గజానన…..సాయి@366 సెప్టెంబర్ 8…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


అది పూనా నగరం. ఆగస్టు 17, 1925వ సంవత్సరం. ”నా ఫకీర్‌ తాజ్‌ వెళ్ళిపోయాడు” అని బాబా జాన్‌ అన్నది తన దగ్గర ఉన్న సందర్శకులతో.

ఎవరికీ అర్థం కాలేదు. తెల్లవారింది. వార్తా పత్రికలు తాజుద్దీన్‌ బాబా ఆగస్టు 17న మహా సమాధి చెందారన్న వార్తను ప్రచురించాయి.

తాజుద్దీన్‌ బాబాను బాబా జాన్‌ ‘నా ఖలీఫా’ అనేది. షిరిడీలో కూడా అలాగే జరిగింది,

1910 రుషి పంచమి రోజున. ”నా ప్రాణం నన్ను విడచి పోతోంది, నా ఆత్మ శరీరాన్ని విడిచేస్తోంది” అని సాయి పలికి, ఎంతగానే దుఃఖంతో ఉన్నారని కపర్దే కుమారుడు తెలిపాడు.

అంటే షేగాంలో గజానన్‌ మహారాజ్‌ శరీరాన్ని విసర్జించిన రోజు అది. సాయికి గజానన్‌కి గల అనుబంధం వర్ణనాతీతము.

షేగాంలో భాద్రపద చవితినాడు గణపతిని ప్రతి ఇంటా పూజించిరి.

మరుసటి దినమున తన వారిని దగ్గరకు పిలిచాడు గజానన్‌ మహారాజ్‌ ”చతుర్ధి నాడు పార్ధివ గణపతిని అర్చించి, పూజించి ఆ మరుసటి దినమున విసర్జన చేసి నిమజ్జనము గావింతురు. ఆ దినము నేడే.

అటులనే ఈ పార్ధివ దేహమును (తన దేహమును) నేడే విసర్జించు చున్నాను. నేను మిమ్ములను కాపాడి, రక్షించి, ఉద్దరించుటకు వచ్చితిని.

ఈ శరీరము మనము కట్టుకొను వస్త్రము వలె విసర్జింపవలసి ఉన్నది” అని గజానన్‌ మహారాజ్‌ పలికారు. ఆయన భక్తులకు ఆయన గణపతి. భక్తులందరూ దుఃఖింపసాగారు.

తండ్రిని ఏ కుమారులు వదులుకొందురు. షిరిడీలో ఉన్న సాయి బాబాయే తన ప్రాణం (గజానన్‌) తనను విడిచి పోతోందని విలపించినపుడు,

సామాన్య మానవులు ఆ వియోగాన్ని తట్టుకొన గలరా? ఆ సంగతి గజానన్‌కు తెలియని విషయము కాదు.

”నేను వెలిపోతిని అని అనుకొనకుడు. మీ భక్తి యందు భేదము రానీయకుడు. నన్నెన్నడును మరువకుడు. నేనిచ్చటనే ఉండెదను. మిమ్ములను కాపాడెదను” అన్నారు గజానన్‌ అక్కడున్న వారితో.

 ”జై గజానన్‌” అంటూ ఆయన పాంచభౌతిక శరీరాన్ని విడిచారు. ఆయన భౌతికశరీరాన్ని మాత్రమే విడిచారు. వారు ఎల్లప్పుడు తన వారిని విడువడు, మరువడు.

అయితే ఆయన మనలను ఎట్లు జ్ఞప్తియందు ఉంచుకొనును? నిరంతరము గజానన్‌ మహారాజుల స్మరణయే సులభ మార్గము.

నేడు సెప్టెంబరు 8 (కాని ఋషి పంచమి కాదు) ఆంగ్ల కాలమాన ప్రకారం గజాననులు నేడే మహా సమాధి చెందిన దినం.

”ఓం గంగం గణ గణ గణాంత బోతే”

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By:  Mr:  Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles