Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భారతదేశ రాష్ట్రపతులు బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ లు, బెనారస్ హిందూ యూనివర్సిటి సంస్థాపకుడు పండిత మదన్ మోహన్ మాళవ్యా, వినోబాభావే మొదలైన గొప్పవారు దైవరాతను వేదఋషిగా, గురువుగా భావించేవారు.
వేదాల గూర్చిన సందేహాలు వచ్చిన వారు, వారి వద్దకు వస్తే దైవరాత వద్దకు వారు పంపేవారు.
దైవరాత గురువు కావ్యకంఠ గణపతి ముని. కావ్యకంఠ గణపతి ముని గురువు రమణ మహర్షి.
దైవరాత భగవాన్ రమణులతో ఉంటూ, భిక్షాన్నాన్ని తెచ్చి భగవాన్ ముందుంచి “ఇంద్రాయ స్వాహా” అనేవారు.
సాయిబాబాకు భూత, భవిష్యత్, వర్తమానాలను మార్చగల శక్తి ఉంది. దైవరాత రమణుల ఒక శక్తిని గూర్చి తెలియ చేశారు.
భగవానుల నుండి తాను దూరంగా ఉండటమే అని గ్రహించి, 15 రోజుల ప్రయాణానంతరం తిరువణ్ణామలై చేరి, ఆనంద భాష్పాలతో వారి ఎదుట నిలబడ్డాడు.
“ఇప్పుడే కొద్ది నిమిషాల క్రిందటే, నీ గురించే అనుకున్నాను. నిన్ను చూడాలని గట్టిగా అనిపించింది. ఇంతలో నువ్వు ఇక్క్డడ ఉన్నావు” అన్నారు రమణులు దైవరాతతో.
కొద్ది క్షణాల క్రిందటే అన్నప్పటికి, అది పదిహేను రోజుల వెనుకకు వెళ్లి, దైవరాతని ప్రయాణానికి సిద్దమయేటట్లు చేసింది.
దైవరాతని కన్నీరు కారేటట్లు చేసి, అయన (రమణులను) దర్శనానికి పోయేటట్లు చేసింది.
డైవరాతుడు ధ్యానం చేస్తుండగా అయన నోటి నుండి కొన్ని శబ్దాలు వెలువడుతున్నట్లు గణపతి ముని గమనించారు.
అవి వేదం మంత్రాలకు సన్నిహితమైనవిగా గణపతి ముని గ్రహించి, వాటిని లిఖించారాయన.
వాటిని అన్వయ భాష్యం అనే పేరుతొ గణపతి ముని వ్యాఖ్య వ్రాశారు. శిష్యుని నోటి వెంట వచ్చిన వేద చందోబద్ధ మంత్రాలకు గురువు అయిన గణపతి ముని వ్యాఖ్య వ్రాయటం ఒక విశేషమే.
వేదస్రష్ట, వేద ద్రష్ట అయిన దైవరాతుని భావాలు అతి నవనీతమైనవి. స్త్రీలకు, పురుషులతో పాటు వేదాధ్యయనం సహా సర్వ హక్కులున్నాయని, హరిజనులకు ఏ బ్రాహ్మణునితో నైనా సరిసమాన ఆధ్యాత్మిక హక్కులున్నాయని దైవరాతులు ఘటాపథంగా చెప్పారు.
అయన గురు భక్తి సాటిలేనిది. కావ్యకంఠ గణపతి ముని కుమారుడైన మహాదేవ శాస్త్రిపై అన్యాయంగా ఒక నేరారోపణ జరిగితే, దైవరాతుడు రాజేంద్ర ప్రసాద్ జోక్యం కలిగించుకునేటట్లు చేసి, గురు పుత్రుణ్ణి రక్షించాడు.
జలరాం బాపా కూడా ఒకసారి గురువు యొక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఖైదు చేయగా బలరాం అతనిని కాపాడాడు. అది గురు భక్తి.
బ్రహ్మర్షి దైవరాతులవారు 1975 ఆగస్టు 13న శరీరం చాలించారు. నేడు ఆగస్టు 13. దైవరాతుని, కావ్యకంఠ మునిని, రమణ మహర్షిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
- నే నెవరు?. …. మహనీయులు – 2020… డిసెంబరు 31
- సాయి స్తవన మంజరి…..సాయి@366 సెప్టెంబర్ 9….Audio
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments