పతితులారా…. మహనీయులు – 2020… జూన్ 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గిరీష్ చంద్ర స్నేహితుడు కాళీపద ఘోష్. గీరిష్ వలెనే కాళీపదుడు నీతిబాహ్యుడు.

విష్ణు ప్రియాంగిని కాళీపదుని ఇల్లాలు. తన భర్తలో మార్పురావటానికి ఏదైనా ఔషధం ఇస్తారేమోనని రామకృష్ణ పరమహంసను ఆశ్రయించింది.

పరమహంస శారదా మాత వద్దకు పంపారు ఆమెను. శారదా మాత తిరిగి ఆమెను పరమహంస వద్దకే పంపింది. ఇలా మూడు సార్లు జరిగింది.

శారదా దేవి పూజించిన బిల్వ దళం మీద రామకృష్ణుల నామం వ్రాసి, భగవన్నామమును జపించమన్నది ప్రియాంగినిని.

ప్రియాంగిని  ఎడతెరిపి లేకుండా 12 సంవత్సరాలు భగవన్నామమును జపించింది.

ఓక రోజు కాళీపదుడు గిరీష్ తో పరమహంసను దర్శించగా “భార్యను 12 సంIIలు యాతనపెట్టిన తరువాత ఈ వ్యక్తి (కాళీపదుడు)వచ్చాడు” అన్నారు. “నీకు ఎం కావాలి?” ప్రశ్నించారు పరమహంస.

కాళీపదుడు సిగ్గులేకుండా “కాస్త మద్యం ఇస్తారా?” అని అడిగాడు. పరమహంస నవ్వి “ఇస్తాను, ఆ మత్తును నీవు భరించలేవు” అన్నారు పరమహంస.

“అది బ్రిటన్ లో తయారైందా?” కొంచెం ఇవ్వండి” అని ప్రాధేయపడ్డాడు కాళీపదుడు.

“పూర్తిగా ఇంట్లో తయారైంది. ఈ మద్యాన్ని చవిచూస్తే చాలు, బ్రిటిష్ మద్యం బలాదూర్” అన్నారు పరమహంస.

కాళీపాదుడు ఆలోచనలో పడ్డాడు. దయచేసి నా కివ్వండి” అని వేడుకున్నాడు. కాళీపాదుడు.

పరమహంస అతనిని స్పృశించారు. అతడు విలపింపసాగాడు. మెలమెల్లగా శాంతిని పొందాడు.

రామకృష్ణ పరమహంస సత్తా గ్రహించాడు కాళీపదుడు. ఒకసారి రామకృష్ణులు బోటులో ప్రయాణిస్తుంటే  కాళీపాదుడు రామకృష్ణ పాదాలను వదలకుండా పట్టుకుని

“నేను ఈ లోకాన్ని వదిలేటప్పుడు నా చుట్టూ చీకటి కమ్ముకుని ఉంటుంది. ఆ నిశీధి నన్ను భయపెడుతుంది. ఆ సమయంలో మీరే నా రక్షకులు. ఆ సమయంలో మీరు ఎడమ చేతితో దీపం పట్టుకుని, కుడి చేతిలో నన్ను పట్టుకోవాలి. నేను మీతో ఉండిపోతాను. నా ఈ ప్రార్ధనను నెరవేర్చండి” అని విలపించాడు.

గురుదేవులు ‘సరే’ అన్నారు. ఆ నీతి బ్రష్టుడు ఉత్తమ భక్తుడయ్యాడు.

ఒకసారి కాళీపదుడు శ్రీరామకృష్ణుల ఆరాధనకై  తోటలో నుండి పుష్పాలను తెచ్చాడు.

మన్మోహన్ అనే మరో భక్తుడు “చెప్పులు ధరించిన తెచ్చిన పుష్పాలను  పూజకు అనర్హం” అన్నాడు.

కాళీపదునకా విషయం తెలియదు. వెంటనే చెప్పులు వదలి, బజారుకు వెళ్ళి పూలు కొని తెచ్చాడు. ఇది ఆతని భక్తి.

కాళీపదుడు జూన్ 28 (1905) దేహాన్ని విడిచాడు. ఆ సమయంలో కాళీపదుడు తన కుడి చేతిని తుది శ్వాస పీల్చే సమయంలో పైకెత్తాడు.

ఆ సంఘటనను గూర్చి “చూడండి, చివరి క్షణంలో గురుదేవులు కాళీపదుని వద్దకు వచ్చారు. కాళీపదుని చేయి పుచ్చుకుని, గురుదేవులు అతడిని తోడ్కొని వెళ్ళారు. సోదరుడు బాబూరాం ఆ దృశ్యాన్ని స్పష్టంగా చూశాడు” అన్నారు.

నేడు జూన్ 28, కాళీపదుని వర్థంతి. పతితుడైనా, భ్రష్టుడైనా నిజమైన ప్రశ్చాత్తాపంతో గురుదేవులను  నమ్మితే గురుదేవులు అన్నీ చూసుకుంటారు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles