Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా పాదాలకు నమస్కరిస్తున్న బాపూ సాహెబ్ జోగ్ చేతిలో నుండి ఒక పార్సెల్ జారి సాయి పాదాలపై పడ్డది. అది ఏమిటని ప్రశ్నించాడు సాయి.
ఆ పార్సెల్ విప్పి, ఆ గ్రంథాన్ని సాయి చేతిలో పెట్టాడు జోగ్. సాయి ఆ గ్రంథాన్ని తీసుకుని, తన జేబులో నుండి ఒక రూపాయి తీసి, ఆ గ్రంథంపై ఉంచి, ఆ గ్రంథాన్ని, ఆ రూపాయితో సహా జోగ్ కు ఇస్తూ, “దీనిని మొత్తం చదువు. శుభం కలుగుతుంది” అన్నారు సాయి. ఆ గ్రంథం గీతా రహస్యం.
గీతా రహస్యాన్ని వ్రాసింది బాలగంగాధర తిలక్. ఆ గ్రంథం తిలక్ మాండలే చెరసాలలో ఉండగా వ్రాశాడు. అది భగవద్గీతకు కర్మ పరంగా తిలక్ చేసిన వ్యాఖ్య.
భగవద్గీతను చెప్పిన కృష్ణుడే చెరసాలలో పుట్టాడు. చెరసాలలో పుట్టిన కృష్ణుడు చెప్పిన ఆ గ్రంథానికి, చెరసాలలో ఉన్న తిలక్ వ్యాఖ్య వ్రాశాడు. ఆ గ్రంథరాజం జననం కూడా చెరసాల.
తిలక్ అకోలాలో శివాజీ జయంతినాడు చేసిన ప్రసంగానికి గజానన్ మహారాజ్ వెళ్ళారు. గజానన్ మహారాజ్ కూడా “గం గం గణ గణాంత బోతే…అంటూ పాడారు.
తిలక్ ను రాజ ద్రోహ నేరంపై ఆంగ్ల ప్రభుత్వం జైలుకు పంపాలనుకుంది. తిలక్ కు సమయంలేక తన మిత్రుడైన కొల్హాట్ కర్ ను గజానన్ మహారాజు వద్దకు పంపారు.
గజానన్ మహారాజ్ నిద్రిస్తున్నారు. లేపటానికి ఎవరూ సాహసించలేదు. మూడు రోజులు నిద్రించారు గజానన్.
నిద్ర లేచి “….ఛత్రపతి శివాజీకి కూడా సమర్థ రామదాసు తోడున్నారు. ఐనా చక్రవర్తి బంధించాడు. సజ్జనులకు బాధ కలగకుండా స్వరాజ్యం రాదు.
బొంబాయిలోని తిలక్ కు ఈ విషయం చెప్పి, ఈ రొట్టెను ఇవ్వు. ఈ రొట్టె యొక్క శక్తిచే అతడు ఒక మహత్తర కార్యాన్ని సాధిస్తాడు. ఎంత దూరం పోయినా అతనికి తిరుగు లేదు” అని కొల్హాట్ కర్ కు రొట్టె ఇచ్చారు గజానన్.
తిలక్ కు అర్థమైంది, చెరసాల తప్పదని. “నా చేత ఎదో మహత్కార్యం జరుగబోతున్నట్లుంది. అదే మహారాజు అమృత వాక్కులోని సందేశం” అని దంతాలు లేకున్నా, ఆ రొట్టెను అతి కష్టమైనను, భక్తితో తిన్నాడు తిలక్. తిలక్ జైలుపాలయ్యాడు.
మాండలే జైలులో భగవద్గీత రహస్యాన్ని మహారాష్ట్ర భాషలో రచ్చించాడు. అందు కర్మ మార్గమే శ్రేష్టమని తిలక్ చెబుతాడు.
అటు స్వాతంత్య్ర సముపార్జనా ప్రణాళికలో తనకు తానె సాటి అని లౌకికంగా నిరూపించాడు తిలక్ ” స్వాతంత్య్రం నా జన్మ హక్కు” అంటూ గణపతి ఉత్సవాలు, శివాజీ జయంతులు జరిపి దైవ భక్తి, దేశ భక్తిని ప్రోత్సహించాడు.
కర్మ యోగిగా గీతా రహస్యాన్ని రచించాడు. భారత ప్రభుత్వం 23. 07. 1956న తపాలా బిళ్ళను అయన సంస్మరణార్థం విడుదల చేసింది.
నేడు తిలక్ ను స్మరిద్దాం, గీతా రహస్యాన్ని పరిరక్షిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గంగం గణగణ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 8
- గజానన…..సాయి@366 సెప్టెంబర్ 8…Audio
- శ్రీ గజానన్ మహరాజ్
- తిలక్ మహాశయుడు…..సాయి@366 మే 19….Audio
- దివ్య జననం…. మహనీయులు – 2020… సెప్టెంబరు 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments