Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు” అన్నారు సాయిబాబా.
అది 1883 వైశాఖ మాసం. దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస కళామందిరంలో ఉన్నారు.
ఒక రైతు తన కుమారుని ఒక పాము కాటువేసిందని, మరణించాడని, మరణించిన ఆ బాలుని భుజంపై వేసుకుని వచ్చాడు.
ఆ బిడ్డను ఆలయం బయట పరుండబెట్టమని, ఎవరో వస్తారని చెప్పాడు రామకృష్ణ పరమహంస. రైతు అలాగే చేశాడు.
కాసేపయింది. ఇంతలో ఒక భజన బృందం వచ్చింది అక్కడకు. దానికి నాయకుడు బారాబాబా (రాధారమణ్ చరణ్).
బారా బాబా సిల్కు గుడ్డతో చేయబడిన పంజాబీ కుర్తాలో ఉన్నాడు. దానికి బంగారు గుండీలు ఉన్నాయి.
చేతిలో ఒక కర్ర, కాళ్ళకు బూట్లతో సంకీర్తన చేసుకుంటు వచ్చాడు. ఆయన రామకృష్ణను కలవటం అదే మొదటిసారి.
రామకృష్ణ పరమహంస బయటకు వచ్చాడు. ఆయన కూడా ఆ బృందంతో కలసి పాడుతూ, నాట్యం చేయసాగాడు.
సంకీర్తన అయిపోయిన తరువాత రామకృష్ణ పరమహంస “నన్ను దక్షిణేశ్వరంలోను, నిన్ను నదియాలోను ఉంచాడు” అన్నాడు రాధారమణ్ తో ఎంతో పరిచయం ఉన్నవాడిలా.
“నీవు ఈ కుర్రవాడిని బ్రతికించాలి” అన్నారు రామకృష్ణ ఆ రైతు బిడ్డను చూపుతూ. ” ఆ పని నీవే చేయవచ్చుగా” అన్నాడు రాధారమణ్ చరణ్.
“కాదు నీవే చేయాలి” అన్నారు రామకృష్ణులు. నీవంటే నీవు అని కాసేపు అనుకున్నారు వారిరువురు.
చివరకు రాధారమణ్ చరణ్ అంగీకరించి ఇక నామ సంకీర్తన ప్రారంభించాడు. అందరు ఆ సంకీర్తనలో పాల్గొన్నారు.
అందరూ చూస్తుండగానే అత్యంత ఖరీదైన బట్టలతో వచ్చిన రాధారమణ్ చరణ్ వంటి మీదున్న బట్టలు అన్ని మాయమయ్యాయి. లంగోటి మాత్రమే ఉంది ఆయన ఒంటిమీద.
ఆ నామ సంకీర్తనలో ఒంటిమీద స్పృహయే లేదు రాధారమణ్ చరణ్ కు రామకృష్ణ పరమహంసకు.
ఇంతలో ఒక నాగుపాము వచ్చి తాను కాటువేసిన శరీర భాగం నుండి విషాన్నంతా తీసి, అక్కడుంచిన పాలను త్రాగి, అరటి పండ్లను తిని దక్షిణ దిశగా వెళ్ళిపోయింది.
ఇదంతా కలలోని సంఘటనా అనిపించింది చూచేవారికి. కుర్రవాడు సజీవుడైనాడు.
ఒకేసారి రాధారమణ్ చరణ్ మరికొందరు భక్తులతో పూరీలో సంకీర్తన చేస్తుంటే, మహా ప్రసాదానికి రండని ఒక ఆశ్రమవాసి వచ్చి చెప్పి వెళ్ళారు.
చరణ్ బృందం చిరిగిన బట్టలతో, బిచ్చగాళ్లవలె ఉంది. వారికి మహా ప్రసాదాన్ని రహదారిపైనే చిరిగిన ఆకు వేసి వడ్డించబోయారు.
తమ ఉత్తరీయాన్ని నేలపై పరచి, దానిపై ఆ చిరిగిన ఆకును ఉంచి, మహా ప్రసాదాన్ని వడ్డింపమన్నారు రాధారమణ్ చరణ్.
అది మహా ప్రసాదానికి ఇచ్చే విలువ. అన్నదానము చేయగానే సరికాదు, ఆ అన్న ప్రసాదానికి ఉన్న విలువను గ్రహించాలి.
నేడు రాధారమణ్ చరణ్ జన్మదినం, ఏప్రియల్ 13 (1853).
“హరే కృష్ణ హరే రాం…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పతితులారా…. మహనీయులు – 2020… జూన్ 28
- తెలుసుకో ఈ నిజం…. మహనీయులు – 2020… మే 25
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- ప్రేమ …. మహనీయులు – 2020… జూలై 13
- దర్శనం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 25
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments