Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీపట్టాడు. ఆ కుస్తీలో సాయిబాబా గెలుపొందలేదు.
రామకృష్ణ పరమహంస తనను దర్శింపవచ్చిన హరిప్రసన్న ఛటోపాధ్యాతో “నీకు కుస్తీపట్టటం వచ్చా? నాతొ ఏ మాత్రం కుస్తీపడతావో చూస్తాను” అన్నారు.
హరిప్రసన్న బలిష్టుడు, పైగా యువకుడు. కుస్తీపట్టే సమయంలో పరమహంస చేతులనుండి ఒక విధమైన విద్యుత్ ప్రవాహం హరిప్రసన్న శరీరంలో ప్రవేశించింది. హరిప్రసన్న బలాన్నంతా కోల్పోయి, ఆనందపారవశ్యం చెందాడు.
రామకృష్ణులు “నీవే గెలిచావు” అన్నారు. సద్గురువులు కుస్తీపట్టటం ఆయన ఆధ్యాత్మిక శక్తిని ఇతరులకు పంచటానికే.
సాయిబాబా కూడా శ్రీమతి కపర్డే చేతులను ఒత్తుతూ ఆధ్యాత్మిక శక్తిని ఆమెలో ప్రవేశపెట్టారు.
హరిప్రసన్న చదువుకునే రోజుల్లో రాధికా ప్రసాద్ తో పోటాపోటీగా ఉండేవారు. ఆ ఇద్దరిలోనే ఎల్లప్పుడు మొదటి, రెండవ స్థానాలుండేవి.
రాధికా ప్రసాద్ కు ఉద్యోగం అత్యవసరం. పోటీ పరీక్షకు వీరిద్దరు హాజరుకావాలి. తనకు తప్పకుండా మొదటి స్థానం వస్తుందని హరిప్రసన్నకు తెలుసు.
ఉద్యోగం అవసరమైన రాధికా ప్రసాద్ కు పోటీరాకుండా, ఆ పరీక్షకు వెళ్ళకుండా మానేశాడు హరిప్రసన్న. ఇది అతని ఔదార్యం.
హరిప్రసన్న సన్యాసం స్వీకరించి స్వామి విజ్ఞానంద అయ్యారు. ఆధ్యాత్మికంగా ఎన్నో మెట్లు ఎదిగారాయన.
ఒకసారి ఆయన శయన భంగిమలో నున్న బుద్ధ విగ్రహాన్ని చూడటానికి వెళ్ళారు. ఆయన బుద్ధ భగవానుని ప్రేమపూర్వకంగా చూడనరాంభించాడు.
పర్యవసానం ఆయన ఇలా చెప్పారు “ఇవాళ బుద్ధ భగవానుడు దయతో దర్శనం నాకు అనుగ్రహించాడు. ఆ విగ్రహం శయన భంగిమలో సజీవంగా ఉన్నట్టు నాకు కనిపించింది. బుద్దిని తేజోమయ స్వరూప సౌందర్యం ఎంతో వైభవాన్వితమైంది” అంటే కనపడినది విగ్రహమూర్తి కాదు, విగ్రహంలో ఉన్న సజీవమూర్తి.
మరోసారి ఆయన దక్షిణ కలకత్తాలోని కాళీమాత ఆలయంలోని విగ్రహాన్ని దర్శించారు. ఆయనకు జగన్మాత అనంతమైన కరుణతో దర్శనమిచ్చింది.
ఆ మాత ఆయనలోని కుండలినీ శక్తిని సహస్రారం చేరుకునేటట్లు చేసి, ఉత్తేజపరచి, దివ్య తేజోమయం చేసింది.
ఆయన ఏప్రియల్ 25 (1938)న దేహాన్ని త్యజించారు. భక్తులు ఆయన పవిత్ర దేహాన్ని గంగా యమునా సంగమ స్థానానికి తీసుకుని వెళ్ళి, రాతి పేటికలో ఉంచి ఆ సంగమ స్థలంలో నిమజ్జనం చేశారు. అచటనే ఆయన త్రివేణీ మాత దర్శనం పొందారు గతంలో.
దర్శించునది విగ్రహమును కాదని, దైవమునే అనే అనుభూతి మనకును కలుగు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురువు శిష్యుడాయే… …. మహనీయులు – 2020… ఆగస్టు 31
- అంతిమ సందేశహరుడు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 20
- గురు శక్తి – శిష్య భక్తి …. మహనీయులు – 2020… ఏప్రిల్ 15
- ఆకలుండదు, దహముండదు. …. మహనీయులు – 2020… ఏప్రిల్ 29
- సబ్ కా మాలిక్ సాయి …. మహనీయులు – 2020… ఏప్రిల్ 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments