బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-45-Baba-Darshan-4-by-Lakshmi-Prasanna 3:15

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

నందిపాటి జగన్నాయకులు

వీరు విజయవాడ వాస్తవ్యులు. వీరు 1910 లో వ్యాపారము నిమిత్తము బొంబాయి వెళ్ళుచుండెను. మార్గ మద్యములో షిర్డీ అనే గ్రామములో షిర్డీ అనే గ్రామంలో ఒక ఔలియా యున్నారని వారిని దర్శించమని ఒక వృద్ధుడు పదే పదే ఇతనికి చెప్పెను.

ఇతను షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించగా సాయిబాబా ఆ వృద్ధుని రూపంలో కనిపించినారు. అప్పుడు తనను దర్శించమని బాబాయే స్వయంగా వచ్చి తెలిపినారని అతడు గ్రహించినాడు.

జగన్నాయకులకు తరువాత తన ఇష్ట దైవమైన “పారాడే బాలకృష్ణుని” గా సాయిబాబా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అప్పటినుండి జగన్నాయకులు బొంబాయి వెళ్ళిన ప్రతిసారి మార్గ మధ్యమున షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుచునడేడివారు. ఇతను సాయిబాబాకు ప్రీతిపాత్రుడైనాడు.

బెహరాబాబురావు

వీరిది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం. అచట వీరికి 200 ఎకరముల పోలముయున్నది. ధనవంతుడు. గొప్ప శివ భక్తుడు. ఇతను ప్రతిరోజూ శివునకు అభిషేకం చేసి, పూజ చేసిన తరువాత 100 మంది అతిధి, అభ్యాగతులకు భోజనం పెట్టేవాడు.

పర్వదినములలో ద్రాక్షారామంలో గల భీమేశ్వరుని సేవించేవాడు. పై అంతస్తులో కూర్చొని శివుని ధ్యానించేవాడు.

ఈవిధంగా యుండగా అతని ఆస్తి హరించుకుపోయింది. ఇతను తన బావగారైన వాడ్రేపు వీరేశలింగం గారితో మనశ్శాంతికి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నాడు.

ప్రధమ దర్శనంలోనే ఇతను సాయిబాబాను ఆకట్టుకున్నాడు. వీరిద్దరు దీక్షిత్ వాడలో బస చేశారు. అచట భోజన హోటలును సగుణ మేరు నాయక్ నిర్వహించేవాడు.

ఇతను మసీదుకు వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నప్పుడు అక్కడ ఉదయం దర్బారు జరుగుచున్నది.

ఇతను ఏమియు చెప్పక మునుపే సాయిబాబా ఇతనితో “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? నేను అక్కడ కూడా ఉన్నాను. నీవు ద్రాక్షారామం వెళ్లి మందిరం పై భాగమున కూర్చుండి శివ ధ్యానం చేయి. నీకు శివుని కృప బాగా ఉన్నది” అని ఊధిని ఇతనికిచ్చి అచట నుండి వెంటనే అతనిని వేల్లిపోమ్మనిరి.

సాయిబాబా అలా ఆదేశించాక శ్యామా వీరితో “స్వస్థలం చేరమని, సాయి కృప వీరికి సంపూర్ణముగా యున్నదని” అన్నారు. వీరిని, వీరి వంశం వారిని సాయినాధుడు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నారు.

ఈ నాలుగు భాగాలలో ఏడు లీలలు ఆంధ్రదేశము నందలి సాయి భక్తులకు సంబంధించినవి.

source: షిర్డీ సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు, రచన: అల్లూరి గోపాలరావు గారు

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles