సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా “నేను ఈ మసీదులో కూర్చుని అసత్యము పలుకను” అంటారు. అట్టి స్థితిని అందరూ చేరుకోగలరా?

మార్చి 17 (1078)న అబ్దుల్ ఖాదర్ జిలాని జన్మించాడు. సూఫీలలో ఖాదరియా వ్యవస్థాపకుడు.

తల్లిదండ్రులు మహమ్మద్ ప్రవక్త మనుమల వంశమునకు చెందినవారు.

మతపరమైన చదువుకై తల్లి బాగ్దాద్ నగరానికి జిలానీని పంపుతూ, దారిలోని దోపిడి దొంగలకు దొరకకుండా తనవద్ద నున్న 40 నాణేలను జిలానీ అంగీలో జాగ్రతగా దాచిపెట్టింది.

అసత్యాన్ని పలుకవద్దని శాసించింది ఆ మాత.

దారిలో దొంగల గుంపు అటకాయించింది. అందరి వద్ద దోచుకున్న ఆ 60 దొంగలకు జిలానీ వద్ద ఏమీ కనబడలేదు.

“ఏమీ లేవు కదా?” అడిగాడొక దొంగ. “ఉన్నాయి” అన్నాడు జిలాని. మరల దొంగలు వెతికారు. ఏమీ కనబడలేదు.

మరల అడిగారు “ఏమీ లేవు కదా?” అని. “ఉన్నాయి” అన్నాడు. “చూపించు” అన్నాడు దొంగల నాయకుడు.

40 నాణేలను చూపించాడు. “మేము గజదొంగలమని తెలిసినా, నీ డబ్బు మాకు తెలియకపోయినా, ఎందుకు చూపవు?” ప్రశ్నించాడు దొంగల నాయకుడు.

“నేను ప్రయాణానికి బయలుదేరే ముందు అమ్మకు వాగ్దానం చేసాను, అసత్యమాడనని, 40 నాణేలకోసం నేను అసత్యం ఆడలేను, అమ్మకిచ్చిన మాటను దాటను” అన్నాడు జిలాని.

ఆ దొంగల నాయకునకు, ముఠాకు జ్ఞానోదయమైంది. ఇక ఆ వృత్తిని మానేశారు.

బాగ్దాద్ లో ధార్మిక పాఠశాలలో చేరిన జిలానీ ఎన్నో కష్టాలను అనుభవించాడు.

ఒకసారి బాగ్దాద్ కు కరువు వచ్చింది. తోటివారంతా ఆకులలములకోసం పోతుంటే, జిలానీ పోలేదు. ఎందుకంటే వారికి దొరికే ఆహార పదార్దాలకు తాను అడ్డురాకూడదని.

ఒకసారి ఆహారం తిని చాలా రోజులైంది. నీరసంగా ఉన్నాడు. మసీదుకు కూడా పొర్లుతూ పోయాడు.

తన ప్రక్కన ఎవరో కూర్చుని భుజిస్తుంటే, తాను కూడా నోరు తెరవసాగాడు. అట్లా ఆహారం కోసం తాపత్రయపడవద్దని అంతరాత్మ బోధించింది.

ఆకలి కోరికను జయించాడు. సాధన చేశాడు. ఫలితం దక్కింది.

ఒకనాడు జిలాని అడవిలో ప్రార్థన చేస్తుండగా, ఆకలి, దాహం వేశాయి. ఆకాశం పైనుండి ఆహారాన్ని, నీటిని ఒక మేఘం కురిపించింది.

ఒక దొంగ జిలానీ ఆశ్రమానికి వచ్చాడు అర్ధరాత్రి దొంగతనానికి. దొంగకు కనులు పోయాయి. ఒక మూల కూర్చున్నాడు.

శిష్యులు ఆ దొంగను జిలాని ముందుంచారు. “అయ్యో! పాపం దొంగతనానికి వచ్చాడు, కన్నులు పోయాయా?” అని ఆ దొంగ కనులను చేతితో నిమిరాడు. భౌతిక దృష్టి వచ్చింది.

“వస్తువుల దొంగతనం ఎందుకు?” అని మరల దొంగ కనులను తాకాడు. అతను ఆధ్యాత్మికవేత్త అయ్యాడు. ఇది జిలాని కరుణ.

నేడు మార్చి 17. జిలాని జన్మదినం. ఆ సూఫీ యోగిని స్మరించి, సద్గుణములు పొందెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles