Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
నియమంలేని ఆహారం , నిష్టలేని సాదన ఎన్నటికి సత్ఫలితాన్నివ్వవు
*******
ఆహారం తీసుకోగానే , కొందరు కడుపునొప్పి , కాళ్ళు నొప్పులంటూఉంటారు .
అదే ఆహారాన్ని తీసుకొంటూ కొందరు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా , ఆరోగ్యంగా కనిపిస్తారు ..
కొందరు తినేరెండు ముద్దలుకూడా జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు ..
కొందరుఎంతో ఉషారుగా పూర్ణాయుష్షుతో బ్రతికేవాళ్లు కనిపిస్తారు , కొందరు ఎప్పుడుచూసినా అతి నీరసంతో బాధపడుతూ , కనిపించినవాడల్లా ఏంచెపితే ఆ గుళికలంతా మింగుతూ అధిక సమస్యలు కొనితెచ్చుకొంటూ ఉంటారు ..
అందరూ తినేది ఆ అన్నాన్నే , ఆ అన్నం తెల్లగా ఉన్నా , కలుపుకుని తినే పదార్దాలు రకరకాలుగా ఉన్నా , జీర్ణమయ్యాక , అందరిలోనూ ప్రవహించే రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది ..
తినే పదార్దాలు, తీసుకునే కాలనియమం సక్రమంగా ఉంటే, ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది , .. ఆకలి ఉన్నా , లేకున్నా కనిపించిన ప్రతి రుచికోసం పాకులాడితె , అజీర్ణంతో శరీరవ్యవస్ధ కూడా కుంటుపడుతుంది ..
సాదన అన్నది వినడానికి ఒక పదమేయైనా అనుసరించే విదానాలు వారివారి సంస్కారాన్నిబట్టి తొమ్మిదిరకాలుగా విభజించి చెప్పబడ్డాయి ..
తినే ఆహారం ఏదైనా , అది చివరకి రక్తంగా మారినట్టు , సాధనా మార్గాలెన్నిన్నా ,ఎవరు ఏ పద్ధతిని అనుసరించినా , చివరకి పొందే ఫలితం ఒక్కటే ,, నియమం లేని ఆహారం వలన శరీరానికి అనారోగ్యం తప్పదు ..నిష్ఠలేని సాధనకూడా ఏ ఫలితాన్ని అందించదు పెద్దలమాట..
సర్వం శ్రీగురు పాదార్పణమస్తు
********
Latest Miracles:
- ఉధితో ఐదింతలైన ఆహారం–Audio
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)
- సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (2వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (1వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments