Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శివరాత్రి రెండు మూడు రోజులుందనగానే భక్తులు క్యూలో నిలబడేవారు. శివ దర్శనమునకు కాదు. మమ్మిడివరంలోని పెదబాలయోగి దర్శనం కోసం. 10, 15 లక్షలమంది ఆ రోజు దర్శించుకుంటారని అంచనా.
అక్కడున్న వ్యాపారస్థులు ఆ మూడు రోజులలో జరిగే వ్యాపారము సంవత్సరమంతయు జరిగే వ్యాపారంతో సమానమని అనెడివారు.
భక్తులు దేశ, విదేశాలనుండి విశేషంగా వచ్చేవారు. కొలది కాలము – సుమారు నాల్గు నెలలు నిత్య దర్శనం ఇచ్చారా యోగీశ్వరులు.
వారి తపో మందిర తలుపులు తెరచుకొనుట, తెరచుకొనక పోవుట అనేది శ్రీ బాలయోగీశ్వరుల వారి సంకల్పాన్ని బట్టి ఉంటుంది.
సాయిబాబా డేంగ్లే గృహమునకు పోగా, ముఖ ద్వారములు వాటంతట అవే తెరచుకొనిడివి.
ఆశ్రమునకు క్రొత్తగా తేబడిన ఆవు పాలను తీయనీయకుండా చాల దినములు ఇబ్బంది పెట్టింది.
ఇక ఆ ఆశ్రమమునుండి, ఆ ఆవును పంపి వేరొక ఆవును తెచ్చుటకు సంస్థాన కమిటీ నిర్ణయించింది. ఈ విషయము ఆయనకెట్లు తెలిసినది? స్వామికి ఎవరును చెప్పలేదు.
మరుక్షణము నుండి ఆ పెంకి ఆవు సాధువుగా మారినది. ప్రతి రోజు పాలు ఈయటం ప్రారంభించింది.
పొగరుబోతు గుర్రమును సాయి శాంత స్వభావిగా మార్చాడు. ఇక్కడ కూడా బాలయోగి తపో మహిమవలననే జరిగింది.
ఆయన ఆసనంపైననే ఉండేవారు. ఉదయం ధరించిన వారిని స్నానం చేసినట్లు, పరిశుభ్రంగా శిరోజాలు దువ్వినట్లు కనిపించేవారు. ఈ రహస్యమునకు కారణము ఎవరికిని తెలియలేదు.
ఒక భక్తుడు “స్వామీ తమరు కాశీలో గంగయందు స్నానము చేయుచుండగా చూచినానని చెప్పినాడు. నిజమైనా?” అని ప్రశ్నించగా “అది యొక గొప్ప విషయంకాదు. మేమెచ్చటికైనను పోగలము” అని సైగలతో యోగి చెప్పారు.
1953లో శివరాత్రికి భక్తకోటికి దర్శనమిచ్చుచున్నప్పుడు శ్రీ స్వామివారి జటాజూటము నుండి సన్నని గంగ ధార ప్రవహించటం సమీపమునందున్న భక్తులు గమనించారు.
సాయిబాబా దాసగణు అను భక్తునకు తన పాదముల నుండి గంగా యమునలను స్రవింపచేసినాడు.
స్వామిపై ఫిల్ము తీయాలనే ఉద్దేశ్యంతో పరమ నాస్తికుడైన చిత్ర నిర్మాత కోట్నీసు వచ్చాడు.
కెమెరాలో చూచినప్పుడు ఒక వృద్ధ తాపసి కనబడ్డాడాయనకు, ఇదేమిటని కెమేరా బయటకు వచ్చి చూడగా బాలయోగియే ఉన్నారక్కడ;
మరల లెన్సులో చూడగా బాల కృష్ణుడు నుదిటపైన నెమలి ఫించము, చేతిలో పిల్లనగ్రోవి కనబడెను. లెన్సు బయటకు వచ్చి చూడగా బాలయోగియే ఉన్నారక్కడ. ఈ లీల అందరిని అబ్బురపరిచింది.
అయన సన్నిధిలో ఎందరెందరికో దివ్య దర్శనాలు, దివ్యానుభూతులు కలిగినాయి.
నాస్తికవాదం పెరిగిపోతున్న రోజులలో దేవుని ఉనికి గూర్చి, తపస్సు గూర్చి, పునర్జన్మను గూర్చి నొక్కి చెప్పటమే గమనార్హం.
యోగీశ్వరులు ఆంగ్ల కాలమాన ప్రకారం 19 .07. 1985న దేహాన్ని విడిచి భక్తుల హృదయంలో నిలబడిపోయారు. నేడు ఆయన వర్థంతి. ఆయనను స్మరించెదము గాక!
శ్రీ భగవాన్ బాలయోగీశ్వరాయ నమః
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం శ్రీ దత్త స్వామినే నమః …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 7
- మసీదులో బాల దత్తుడు…..సాయి@366 డిసెంబర్ 4….Audio
- మరో డైరీ …..సాయి@366 జూలై 19…Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- ఓం అనిమిషాయ నమః …. మహనీయులు – 2020… జూలై 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments