Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
లోకమాన్యుడు ”స్వాతంత్య్రము నా జన్మ హక్కు” అని గర్జించాడు. గర్జించుటే కాదు, అనేక యోగులను కూడా దర్శించాడు ఆ విషయంలో.
”తిలక్ వస్తున్నాడు” అన్నారు సాయి ద్వారకామాయిలో కూర్చుని. అందరూ వామన్ మహారాజ్ తిలక్ అనబడే యోగి వస్తున్నాడని అనుకున్నారు.
ఆ రోజు మే 19, 1917. బాలగంగాధర తిలక్ రావటాన్ని చూచి అందరు అవాక్కయ్యారు.
ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత గ్రంథంస్తం చేయలేదు. గ్రంథంస్తం చేసిన వారిలో ఒకరు కపర్దే – వివరాలు ఇలా ఉన్నాయి.
”మేము సంగమనేరులో పెద్ద లాయరైన పంత్ గారి ఇంటి నుండి షిరిడికి 10 గంటలకు చేరి దీక్షిత్ వాడలో బస చేసాము.
అప్పటికే అక్కడ బాపూ సాహెబ్ బూటీ, నారాయణ రావు పండిట్ ఉన్నారు. నా పాత స్నేహితులు మాధవరావ్ దేశ్‌పాండే, జోగ్, ఇతరులు కూడా కలిసారు.
మేము మసీదుకు వెళ్ళి సాయి మహరాజ్‌కు వందనములు తెలిపాము. ఆయన అంతగా ఆనందంగా ఉండటం ఇంతకు మునుపెన్నడూ మేము చూడలేదు.
మామూలు ప్రకారం ఆయన దక్షిణ అడిగితే మేమంతా సమర్పించాం”.
సాయి తిలక్‌ను చూస్తూ ”మనుషులు చెడ్డవారు. నీ ఆలోచనలు గుప్తంగా ఉంచు” అన్నారు.
నేను నమస్కరించాను. ఆయన నా నుండి కొన్ని రూపాయలు తీసుకున్నారు.
కేల్కర్, అక్కడ ఉన్న వారు కూడా దక్షిణ సమర్పించారు. మాధవరావు మేమంతా యావలా వెళ్ళటానికి బాబాను అనుమతి వేడగా
”ఈ ఎండలో ఎందుకు వెళదామను కుంటున్నారు? దోవలో చావటానికా? సాయంత్రం చల్లబడ్డ తరువాత వెళ్ళండి. శ్యామా! వీళ్ళకు భోజనం పెట్టు” అన్నారు సాయి.
మాధవరావు ఇంట్లో భోజనం చేసి, కాసేపు విశ్రమించి మళ్ళీ మసీదుకు వెళ్ళాం.
సాయి మహారాజు నిద్రపోతున్నట్లు పడుకున్నారు. భక్తులు తిలక్‌కు చావడి దగ్గర తాంబూలం ఇచ్చారు.
మళ్ళీ మేము మసీదుకు వెళ్ళాం. సాయి మహారాజు లేచి కూర్చొని మాకు ఊదీ ప్రసాదాన్ని ప్రసాదించి, మేము వెళ్ళటానికి అనుమతించారు.
మేమందరము మోటారు వాహనంలో బయలు దేరి మా స్వస్థలాలకు వెళ్ళాం.
సాయిబాబా ఆశీస్సులు సామాన్యులపైనా, కుటుంబాలపైనే కాదు – దేశ నాయకుల మీదా వారి ఆశీస్సులుంటాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- చెరసాలలో జననం… మహనీయులు – 2020… జూలై 23
- బాలగంగాధర్ తిలక్ & మహర్షి శుద్ధానందభారతి & శివమ్మతాయి–Audio
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
- అది మాత్రం అడగకూడదు …..సాయి@366 డిసెంబర్ 30….Audio
- సాయి ముంగిట తొలి ‘స్వాతంత్య్ర’ వేడుక …..సాయి@366 ఆగస్టు 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments