నా దారికి అడ్డుపడి మరీ నన్ను తన దారికి తెచ్చుకున్నారు బాబా.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి నాథ్ మహారాజ్ కి జై .

ఓం సాయి రామ్ .

నా పేరు మేడా  లక్ష్మి ప్రసన్న,  హైదరాబాద్.

బాబా ఒకసారి ఇలా అన్నారు. నా భక్తులు ఎక్కడ, ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగుతాను అని.

ఆ మాట అక్షరాల నిజం నా విషయంలో అది ఎలా అంటే 2005 సంవత్సరం నాటికి నాకు, బాబాకి మద్య ఏ బందము లేదు.

బహుశా నా కర్మ ఫలితం అలా ఉండి ఉండవచ్చు, కాని నా జీవితం లో ఎదో వెలితి.

ఎప్పుడు నేను ఏడుస్తూ ఉంటాను, ఎందుకో తెలియదు.

దేవుడి నామం కాని, లేదంటే విష్ణు సహస్ర నామం కాని ఎదైనా సరే విన్నాను అంటే దుఃఖం పొంగేది.

ఎప్పుడు నిరాశ, !  నాకు కావలసినవి అన్ని నా చుట్టూ ఉన్నాయి, కాని నేను ఒంటరిని ఎందుకో తెలెయదు.

కాలేజికి వెల్లగానే నా ఫ్రెండ్ సౌజన్య ఈమెకి బాబా అంటే చాలా ఇష్టం అన్నిటికి బాబా, బాబా అంటూ ఉండేది.

నాకు చెప్పి విసిగిస్తూ ఉండేది, అప్పుడు బాబా గురించి వింటే నాకు కోపంగా ఉండేది.

ఆపవే తల్లి అస్తమానం బాబా తప్ప వేరే ద్యాస లేదా నీకు, నాకు చెప్పకు తల్లి అని తనని తిట్టేదాన్ని,.

బాబానే నన్ను తన దార్లో తెచ్చుకోవడానికి నా వెంట ఉన్నారని నేను గుర్తించలేని అజ్ఞానం లో ఉన్నాను.

ఇలా చాల రోజులు గడిచాయి, మేము అందరమూ కలసి గుంటూరు పరీక్షకు వెళ్ళాలి.

ఒక పది మందివి హాల్ టికెట్లు అన్ని సోజన్య దగ్గర ఉన్నాయి.తనకి జాగ్రత్త ఎక్కువ అని తన దగ్గర పెట్టాము.

మేము గుంటూరు బయలుదేరి వెళ్ళాలి అని ట్రైన్ ఎక్కాము.

అది దాదాపుగా 20 నిమిషాలపాటు ఆగింది స్టేషన్ లో, తీరా స్టేషన్ లో ట్రైన్ కదలడానికి సిద్దంగా ఉంది.

అప్పుడు షాకింగ్ న్యూస్ నేను మన హాల్ టికెట్స్ కవర్ మరచిపోయ్యను అని చెప్పింది మన సౌజన్య.

ఇక అప్పుడు చూడాలి మా అందరి మొహాలు , దిగి వేరే ట్రైన్ కి వెళ్ళే టైం లేదు. ఇక సంవత్సరం వృర్థ తప్ప వేరే ఛాన్స్ లేదు.

అయ్యో అని తలా ఒక వైపు ఏడుపు, అప్పుడు నాకు గుర్తు వచ్చారు సాయి.

సౌజి సాయి, సాయి, సాయి, అంటావుగా ఇప్పుడు పిలువు మీ సాయిని,  ఇప్పుడు కాని మనల్ని సేవ్ చేస్తే నేను తప్పకుండా సాయిని నమ్ముతాను.

పిలువు అంటూ తనని కంగారు పెట్టాను, పాపం దాని పరిస్థితి, ఇంటికి కాల్ చేసాము వేరే అతనికి ఇచ్చి పంపించారు.

అతను రావడానికి కనీసం 20 నిమిషాల టైం పడుతుంది. కాని ట్రైన్ నెమ్మదిగా కదిలింది, స్టేషన్ కూడా దాటింది.

ఈ సౌజి బాబాకి ఏమి చెప్పిందో ఏమో  కాని ట్రైన్ కచ్చితంగా గేటు వేస్తారు కదా అక్కడ ఆగింది.

కదిలిన ట్రైన్ ఆగడమా అని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కాని సౌజి మొహం మాత్రం వెలిగిపోతుంది. ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి కోసం మేము అందరమూ ఎదురు చూస్తూ ఉన్నాము.

గేటు వేసారు ట్రైన్ ఆగింది కదా అతను రాలేడు ఇది ఒక కంగారు , సరిగ్గా మెయిన్ రోడ్ మీదికి ఆగింది మా బోగి.

అతను గేటు దగ్గర ఉండి ట్రైన్ లోకి మా కవర్ మాకు అందచేసారు. వెంటనే ట్రైన్ హారన్ కొట్టి కదిలింది.

మాకు ఆనందం, ఏడుపు రెండూ కలసి వచ్చాయి.

నిజంగా బాబా ఏంటో మొదటి సారి చూసాను. అప్పటి నుండి ఇప్పటివరకు బాబాని నేను వదిలింది లేదు.

నాకు బాబాని పరిచయం చేసి ఎలా పూజించాలి, అన్ని విషయాలు నాకు నేర్పించి నాకు మంచి మార్గం చూపించిది. నా ఫ్రెండ్.

సత్సంగాలకు బాగా వెళ్లేవాల్లము,  ప్రతిదానికి బాబా, బాబా అని అనడం బాగా అలవాటు అయిపోయింది.

ఎక్కువగా బాబా గుడి,  ఇది వరకు సౌజి ఒక్కతే, ఇప్పుడు నేను కూడా ఉన్నాను.

ఇద్దరికీ అదే లోకం అయ్యింది బాబా బుక్స్ తప్ప వేరే చదవడం లేదు.

చివరకు పరీక్షలు మొదలు మా బుక్స్ మేము చాల తక్కువగా చూసాము.

ఇంక బయం మొదలు, ఏమి కాదులే బాబా ఉన్నారుగా అని బాబా ఫోటో ఒకటి చిన్నది తీసుకొని బాబా ని తలుచుకొని బుక్ లో పెట్టెవాళ్ళము.

ఏ పేజి వస్తే అవే చదువుకొని పరీక్ష కు వెళ్లేవాల్లము.ఎందుకంటే  అన్ని చదివే టైం లేదు.

మా చర్యలు మాకు వింతగా అనిపించేవి.

సాయి అంటే  “ఓయి”  అంటారు బాబా అని చేప్పేది సౌజి. మా నమ్మకం మమ్మల్ని గెలిపించింది

మేము చదినవే పరీక్షలో వచ్చి 80 శాతం మార్కులతో మేము మా చదువులు పూర్తి చేసాము.

ఇవన్ని ఇప్పుడు గుర్తుకు వస్తే బాబా మా మీద ఎంత ప్రేమ చూపించారో అర్ధం అవుతుంది.

అప్పుడు ఈ చిన్న లీల నా మీద బాబా ప్రయోగించ కుండా ఉంటె ఇప్పుడు నేను ఎలా ఉండే దాన్నో.

కాని బాబాతో నాకు పూర్వ జన్మ సంబంధం ఉందేమో, బాబా నా వెంట ఉండి మారీ నన్ను తన అక్కున చేర్చుకున్నారు.

బాబా లీలలు అంతు చిక్కనివి, ఆయన తలచుకుంటే నన్ను మార్చడం ఎంత పని కాని మానవతా దర్మం గానే నన్ను మార్చారు.

ఇక నా పూజా విదానం కూడా బిన్నంగానే ఉండేది , మరల సమయం వచ్చినప్పుడు అవి కూడా మీతో పంచుకుంటాను.

కరుణాసాగరా, దయామయా, ప్రేమమూర్తి, సాయినాథ మీకు మా ప్రణామాలు.

నీ నామం తప్ప, మీ లీలలు తప్ప, మీ గానం తప్ప వేటిమీదికి మా మనసులు పోకుండా ఆశీర్వదించండి.

సాయినాథ్ మహారాజ్ కి జై .

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “నా దారికి అడ్డుపడి మరీ నన్ను తన దారికి తెచ్చుకున్నారు బాబా.

ఈ బాబా వారి లీల చదివిన తర్వాత ..మనకి కూడా బాబా వారి మీద ఎంతో ప్రేమ, నమ్మకము, ఎనలేని విశ్వాసము రెట్టింపు ఉత్సహము కలుగుతుంది.

Sreenivas Murthy

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles