బాలగంగాధర్ తిలక్ & మహర్షి శుద్ధానందభారతి & శివమ్మతాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-43-Tilak-by-Lakshmi-Prasanna 3:41

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాలగంగాధర్ తిలక్

వీరు భారతదేశ స్వాతంత్రోద్యమమును నడిపిరి. జైలు జీవితమును గడిపిరి. ఖపర్డే వీరికి మిత్రులు. 1917 మర్చి 17వ తేదిన వీరు షిర్డీ దర్శించిరి. బాబా గురు స్థాన్ లో వేపచెట్టు క్రింద కూర్చొని యుండగా బాబాను దర్శనం చేసుకొనెను.

బాబా అతనిని ఆశీర్వదించి “సోజా! స్వరాజ్ ఆతా హై (స్వరాజ్యం వస్తుంది)” అని వీరితో అనిరి. అదే రోజు తిలక్ గారు తిరిగి వెళ్ళిపోయిరి.

మహర్షి శుద్ధానందభారతి

ఇతను కవి, యోగి. 1917లో బాలగంగాధర తిలక్ తోపాటు ఇతను బాబాను దర్శించెను. ఆసమయమున బాబా గురుస్థానంలో వేపచెట్టు క్రింద కూర్చొని యుండెను. ఖపర్డే వారికీ బాబా దర్శనం చేయిన్చిరి.

బాబా శుద్ధానంద భారతిని ప్రేమతో తన వద్దకు పిలిపించిరి. “ఊరుకో! దేవుడు మేలుచేస్తాడు” అని అతనితో అన్నారు.

బాబా వీరికి అచటి వేపచెట్టు వేపాకులు కొన్ని ఇవ్వగా ఆయన నోట్లో వేసుకుంటే అవి తీయగా ఉన్నట్లు ఆయనకు అనిపించాయి.

శుద్ధానంద భారతిలోని నిశ్శబ్ద ధ్యాన వదనము, నెమ్మది స్వభావము బాబాకు నచ్చాయి.

ఆరతి సమయంలో వీరు బాబాపై హిందీలో మంచి పాట పాడారు. అప్పుడు బాబా శుద్ధానంద భారతితో “నోరు మూసుకో. హృదయం తెరుచుకో.

భయపడకు, నేనున్నాను. ప్రశాంతంగా ఉండు. నీవు తుపానునైన ఎదుర్కొన గలవు. ఈ శరీరం త్వరలో నశించవచ్చు. నేను శరీరం కాదు. సాధకులకు సాయం చేసేందుకు నేను అన్ని చోట్ల ఉంటాను” అని అన్నారు.

“బాబా నాకు చైతన్య నిశ్శబ్దాన్ని, అంతర్ వాణితో సంబంధాన్ని ఇచ్చారు. దానితో నేను రమణ మహర్షి, అరవిందులు వంటి మహనీయుల కరుణకు పాత్రుడనైనాను.

నా జీవిత లక్ష్యం సాధించాను. సాయినాధుల జీవశక్తి, సాధకులకు అంతర్ మార్గదర్శియైన శాశ్వత జ్యోతి” అని శుద్ధానంద భారతి అన్నారు.

శివమ్మతాయి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వేళ్ళకిడారు గ్రామస్తురాలు. ఈమెను రాజమ్మ అని కూడా పిలిచేవారు. ఈమె బాబాను స్వయంగా 1915 లో దర్శించినది.

ఒకసారి బాబా చెన్న బసప్ప –వీరభద్రప్ప కధ మశీదులో చెప్పుచున్నప్పుడు ఈమె అచటనే యుండి ఆ కధను విన్నది. 1915 ప్రాంతంలో ఈమె 24వ యేట బాబా ఖండయోగము చేయగా స్వయంగా చూచినది.

అలాగే ధౌతి యోగ క్రియ కూడా చూచినది. బెంగుళూరులోని మడివాల ప్రాంతంలో రూపెన్ అగ్రహారములో శివమ్మతాయి షిర్డీ సాయి ఆశ్రమం ఉన్నది. ఈ వివరం మై లైన్ విత్ షిర్డీ సాయి అను పుస్తకంలో ఉన్నది.

source: షిర్డీ సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు, రచన: అల్లూరి గోపాలరావు గారు

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాలగంగాధర్ తిలక్ & మహర్షి శుద్ధానందభారతి & శివమ్మతాయి–Audio

Maruthi

saibaba…saibaba…saibaba…saibaba

సాయినాథుని ప్రణతి

సాయి ఈ లీలలు చాలా బాగునాయి .ఒక చిన్న వినపం . నేను ఈ రోజు దాసగణు మహరాజ్ చరిత్రి కొదిగా చదివాను ఎంత బాగుందో ఆయన చరిత్ర .నాకు ఎంతో ఆనందాని ఇచ్చింది .బాబా పరంగా దాసగణు కిర్తనలు , ఆయన పద్దతి ,కిర్తనలు చెసిన దాసగణు ఏ విదమైన కనుకలు తిసుకోక పోవడం .ఎదుటి వారి మనస్సు నొచుకోకుండ వాట్టిని చాకచెక్యంగా తిర్సకరించడం ఎంతో హ్యపిగా అనిపించి చదువుతుంటే .మీరు దాసగణు మహరాజ్ గురించి upload చెసినట్లు నాకైతే తెలియదు .నేనేతే ఈ సాయిలీలాస్ లో చదవలేదు మీకు విలైతే దాసగణు మహరాజ్ గారి గురించి ఇందులో upload చెస్తే అందరు చదివి ఆనందిస్తారని అనిపించి చెబుతునాను సాయి

Sai Suresh

దాసగణు గారి గురించి ఇంక అప్లోడ్ చేయలేదు సాయి. ఈ మద్యనే ఒక సైట్ లో ఇంగ్లీష్ ఆర్టికల్ ఆయన గురించి చూసాను సాయి. చాలా పెద్ద ఆర్టికల్ సాయి. బాబా అనుగ్రహం ఉంటె త్వరలో అనువాదిస్తాను సాయి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles