Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
- Mir-37-Baba-Darshan-1-by-Lakshmi-Prasanna 3:46
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఇంతవరకూ బాబాను సజీవంగా దర్శించుకున్న ఎందరో భక్తుల గురించి మనకు తెలుసు.
కాని బాబా ను దర్శించుకున్న మన తెలుగు వారి గురించి మనలో చాలామంది సాయి భక్తులకు తెలియదు. మూడవ అధ్యాయంలో ప్రధాన ఇంటిలోని తెలుగు పూజారి మాధవభట్టు గురించి మాత్రం తెలుసు.
మనం ఇప్పుడు ఆంధ్ర దేశం నుండి బాబాను దర్శించుకున్న కొందరు తెలుగు భక్తుల గురించి తెలుసుకుందాం.
మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహారావు
అప్పట్లో షిర్డిలో తగు వసతులు లేకపోయినా సాయిబాబాను దర్శించిన వారిలో ఉన్నతోద్యోగులు మనకు కనిపిస్తారు. అటువంటి వారే హైదరాబాదు నివాసి అయిన మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహారావుగారు.
బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో ఇతను కలెక్టరుగా పనిచేసి యున్నాడు.
ఇతను 1888లో సాయిబాబాను దర్శించి “బాబా! మా వంశములో మూడు తరముల నుండి అడపెల్లలు లేరు. కనుక మాకు ఒక స్త్రీ సంతానమును ప్రసాదింపుమని” ప్రార్ధించినాడు.
అతని ప్రార్ధనను మన్నించిన సాయిబాబా “అవుతుందిలే, పో” అన్నారు. సాయిబాబా ఆశీస్సులతో అతనికి ఆడపిల్ల కలిగినది.
పుట్టిన ఆడపిల్లను తీసుకొని మరలా షిర్డీ వెళ్లి ‘ఆ పిల్లకు ఏమి పేరు పెట్టాలి’ అని బాబాని అడిగారు. శృంగేరి శారదాదేవి పేరు పెట్టు అని బాబా చెప్పారు.
బాబా చెప్పిన ప్రకారము ఆ పిల్లకు శారదాదేవి అని పేరు పెట్టారు. ఆమె వివాహ అనంతరం గాలి శారదాదేవి గా పిలువబడింది. లక్ష్మీ నరసింహరావు గారికి బాబాతో 40 సంవత్సరాల పరిచయం ఉంది.
గాలి శారదాదేవి
ఈమె మంత్రిప్రగడ లక్ష్మీనరసింహరావు గారి కుమార్తె. ఈమె కోపర్ గాం లో ఉంటూ షిర్డిలో సాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉండేది. షిర్డిలో వసతులు తక్కువగా యుండుట,
నీటికి కూడ కరువుగా ఉండుట ఇందుకు కారణం. ఈమె తన భర్త నరసింహారావుతో పాటు సాయిబాబాను దర్శించేది. వీరుకి సంతానం లేని కారణంగా సంతానం ప్రసాదించమని సాయిబాబాను కోరేవారు.
కాని బాబా వీరిని ఆశీర్వదించలేదు.
అప్పటి పరిస్థితులను గురించి ఆమె ఇలా చెప్పింది.
బాబా గంభీర హృదయులు. ఎక్కడకి వెళ్ళేది, ఏమి చేసేది బాబా ఎవరికి తెలియనివ్వలేదు.
అర్ధ రూపాయి, పావలాలు, బేడలు మొదలగు నాణెములను ఒక్కొక్క భక్తుని పేరు చెప్పి తిడుతూ రుద్దటం ఈమె ఒకసారి చూసారట. సాయి తిట్లు భక్తునకు ఆశీర్వాదం అని అబ్దుల్ అనే భక్తుని వద్ద నుండి తెలుసుకున్నది.
source: షిర్డీ సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు, రచన: అల్లూరి గోపాలరావు గారు
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
Latest Miracles:
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – నాల్గవ భాగం—Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – మూడవ భాగం—Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – రెండవ భాగం–Audio
- సాయిని దర్శించిన తెలుగు మహిళ …..సాయి@366 ఆగస్టు 8…Audio
- బాలాభావు మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments