Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నావైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేనును నీవైపు అటులనే చూచెదను” అంటారు సాయిబాబా.
సద్గురు శక్తి కట్టెలోని అగ్ని వంటిది. శిష్యుని భక్తియే ఆ శక్తిని రగల్చగలదు. ఈ విషయం దూదేకుల సిద్దయ్య జీవితంలో చూడవచ్చు. ఈయన గురువు పోతులూరి వీరబ్రహ్మంగారు.
ఒకసారి పోతులూరి వీరబ్రహ్మంగారు శిష్యులతో వెళ్తున్నారు. ఒక లోహకారుడు పనిచేసుకుంటుంటే, అతని వద్దకు పోయి దాహం, దాహం అని పదే పదే అడగసాగారు.
అతడు విసుగుచెంది తాను మరిగిస్తున్న లోహాన్ని పటకారుతో పట్టుకుని లోహపు మూసలో పోసి అందించాడు.
బ్రహ్మం గారు సల సల కాగుతున్న ఆ ద్రావకాన్ని కొంచెం ఉంచి మిగతాది త్రాగారు. ఈ మిగిలిన ద్రావకాన్ని ఎవరు త్రాగుతారని బ్రహ్మంగారు ప్రశ్నించారు.
ఎవరూ ముందుకు రాలేదు. సిద్దప్ప(య్య) ముందుకు వచ్చి, గురువుగారికి నమస్కరించి, ఆ ద్రావకాన్ని త్రాగాడు. చూచేవారందరూ, శిష్యులతో సహా, తెల్లబోయారు.
మరొకసారి కుక్క కపాలంలో ఉన్న నీటిని శిష్యులను త్రాగమన్నారు. త్రాగటానికి ఎవరూ ముందుకురాలేదు.
సిద్దయ్య మాత్రం త్రాగేందుకు సిద్దమయ్యాడు. గురువుకు నమస్కరించి త్రాగాడు. ఆ మురికి నీరు పరమ అసహ్యంగా అందరికి కనిపిస్తే సిద్దయ్యకు మాత్రం అమృతమైంది.
సిద్దయ్య గురు భక్తికి అందరూ సంతసించారు. సిద్దయ్య తన గురువు వెంటే ఉండేవాడు ఎల్లప్పుడు. గురువుగారి సందేశాన్ని అంతటా వ్యాపింప చేశాడు.
ఒకసారి తిమ్మారెడ్డి అనే వ్యక్తి పాముకాటు వలన మృతి చెందాడు. గోవిందయ్య అనే వ్యక్తి తిమ్మారెడ్డిని బ్రతికింపమని సిద్దయ్యను ప్రార్ధించాడు.
సిద్దయ్య తన గురువును స్మరించి, ఆ మృతునిపై మంత్రోదకం చల్లాడు. తిమ్మారెడ్డి సజీవుడైనాడు.
సిద్దవటంలో సిద్దయ్య తన గురువును గూర్చి అక్కడున్న వారికి తెలియచేస్తున్నాడు. ఆ సమయంలో సిద్దవటం నవాబు వచ్చాడు.
నవాబును చూచినా, సిద్దయ్య నమస్కరించలేదు. ఎందుకు నమస్కరించలేదని నవాబు అడిగితే, ” నా నమస్కారం పొందే శక్తి వీరబ్రంహ్మేంద్రుల కొకరికే ఉంది” అన్నాడు సిద్దయ్య. నిదర్శనం అడిగాడు నవాబు.
అక్కడున్న రచ్చబండకు నమస్కరించాడు సిద్దయ్య. అది తునాతునకలైంది. సిద్దయ్య గురు భక్తి అందరకూ తెలిసింది. సిద్దయ్య మహాయోగి. అనేక తత్వాలు రచించాడు.
“ఏలకులమని నను వివరంబడిగితె
ఏమని తెల్పుదు లోకులకు,
లోకులకు పలుగాకులకు,
దుర్మార్గులకు, ఈ దుష్టులకు….” వంటి ఈయన తత్వాలు ప్రజాదారణ పొందాయి.
తన గురువు మహాసమాధి చెందే సమయంలో అక్కడ లేనని విలపించిన సిద్దయ్యకు సమాధి రాళ్ళను తొలగించుకుని వచ్చి దీవించారు వీరబ్రహ్మంగారు.
సిద్దయ్యగారి ఆరాధనోత్సవాలు చైత్ర శుద్ధ పాడ్యమి, విదియలలో (ఏప్రియల్) జరుగుతాయి.
మనకు సిద్దయ్యకున్న గురు భక్తి అలవడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6
- కఠినం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 6
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- తాతకు తగ్గ మనుమరాలు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 8
- సజీవ గురువు! …..సాయి@366 ఏప్రిల్ 13…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments