నే నెవరు?. …. మహనీయులు – 2020… డిసెంబరు 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీరమణులు తన తండ్రి ఆజ్ఞను అనుసరించి, ఆయనను అన్వేషిస్తూ బయలు దేరాడు. గమ్యం చేరాడు.

జనులను విన్నూత్న ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం చేయించారు, ఉన్నత శిఖరాలను చేరేటట్లు చేశారు.

అయినా లౌకిక కోర్కెలను ఆయన ఏ నాడూ తీవ్రంగా గర్హించమనలేదు – తానెవరన్నది అన్వేషింపుమన్నారాయన.

తానొకడైనా తలకొక రూపైనారు.

శ్రీ రుద్రరాజ పాండే అనే ఒక నేపాలీ దేశీయుడు రమణుల దర్శనానంతరము తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని దర్శిస్తున్నాడు – “నాకు లింగం కనబడకపోగా, ఆ స్థానంలో చిరునవ్వు వెదజల్లుతున్న శ్రీరమణ మహార్షి ముఖం కనిపించింది.

మెరిసే కళ్లు, నా వైపే చూన్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన దేమిటంటే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ముఖాలు నా వైవు చూస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఆ గుడిలో ఎక్కడ చూచినా భగవాన్‌ వదనమే” అన్నారు. రమణులు శివ రూపమా?

శ్రీ టి.కె. సుందరేశ అయ్యర్‌కు రమణులెవరో తెలియరాలేదు. రమణులు ఆయనను తన వంక చూడమన్నారు. వెంటనే అయ్యర్‌కు శ్రీ సీతా, రామలక్ష్మణ, భరత, శతృఘ్న హనుమంతుల దర్శనం అయింది.

ఆ దర్శనం వలన కలిగిన ఆనందాన్ని వర్ణించలేనన్నారాయన. అలా ఆయన రెండు గంటల సేపు మహదానందాన్ని పొందాడు.

ఒక రాత్రి గణపతి మునితో నడుస్తూ, నడుస్తూ రమణులు హఠాత్తుగా ఆగిపోయారు. ఆకాశంలో పూర్ణ చంద్రుడు వెలుగుతున్నాడు. అంతకన్నా మిన్నగా రమణులు వదనం తేజస్సుతో వెలిగిపోతోంది.

ఎదురుగా కనిపించని దేన్నో రమణులు చూస్తున్నట్లనిపించింది గణపతులకు.

గణపతి మునితో రమణులు “నాయనా ఆ నక్షత్రాలు, సూర్య చంద్రాదులు, నాలో నుండే వెలువడుతున్నాయి. అవన్నీ నా పాదాల చుట్టూ వరిభ్రమిన్తున్నట్లు చూస్తున్నాను.

నాయనా! నేనెవరిని? నేనెవరిని? – ”

అని గంభీర స్వరంతో గణపతి మునులను ప్రశ్నించారు రమణులు. గణపతి ముని “భగవాన్! మీరు వేదాలు వర్ణించిన పురుషోత్తములు” అంటూ శ్రీ రుద్రాన్ని పురుష సూక్తాన్ని స్కంద సూక్తాన్ని ఆనంద భాష్పాలతో గానం చేశారు.

రమణులు డిసెంబర్‌ 30, 1879 అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జన్మించారు. అంటే ఆయన జయంతి డిసెంబర్‌ 31.

నేడు డిసెంబర్‌ 31, ఆయన జయంతి.

రమణులు నిత్యులు. సాయిబాబా వలెనె జగత్‌ కళ్యాణమునకు అవతరించిన విశ్వరూపులు.

వారి రక్షణ అందరకూ ఎల్లవేళలా లభించు గాక!

“సాయి రమణ రక్ష

సర్వ జగదక్ష!”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles