తాతకు తగ్గ మనుమరాలు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఈశ్వరమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి గారి మనుమరాలు. ఈమె అఖండ బ్రహ్మవాదిని.

ఈమె తన తాతగారి వలె, గద్య, పద్య, గేయ, వచనాత్మకాలైన తత్వ సాహిత్యాన్ని రచించింది. అవి జనరంజకమైనాయి. ఈమె తాతగారి వలె అనేక మహిమలను కూడా చూపింది.

పెద్దారి గట్ల గ్రామంలో కొందరు ఈమె మహత్యాన్ని పరీక్షింపదలచి దిగ్బంధన యంత్రం ప్రతిష్టించి, దానిపైన ఆమె కూర్చుండి పూజ చేసుకోవటానికి పీఠం అమర్చారు.

ఆమె ఆ విషయాన్ని గ్రహించి, “మీ మంత్ర విద్య అంతా ప్రయోగించారా?” అంటూ, ఎవరూ కదపజాలని ఆ పీఠాన్ని ఎడమ చేతి బొటన వ్రేలితో జరిపింది.

ఆమె శక్తి అందరకూ తెలిసింది. అదే సమయమున అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

అన్నియు సిద్దమైనవి. పొరుగూరి నుండి నేయి రాలేదు. ఈశ్వరమ్మ తన మాటగా చెరువులోని గంగమ్మ తల్లిని అడిగి కావిళ్ళతో నీరు తెమ్మంది. ఆ తీర్థం నేయిగా మారింది.

ఆ నీటిని అందరకూ వడ్డించారు. కొద్ది సేపటికి పొరుగూరి నుండి నేయి వస్తే, ఈశ్వరమ్మ ఆ నేతిని చెరువులోని గంగమ్మకు అర్పించి రమ్మంది. ఈ విషయం మరింత ఆశ్చర్యం కలిగించింది అందరకూ.

ఒకసారి ఈశ్వరమ్మగారి పట్టు చీరలు, సొమ్ములు ఉన్న పెట్టెను దొంగలు ఎత్తుకొనిపోయి తమ పెట్టెలలో దాచుకున్నారు.

ఈ సంగతిని ఈశ్వరమ్మ దివ్య దృష్టితో గ్రహించింది. ఆమె సొమ్మును పంచుకున్న వారి బట్టలు, సొమ్ములు కాలిపోయాయి.

దొంగలు దీనిని ఈశ్వరమ్మ మహాత్తుగా గ్రహించి, ఆమె సొమ్ములు, బట్టలను మఠం ప్రాంగణంలో పెట్టి పారిపోయినారు.

ఈశ్వరమ్మ త్రికాలజ్ఞాని అని, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయురాలిగా గుర్తించి కొందరు ఆమె నుండి ఉపదేశం పొందారు.

ఈమె జీవితాంతం బ్రహమచారిణిగానే ఉంది.

ఈమె తన పితామహుని వలె కొంత కాలం కాలజ్ఞానం రచించింది.

వీరబ్రహ్మంగారు శ్రీ మహా విష్ణువు అంశతోను, ఆయన భార్య గోవిందమ్మ శ్రీ మహాలక్ష్మీ అంశంతోను పుట్టినారని,

ఆ ఇరువురు రంగరాజు, ఈశ్వరమ్మలుగా పుట్టి అవివాహితులుగా ఉండిపోయినారని, మునుముందు రంగరాజు వీరభోగ వసంత రాయలుగా, ఈశ్వరమ్మ ఆయనకు ధర్మపత్నిగా అవతరించి, కాలజ్ఞానంలో చెప్పబడిన ధర్మరాజ్యం స్థాపిస్తారని భక్తుల విశ్వసిస్తారు.

ఈశ్వరమ్మ 8 – 12 – 1830 (మార్గశిర బహుళ నవమి) నాడు మహాసమాధి చెందినది.

నేడు డిసెంబర్ 8,  ఈశ్వరమ్మ వర్థంతి.

నేడు ఆమెను స్మరించెదము గాక!

” ఈశ్వరమ్మ నీవు గాక మోక్షమిచ్చే దాత లెవ్వరు?…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles