కడుపులో బాధ అనే మిషతో నన్ను తన దగ్గరికి చేర్చుకున్న బాబా వారు!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ లో 1982 వ సంవత్సరం నుండి 1994 వ సంవత్సరం వరకూ ఉన్నాము .

మా ఇంట్లో ఎనిమిది మంది ఉండేవారము. ఇంటికి నేను పెద్ద కోడలిని అవటాన  వంట చేసి పెట్ట వలసి వచ్చేది.

ఇంటి పనులన్నీ నేనే చూసుకునేదాన్ని ఉదయాన్నే నాలుగు గంటలకి లేవటం, ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో క్యారేజీలు ఇచ్చి,

టిఫిన్లు చేసి అందరినీ వారి వారి పనులకి, స్కూళ్ళకి, కాలేజీలకు పంపి అత్తగారికి మామగారికి జావ కాచి ఇచ్చి, ఇవన్నీ అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యేది.

మళ్ళి వంట పనులు, భోజనాలు అయ్యాక అన్ని సర్దుకునేటప్పటికి మళ్ళీ సాయంత్రం పనులు రెడీగా ఉండేవి పనులన్నీ చూసుకుని పడుకునేసరికి రాత్రి 12 గంటలు అయ్యేది.

ఈ పనుల ఒత్తిడిలో సమయానికి తిండి తినక నాకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తు ఉండేది.

1980వ సంవత్సరంలో నాకు కడుపు నొప్పి, కడుపులో మంట కూడా ఉండేది. ఏ పదార్ధం తిన్న కూడా ఇంకా ఎక్కువగా మంట రావటంతో చాలా బాధ పడుతూ ఉండేదాన్ని,

పగలు అంతా నొప్పి ఉండేదికాదు. రాత్రి పూట బాధ ఎక్కువగా ఉండి, నిద్ర ఉండేది కాదు.

పగలు అంతా పని చేయవలసి వచ్చేది. ఒక రోజు డాక్టరుకి చూపించాము. వాళ్ళు పరీక్షలు చేసి Duodenal ulcer  అని చెప్పారు.

మందులు రాసారు. పత్యాలు చెప్పారు. ఆ మందులు వాడుతూ, పళ్ళ రసాలు, వట్టి పప్పు, చల్లని పాలు, మజ్జిగ అన్నంతో కాలం గడపాల్సి వచ్చింది.

నెలలు గడుస్తున్నా బాధ అధికం అయ్యేదే కానీ తగ్గటం లేదు. చాలా మంది డాక్టర్లకి చూపించినా, మందులు మెరుగుపరచినా కూడా ఫలితం శూన్యం.

ఆ డాక్టర్స్, ఈ డాక్టర్స్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, అన్ని అయిపోయాయి. చివరికి ALL INDIA MEDICAL SCIENCE వాళ్ళకి ఒక డాక్టర్ రిఫర్ చేసారు.

వాళ్ళు అన్ని రకాల పరీక్షలు జరిపారు. వారికి కూడా ఇది ఏమిటో ఎందుకు నాకు ఇలా మంట వస్తుందో, వారు కనిపెట్టలేకపోయారు.

చివరికి వాళ్ళు నన్ను ఒక experimental thing గా పిలవటం , టెస్ట్ చేయటం అలా నా మీద రీసెర్చ్ చేసారు. ఏమి చేసిన నా బాధ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం మాత్రం లేదు.

ఇంతలో 1995 ఆగస్టు నెలలో మా వారికి హైదరాబాద్ transfer అయింది. వనస్థలిపురం లో వైదేహి నగర్ లో ఇల్లు తీసుకున్నాము.

మా ఇంటికి దగ్గరగా ఒక ”సాయి బాబా” గుడి ఉంది. నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి బాబా గుడిలో విష్ణు లలిత సహస్ర నామాలు చదవటానికి వెడుతుండేదానిని.

వారానికి ఒకటి రెండు సార్లు నుంచి రోజు రావటం, బాబాకి కాసేపు సేవ చేసుకోవటం మొదలైంది.

ఇందులో శ్రీ రామ నవమి, గురుపౌర్ణమి బాబాకి ముఖ్యమైన పర్వదినాలు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినా,  ప్రాంతం మారినా కూడా నాలో ఉన్న బాధ నాతో పాటు హైదరాబాదుకీ వచ్చేసింది.

బాధ పడుతూనే మందులు మింగుతూ ఉండేదాన్ని. నాకు బాబా ఆ గుడిలోనే కాదు అంతకు ముందే పరిచయం అయ్యారు.

అది 1978 వ సంవత్సరంలో మా వదిన గారు మా ఇంటికి బాబా ఫోటో ఒకటి తీసుకువచ్చి, మా ఇంట్లో పూజలు అవి చేసేవారు.

నేను అంతకు ముందు ఆ ఫోటో చూడలేదు. ఈయన ఎవ్వరు అని మా వదినను అడిగాను.

ఆవిడ, ఈయన షిరిడి సాయిబాబా, ఈయన్ని పూజ చేస్తే కోరికలు సిద్ధిస్తాయి అని, ఆయన గురించి, ఆయన మహిమలు గురించి చెప్పారు అంతా. విని ఓహో అలాగా అని ఊరుకున్నాను.

హైదరాబాద్ వచ్చిన తర్వాత సేవకోసం రోజూ బాబా గుడికి రావటం అలవాటు అయింది. వచ్చిన రెండు సంవత్సరాలకి బాబాకి కోటి నామ అర్చన చేయాలి అని గుడి సభ్యులు సంకల్పం చేసారు.

నలభై రోజుల పాటు జరిగింది ఆ పూజ. అప్పట్లో ఆ గుడి చిన్న విగ్రహంతో చిన్నగా ఉండేది. రోజూ రావటం, పూజలో కూర్చుంటూ ఉండేదాన్ని.

వారం  రోజులు అలాగే గడిచి పోయింది. భక్తులు వస్తూవుండేవారు, పూజలో కూర్చుంటూ వుండేవారు, అలా జరుగుతూ ఉండేది.

ఒక రోజు పూజ మొదలైంది, నేను అక్కడే కూర్చున్నాను, తన్మయత్వంతో ఒక సారి కళ్ళు మూసుకుని తెరిచాను.

నా ఎదురుగా సాక్షాత్తూ ఆ సాయినాథుడు కాలు మీద కాలు వేసుకుని ఆశీర్వదిస్తూ దర్శనం ఇచ్చాడు. నేను మైమరచిపోయి ”బాబా గారు అక్కడ ఉన్నారు, హారతిని ఇవ్వండి” అంటూ అరిచానుట.

మిగిలిన భక్తులకి అక్కడ ఏమి కనపడలేదు. అందుకనే వాళ్ళు అంతా తెల్లమొఖం వేసారట. ఏం జరిగిందో ఎందుకు అలా నేను అరుస్తున్నానో, కాసేపటికి అక్కడ ఉన్న పూజారులకు అర్ధమైంది.

వెంటనే నేను చూపించిన ప్రదేశంలో బాబా కి హారతికి ఇచ్చారు. కొంచెం సేపటికి ఇంక బాబా నాకు కనపడలేదు ఇది నేను పొందిన మొట్ట మొదటి అనుభవం మర్చిపోలేనిది.

పైగా పదునెనిమిది సంవత్సరాలుగా నన్ను ఎంతగానో బాధపెడుతూ, ఎన్ని మందులు వాడినా ఎంతో పత్యం చేసినా, ఎందరి దేవుళ్ళకి మ్రొక్కినా తగ్గని అల్సర్ ను తగ్గించడానికి సాక్షాత్తూ ”షిరిడి” సాయినాథుడే స్వయంగా వచ్చి నా బాధను పోగొట్టటమే కాకుండా ఆయన మీద నాకు భక్తిని, నమ్మకాన్ని పెపొందించి నిరంతరం ఆయన సేవలో నిమగ్నం అయ్యేటట్టు చేసాడు.

అంటే నా కడుపు నొప్పి బాధ ఆ రోజుతో బాబా దర్శనంతో, బాబా ఆశీర్వాదంతో పారిపోయిందన్న మాట.

అప్పుడప్పుడూ గుడికి వచ్చేదాన్ని ఇప్పుడు రోజూ రావటం, ఎక్కువ సమయం బాబా సేవలో గడపటం చేస్తున్నాను.

ఈ అల్సర్ కి ఆన్సర్ చెప్పింది బాబాయే. ఆయన తన దగ్గరికి చేర్చుకోవటానికి ఈ అల్సర్. అదే అనుకుంటా ఆన్సర్.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles