ్యాక ఆయనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి పూర్ణాహుతి ఇస్తారు. అప్పటిదాకా నాలుగు హారతులు ఇస్తుండాలి. జ్యోతి కూడా వెలుగుతూ ఉండాలి.

పారాయణాలు ఆపవద్దు. మా అబ్బాయి పుట్టిన రోజు ఏప్రిల్ 23న వస్తుంది. మాకు పూర్ణాహుతి తారీఖు మేలో ఇచ్చారు.

మేలో కాకుండా మా వాడి పుట్టిన రోజున పూర్ణాహుతి జరగాలని నేను అనుకున్నాను. మా ఇంట్లో అందరూ నువ్వా తారీఖు అనుకోగానే అదలా ఏం జరగదు.

గురువు గారికి ఎప్పుడు వీలుంటే అప్పుడే వస్తారు అన్నారు. ఈ లోపు అనకాపల్లిలో ఒక ఇంట్లో జ్యోతి పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు త్వరగా పూర్ణాహుతి చేసెయ్యమని గురువుగారికి ఫోన్ చేశారట.

ఇంట్లోనే జ్యోతి అలా ఉండగానే చనిపోతే ఇన్నాళ్లు 7 వారాలు పాటు చేసినదంతా వృధా అవుతుందని గురువుగారు వాళ్ళింటికి వాళ్ళ కోరిక మేర వచ్చి పూర్ణాహుతి చేసారు.

ఎలాగో వస్తున్నారు కాబట్టి మా ఇంట్లో కూడా చేసేయమని మేము కూడా ఫోన్ చేసాము. అనకాపల్లిలో 22 న చేసారు.

మా ఇంట్లో మేము నేను అనుకున్నట్లుగానే మా అబ్బాయి పుట్టినరోజు నాడు ఏప్రిల్ 23న బాబా గారు మా ఇంట పూర్ణాహుతి జరిపించుకున్నారు.

గురువు గారు కొంతమంది చేత సాయి కోటి రాయించి ఆయా పుస్తకాలను స్తూపంలో పెడుతుంటారు.

ఆ రాయటంలో 25000 ఉన్న పుస్తకాన్ని ఒకటి నేను రాయటం జరిగింది. నేనే కాదు నాతో పాటు ఇంకా చాలా మంది సాయి నామం రాసారు.

ఆ రాసిన పుస్తకాలన్నీ ఒక గదిలో ఉంచుతారు. స్థూపం తయారయ్యాక అందులో ఉంచటానికి ఒక తేదీని నిర్ణయించి ఆ రోజున కొంత మంది ఆ పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని నామం చెప్పుకుంటూ అందరం పది మందిమి కొన్ని కొన్ని పుస్తకాలు పట్టుకుని గుడిలోకి తీసుకెళ్ళి పెట్టాము.

అక్కడ పెట్టేటప్పుడు నేను రాసిన పుస్తకం నాకు కనపడింది. అంతమందిమి రాసాము, అంతమందిలో మళ్ళీ నేను రాసిన పుస్తకం నాకే కనపడటం చాలా ఆశ్చర్యం అయ్యింది.

నేను రాసాను అంటూ తీసుకోబోయాను. ఒకావిడ ఇక్కడికింక పుస్తకాలు చేరుకున్నాక నీది నాది అంటూ ఏం ఉండదు. అన్ని సమానమే అంది.

అయ్యో నేను రాసిన పుస్తకం నేనే తీసుకుని స్తూపంలో వేస్తే బావుంటుంది అనుకున్నాను, సరే పోనిలే అనుకున్నాను,

అందరం లైన్లో నుంచున్నాము, అందరికి తలో రెండు పుస్తకాలు చొప్పున ఇస్తున్నారు. అవి తీసుకుని స్తూపంలో వేస్తున్నారు.

నేను నిలబడ్డాను, నా వంతు వచ్చింది, నా చేతిలో కూడా రెండు పుస్తకాలు ఉంచబడ్డాయి, తీరా చూద్దును కదా నేను రాసిన పుస్తకమే నా చేతిలో ఉంది,

అదీను మరొకటిను. నా ఆనందానికి అవధులు లేవు, నేను రాసింది నేనే స్వయంగా స్తూపంలో వేయాలనుకోవడం ఆ కోరికను ”బాబా” ఇలా నెరవేర్చడం జరిగింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles