సాయిని దర్శించిన తెలుగు మహిళ …..సాయి@366 ఆగస్టు 8…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహ రావు నైజాంలో ఉన్నతోద్యోగి. ఆయనకు సాయితో 40 ఏండ్ల పరిచయం ఉంది.

ఆయన సాయిని దర్శించి ”బాబా, మా వంశంలో మూడు తరాలుగా ఆడ పిల్లలు లేరు. కావున మమ్ము అనుగ్రహించి ఒక స్త్రీ సంతానాన్ని ప్రసాదించు” అని ప్రార్ధించాడు. సాయి అనుగ్రహించాడు.

ఆయన సోదరునకు ఆడపిల్ల జన్మిస్తే షిరిడీకి వెళ్ళి ”బాబా, ఏమి పేరు పెట్టాలి?” అని అడిగాడు. సాయి ”శృంగేరి శారదా దేవి పేరు పెట్టు” అన్నారు.

ఆగస్టు 8, 1888న జన్మించిన ఆ శిశువు మంత్రిప్రగడ శారదా దేవి అయింది. వివాహానంతరం గాలి శారదా దేవి అయ్యింది.

ఆమెకున్న మరో పేరు ‘పెద్ద బొట్టు’. ఈమె తరచు షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకునేది.

ఆమె ఒకసారి భర్తతో సాయిని దర్శించింది. సంతానాన్ని కోరింది. కానీ సాయి వారిని ఆశీర్వదించలేదు.

మరొకసారి శ్రీమతి సీతారావమ్మ గారితో సాయిని దర్శించింది. ఆమె లెక్చరరు భార్య. దసరా ఉత్సవాలకని వారు షిరిడీ వెళ్ళారు.

దుర్గాష్టమి నాడు వారిని పిలిచి, నమస్కారం పెట్టించుకుని, సీతారావమ్మ గారి పొట్టపై తన్నారు సాయి.

”ఇంకా ఇక్కడ ఉండవద్దు. పొండి. ఇంటికి” అన్నారు సాయి కోపంగా. సాయి వెళ్ళమన గానే వెళ్ళాలి. దసరా పండగనాడు అక్కడ ఉందామని వచ్చిన వారిని పంపి వేశారు సాయి.

సీతారావమ్మ గారిని ఆమె భర్త ఎంతో చులకనగా చూసేవాడు ఆమెకు సంతానం కలుగ లేదు కాబట్టి.

సీతారావమ్మ గారితో ”సాయి లీలలకు ఎన్నో అర్థాలుంటాయి. కావున ఎవరి మాటలను లక్ష్యపెట్టక సాయిని నమ్మి ఉండు. నీకు అంతా మేలే జరుగుతుంది” అన్నది శారదా దేవి.

తరువాత ఐదు మాసాలకు సీతారావమ్మ గారు గర్భవతి అయ్యారు. ఆమె భర్తకు కలలో సాయి కన్పించి

”ఈమెకు (నీ భార్యకు) సంతానం లేదని నీచాతి నీచంగా మాట్లాడే వాడివి. ఆమె మహా ఇల్లాలు కాబట్టి నోరు మూసుకున్నది. ఇంకను ఆమెకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు. ఈ శిశువుకు ‘సాయి కుమార్‌’ అని నామకరణం చేయి” అన్నారు.

సాయి భగవానుని కోపం కూడా కరుణా ప్రసాదమే! అంటారీ గాలి శారదా దేవి గారు ఉరఫ్‌ పెద్దబొట్టు.

Compiled by: – ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented by: – Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles