షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-42-Anugraham-3-by-Lakshmi-Prasanna 5:58

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం  – గీతాంజలి

ఆటో అతను హోటల్ లో రూము ఏమన్నా బుక్ చేసుకున్నారా అని అడిగాడు.

ద్వారావతి కి చేరుకున్నాక రూము కోసం ప్రయత్నించాలి, ముందు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళు అన్నాము. ద్వారావతిలో చాలా వెయిటింగ్ ఉంటుంది,

అందుకని మందిరానికి దగ్గరలో ఉన్న హోటల్ లో గది తీసుకుంటే మంచిదని చెప్పాడు

ఆటో అతను. ముందర ద్వారావతి భక్తనివాస్ కి వెళ్ళి ప్రయత్నం చేద్దామనిపించింది నాకు.

ముందర ద్వారావతి భక్త నివాస్ కి పోనివ్వు, అక్కడ గది ఏమీ దొరకకపోతే మరొకచోట ప్రయత్నించవచ్చని చెప్పాను.

భక్త నివాస్ కి చేరుకున్నాక అక్కడ కౌంటర్ లో ఉన్న అతనితో గదులు ఏమయినా ఉన్నాయా అని అడిగాను.

అతను నావైపు చిరునవ్వుతో చూసి, నాన్-ఏసీ గదులు లేవు, ఒకే ఒక్కటి 3 బెడ్ ఏ.సీ. రూం ఉందని చెప్పాడు.

అదనంగా పరుపు వేయడానికి కుదురుతుందా అని అడిగాను. 50 రూపాయలు చెల్లిస్తే అదనంగా పరుపు వేస్తామని చెప్పాడు.

నేను నాభర్తతో ఆటోలోనించి సామాను తీసుకురమ్మని చెప్పి, భక్తనివాస్ లో గది తీసుకున్నాము.

బాబాయే మాకంతా ఏర్పాటు చేశారనిపించింది. నేనింతకు ముందు ఇక్కడికి  వచ్చినపుడు గదుల కోసం గంటలకొద్దీ భక్తులందరూ వేచిఉండటం నాకు తెలుసు.

మరి మా విషయంలో ఇప్పుడు వెంటనే గది దొరకడం అంతా బాబా లీల.

మేము గదిలోకి వెళ్ళి, బాబా దర్శనానికి వెళ్ళడానికి అందరం స్నానాలు కానిచ్చాము.

ద్వారకామాయిలో సాయంత్రం ఆరతికి వెళ్ళాక, రాత్రికి సమాధి మందిరంలో ఆరతి చూద్దామనుకున్నాము.

రాత్రి ఆరతికి మాకు పాసులు ఉన్నాయి. సాయంత్రం ద్వారకామాయిలో ఆరతికి వెళ్ళాము.

బాబాకు సమర్పించడానికి నేను రెండు బాక్సులు కోవా, ఒక కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళాను.

వీటిని బాబా స్వీకరించారనడానికి గుర్తుగా నాకేదయినా నిదర్శనం బాబా చూపాలి అనుకున్నాను.

మేము దర్శనానికి వెళ్ళినపుడు, భక్తులంతా కొబ్బరికాయలను అక్కడ ద్వారకామయిలో ఉన్న తొట్టెలో వేస్తున్నారు.

అక్కడ లోపల ఒక గార్డ్ ఏదో పనిచేసుకుంటూ ఉన్నాడు.

బాబాకు నేను సమర్పించదలచుకున్నవాటిని తొట్టెలో వేయడానికి నాకిష్టం లేకపోయింది. నేను ఆ గార్డుని పిలిచి నేను తెచ్చిన కోవా, కొబ్బరికాయ బాబాకి సమర్పించమని అభ్యర్ధించాను.

అతను నవ్వుతూ ఇష్టపూర్వకంగా ఒక కోవా తీసి బాబా నోటివద్ద పెట్టి, రెండుకోవాలు, కొబ్బరికాయ బాబా ముందర పెట్టాడు.

నా చిన్న కోరికను మన్నించి బాబా తన కృపని నామీద చూపినందుకు నేనెంతో సంతోషించాను.

మేమంతా దీపాలు వెలిగించడానికి నందదీపం దగ్గర ఉన్న లెండీ బాగ్ కి వెళ్ళాము.

నాతో కూడా దీపాలు, వాటికి సంబంధించిన సరంజామా అంతా తెచ్చుకున్నాను. కాని స్వామి గారికి ఈ విషయం గురించి చెప్పడం మరిచాను.

దీపాలు వెలిగించే ముందు, స్వామిగారి భార్యకు కూడ ఆ అవకాశం ఉంటే బాగుండుననిపించింది.

బయట షాపు దగ్గరికి వెళ్ళి ఆమెకు కూడా, దీపాలు, నూనె, అగరుబత్తీలు పట్టుకుని వచ్చాను.

గురుస్థాన్ వద్ద వెలిగించడానికి నేను అగరువత్తులు తెచ్చుకున్నాను. అన్నీ కూడా మేము కలిసి చేసుకోవడం నాకెంతో తృప్తినిచ్చింది. వేపాకు కూడా ఒకటి దొరికితే  బాగుండుననిపించింది.

నా ఈ కోరికని కూడా బాబా తీర్చారు. ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి నాకొక వేపాకును ఇచ్చాడు.

నాకెంతో ఆనందాన్నిచ్చిన ఆ క్షణాన్ని, ఆ అనుభూతిని పాఠకుల ఊహకే వదలివేస్తున్నాను.

మందిరంలో కాసేపు కూర్చుని, శేజ్ ఆరతికి బయలుదేరాము. గార్డ్ మమ్మల్ని రాత్రి 10 గంటలకి లోపలికి వదిలాడు.

సమాధి మందిరంలోకి వెళ్ళడానికి ముందు ఒక చోట గార్డ్ అందరినీ ఆపేసి, కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు. మాముందున్న సి.సి టీ.వీ లో మందిరంలో జరిగే వాటినన్నిటినీ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము.

అందులో ద్వారకామాయి, చావడి ఒకదాని తరువాత మరొకటి ప్రసారం చేస్తున్నారు.

ద్వారకామాయిలో ఒక పిల్లి తిరుగుతూ కనిపించింది. మాముందున్న కొంతమంది వయసుమళ్ళిన దంపతులు, మేము అందరం ఆ పిల్లి గురించే మాట్లాడుకుంటున్నాము.

నేనెప్పుడు వచ్చినా ఆ పిల్లిని చూస్తూ ఉంటానని చెప్పాను. ఆ పిల్లి ఈ ద్వారకామాయి చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంటుందని అందరూ అనుకోవడం విన్నానని చెప్పాను.

ఒక భక్తుడు నాతో, “ఆ పిల్లి కొంతమంది ఒడిలో మాత్రమే కూర్చుంటుంది, అది వచ్చి వడిలో కూర్చుంటే అది శుభ సంకేతమ”ని చెప్పాడు.

ఈ సంభాషణ తరువాత మేము ఆరతికి వెళ్ళాము. బాబా దయవల్ల మాకు ముందు వరుసలోనే చోటు దొరికింది. అక్కడి నుంచి మేము బాబాని సులభంగా చూడగలము. ఆరతి జరుగుతుండగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది.

ఆరతి తరువాత మరలా ద్వారకామాయిలోకి వెళ్ళి కూర్చోవాలి. పిల్లి నా వళ్ళోకి వచ్చి కూర్చుంటే కనుక నేననుకున్నకోరిక నెరవేరుతుంది అనుకున్నాను.

రేపు తరువాయి భాగం

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles