Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
గతంలో శ్రీ గణేశ్ కృష్ణ కపర్దే గారి డైరీలలో కొన్ని భాగాలను, అంటే సాయిపరంగా ఉన్నవి, శ్రీమతి విమలా శర్మ గారు తెలుగులోకి అనువదించారు. ఆ డైరీలో సంఘటనలు రోజు వారిగా ఉంటాయి.
ఇక 2016 గురుపూర్ణిమ, జూలై 19న సాయి భక్త శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ విడుదలైంది. రచనను శ్రీ పర్నా విజయ్ కిషోర్ గారు చేశారు.
ఈ డైరీలో శ్రీ హరిసీతారాం ఉరఫ్ శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ సమగ్రమైన, ప్రామాణికమైన చరిత్రను ఆయన ఇచ్చారు.
శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్, సాయిబాబాకు చేరువైన క్షణం నుండి తనకు, ఇంకా ఇతర భక్తులకు సాయి ప్రసాదించిన అనుభవాలను, లీలలను, దివ్యానుభూతులను సేకరించి డైరీగా వ్రాశారు.
ఇంకా ఎందరో భక్తులు ఆయనకు వ్రాసిన ఉత్తరాలు, స్వయంగా చూచిన సంఘటనలను చాలా జాగ్రత్తగా భద్రపరచి ఉంచారాయన.
ఇదంతా ఒకే మాటలో చెప్పాలంటే సాయి లీలల సంగ్రహమే. అది సాయి సాగరమే. అందుండే సాయి సచ్చరితలో కొన్ని ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
దీనిని శ్రీ బీ.వి. నరసింహ స్వామి గారు సేకరించిన ‘ డీవోటీస్ ఎక్స్‌పీరియన్స్’తో కొంత వరకు పోల్చవచ్చును.
ఈ డైరీలో సాయి మాటలు యధాతథంగా ఉంటాయి, ఇంకొక విశేషమేమిటంటే కొన్ని, కొన్ని సందర్భాలలో కాకా సాహెబ్ దీక్షిత్ వాటిపై భాష్యం కూడా వ్రాశారు.
బాబా ప్రసాదించిన అనుభవాలు (మహారాజాంచే అనుభవ్), బాబా బోధించే పద్ధతి (మహా రాజాంచే బోధ్ పద్ధతి), బాబా వచనాలు (బాబాంచే బోల్) దీక్షిత్ డైరీలో కొన్ని భాగాలు.
”ఇంతవరకు సాయి భక్తులకు ఏ భాషలో కూడా గ్రంథం రూపంలో లభ్యంకాని ‘దీక్షిత్ డైరీ’ని శ్రీ సాయి అనుగ్రహ విశేషంగా తెలుగులోకి యధాతథంగా మొట్ట మొదటిసారి అందించారు” శ్రీ విజయ్ కిషోర్.
ఈ డైరీ తెలుగు భక్తుల యొక్క మనస్సును ఎంతో ఆకట్టుకుంది.
అనతి కాలంలోనే తృతీయ ముద్రణకు నోచుకున్నదంటే దానికి కారణం ఆ డైరీలోని అంశాలు మాత్రమే గాక దానిని తెలుగులోకి అనువదించిన విజయ్ కిషోర్ గారి అనువాద శైలి కూడా కారణం.
దీనిని మరో జ్ఞాన వాహినిగా భావించి, ఆ జ్ఞాన రత్నాలను మనం కైవసం చేసుకొందుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- విమానంలో సాయి సన్నిధికి …..సాయి@366 జూలై 5….Audio
- దీక్షిత్ వాడా …..సాయి@366 ఏప్రిల్ 7….Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 19 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 18 వ భాగం–Audio
- తిలక్ మహాశయుడు…..సాయి@366 మే 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments