Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-44-Baba-Darshan-3-by-Lakshmi-Prasanna 2:19
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
గుమ్మదల్లి లక్ష్మీనారాయణ
ఇతను సికింద్రాబాద్ వాసి. తరువాత బొంబాయి వెళ్లి అక్కడ వ్యాపారం చేసేవాడు.
ఇతను అప్పుడప్పుడు షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శిస్తూ ఉండేవాడు. బాబా తాను సమాధి చెందటానికి కొన్ని సంవత్సరముల ముందు ఈ లక్ష్మీనారాయణతో “నీవు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి గొప్ప దేవాలయమును నిర్మాణం చేయవలసి యున్నది” అని అనిరి.
కాని లక్ష్మీనారాయణ అప్పటికి ధనవంతుడు కాదు. బాబా చెప్పిన ఈ పనిని ఎలా చేయవలేనో అని ఆలోచించుకుంటూ యుండేవాడు.
అయితే కొన్ని సంవత్సరములు గడిచేటప్పటికి ఇతను బాగా సంపాదించి కోటీశ్వరుడు అయినాడు.
బాబా అన్న ప్రకారము 1928, 29 సంవత్సరంలో సికింద్రాబాద్ లో ఇమాంబాలి వీధిలో 6 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయమును నిర్మించాడు.
సాయి మాట అక్షరాల నిజమైయింది. బాబా మాటలు పోల్లుపోవు అని విశదమయింది.
నరసింహరాజు
నేను మొదట షిర్డీ వెళ్ళినప్పుడు అచటి మహారాష్ట్ర భాష నాకు బొత్తిగా తెలియదు.
కాని బాబాను దర్శించిన తరువాత బాబా చెప్పు కధల యందలి భాషను తెలుసుకొను పరిచయ భాగ్యం అతి త్వరలోనే కలిగినది. ఇందుకు కారణమూ బాబా యొక్క అనుగ్రహమే.
“బాబాకు దక్షిణ మూలమున వచ్చు దానికంటే బాబా ఇతరులకు ఇచ్చు మొత్తము ఎక్కువగా యుండెడిది.
అట్టి మహాపురుషుడైన సాయిబాబా పాద సేవ చేయు భాగ్యం ఈ జన్మలో ఏ కొద్దిగానైనా లభించుట వలన నేను ఎంతయో ధన్యుదనైనానని నమ్మ్ముచున్నాను” అని నరసింహరాజు తన అభిప్రాయమును తెలిపినారు.
source: షిర్డీ సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు, రచన: అల్లూరి గోపాలరావు గారు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – మొదటి భాగం–Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – రెండవ భాగం–Audio
- సాయిని దర్శించిన తెలుగు మహిళ …..సాయి@366 ఆగస్టు 8…Audio
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments