Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సాహిత్యంలో సంఘటనలు ఎక్కువగా అంకిత భక్తుల జీవితాలలోనే ఉంటాయి అనుకొనరాదు.
రామచంద్ర అమృతరావ్ దేశ్‌ముఖ్ షిరిడీ నివాసి. ఆయన తల్లి సాయి భక్తురాలు. దేశ్‌ముఖ్ బాబా భక్తుడు కాడు.
దేశ్‌ముఖ్ పెద్ద కుమార్తెకు టైఫాయిడ్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించినా వ్యాధి నయము కాలేదు.
ఊదీతో ఆ పాప వ్యాధి నయమైంది. డాక్టరు మందులు పనిచేయని స్థితిలో ఊదీ పనిచేసినదని గ్రహించి అతను కూడా బాబా భక్తుడైనాడు.
ఒక రోజు తెల్లవారు ఝామున దేశ్‌ముఖ్ తల్లి స్నానానికై వెళ్ళి నేల బారుగా ఉన్న నూతిలో పడిపోయింది.
తెల్లవారిన తరువాత నూతిలో నుంచి మూలుగు వినిన కుటుంబ సభ్యులు వెళ్ళి చూసి ఆమెను నూతిలో నుంచి బయటకు తీసిరి.
నూతిలో సుమారుగా 20 అడుగుల నీరున్నను ఆమె కంఠము వరకు మాత్రమే తడి ఉండుట చూసి ఆశ్చర్యపడగా ఆమె నేను పడబోయే సమయంలో ”బాబా, బాబా” అని బాబాను స్మరించినాను. బాబాయే నన్ను నీట మునగ కుండా రక్షించినాడు అని వివరించింది.
ఆ సంఘటనతో దేశ్‌ముఖ్‌కు బాబా యందు పూర్తి విశ్వాసము కలిగింది.
దేశ్‌ముఖ్ పెద్ద కుమార్తె పెళ్ళీడుకు వచ్చినను ఏ సంబంధము కుదరలేదు. ఇదే విషయమును శ్రీ శివనేశన్ స్వామి వద్ద చెప్పుకొని బాధపడినాడు దేశ్‌ముఖ్.
స్వామీజీ వెంటనే ”నీవు సచ్చరిత్ర పారాయణ ప్రారంభించు. నీ పారాయణ పూర్తి అగుటకు ముందే మగ పెళ్ళి వారు తమంతట తామే నీ ఇంటికి వస్తారు” అని చెప్పగా
దేశ్‌ముఖ్ స్వామి మాటలయందు పూర్తి విశ్వాసముంచి పారాయణ ప్రారంభించగా స్వామి చెప్పినట్లే వివాహము కుదిరినది.
ముహూర్తము 18 మే, 1975న. వివాహానికి 500 మంది వస్తామని చెప్పి పెళ్ళికి 800 మంది వచ్చారు. చేసిన భోజనములు చాలవు.
వెంటనే దేశ్‌ముఖ్ స్వామి వద్దకు వెళ్ళి తన సంకట పరిస్థితిని వివరించగా స్వామీజీ ”అన్ని పాత్రలలోను ఊదిని వేసి, వాటిపై బట్టను కప్పుము.
వడ్డించేటప్పుడు కూడా బట్టను పూర్తిగా తొలగించ వద్దు” అని చెప్పగా వారు అట్లే చేయగా అందరూ భోజనములు చేసిన తరువాత వండిన పదార్ధములన్ని పాత్రలలో అట్లే ఉన్నవి.
స్వామి సలహాపై ఆ వంటకములను ద్వారకామాయి వద్ద బీదలకు వితరణ చేసిరి.
ఇది సాయి మాత కటాక్షమా? లేక మాతా అన్నపూర్ణ కటాక్షమా? అసలు ఇరువురు వేరయితే కదా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్ ….. సాయి @ 366 ఫిబ్రవరి 3….Audio
- వివాహ భోజనం.. …. మహనీయులు – 2020… డిసెంబరు 23
- కబీరు – సాయి…..సాయి@366 జూన్ 30…Audio
- బాధల బదిలీ…..సాయి@366 డిసెంబర్ 18….Audio
- అపర భగీరధుడు …..సాయి@366 అక్టోబర్ 18….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments