Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాలకృష్ణ సచ్చిదానంద అనే వ్యక్తి గంగలో దూకి ఆత్మహత్య చేసుకుందామని చీకటిగా ఉన్నప్పుడు గంగ ఒడ్డుకు వెళ్లాడు.
ఎవరో తనను “బాలకృష్ణ సచ్చిదానంద” అని పిలిచారు. ఎవరా అని వెళ్లాడు. ఎవరో బాలుడు పిలిచాడు.
ఆ కుర్రవాడు పిలిచి వెళ్లిపోతున్నాడు. అతడు జగత్ బంధు ఉంటున్న హరి సభలోకి వెళ్లాడు.
ప్రభు జగత్ బంధు అతనిని కూర్చుండబెట్టుకొని “నిజమైన పశ్చాత్తాపము చాలును” అన్నాడు. సచ్చిందానంద నూతన జీవితాన్ని ప్రారంభించాడు. సాయి కూడా గోపాల్ అంబాడేకర్ ను ఆత్మహత్య నుంచి తప్పించారు.
ప్రభు జగత్ బంధును చైతన్యుని అవతారంగా పరిగణించేవారు. అయన ముగ్ధమనోహర రూపాన్ని తిలకించి ఎందరో హరి నామ సంకీర్తన చేయసాగారు.
నామ సంకీర్తనలో ఆయనకు స్పృహ ఉండదు. అయన ఆ సమయంలో అలా ప్రవర్తించటం, దొంగ వేషమా? నిజమా? అని కొందరు తేల్చదలచారు.
నామ సంకీర్తన చేయునప్పుడు ఆయన పాదాల క్రింద మండే బొగ్గులను పెట్టారు. వాటి మీద ఆయన పాదాలు నర్తించినా, ఏమీ కాలేదు. ఆయన కపట వేషధారి కాదని, దాసోహమన్నారు.
ఒకసారి ఆయన రాజర్షి వనమాలి రాయ్ కి ఒక చింత చెట్టు చూపించి, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు కూలిపోతుందన్నారు.
రాజర్షికి బృందావనంలో ఉన్న ప్రతి చెట్టు పుణ్యశాలియే. రాజర్షి ఆ చెట్టు చుట్టూ 24 గంటలపాటు నామ సంకీర్తన ఏర్పాటు చేశాడు.
గట్టిగా గాలి వీయలేదు, తుఫాను లేదు, వాతావరణం అంతా ప్రశాంతముగా ఉంది. అయినా ఆ చెట్టు నేలకూలింది.
ప్రభు జగత్ బంధు బ్రాహ్మణకాండలో ప్రతి దినం ‘రాధాగోవింద’ దేవాలయానికి వెళ్లేవారు.
ఆయన వెంట ఎందరో భక్తులు వెళ్లేవారు. రహదారిలో ఒక ప్రక్క తులసి మొక్క ఉంది.
ఆ తులసి చెట్టు నీడను త్రొక్కరాదని రహదారికి ఆవలి వైపు నుండి పోతున్నాడు.
కానీ ఆ తులసి మొక్క నీడ జగత్ బంధుకు ప్రదక్షణం చేసింది. ఈ వింతను ఎందరో చూచారు.
మహీందాస్ అనే భక్తుడు ఈయన వలన ప్రభావితుడై అవివాహితునిగా ఉండిపోదలచాడు.
కానీ జగత్ బంధు అంగీకరించక అతనిని వివాహం చేసుకోమ్మన్నారు. గురువు ఆజ్ఞను పాటించి, వివాహం చేసుకున్నాడు.
భార్యతో జగత్ బంధు దర్శనానికి ఓడలో ప్రయాణమయ్యాడు తుఫాను వచ్చింది. ఓడ మునగబోతుంటే తన గురువును ప్రార్ధించాడు దీనంగా. ఉన్నట్టుండి ఓడ మామూలుగా ప్రయాణం చేయసాగింది.
ప్రభు చేతి నుండి కొంచెం రక్తం వచ్చినట్టు చూచి, కారణం అడిగాడు మహీం.
“మీరు ప్రయాణం చేస్తున్న ఓడను కాపాడటంలో చేతికి దెబ్బ తగిలింది. అంతే” అని తేలికగా తీసేసాడు ఆ విషయాన్ని జగత్ బంధు.
ఎంతెంత దయ నీది ఓ బంధు! అని విలపించారు నూతన భార్యాభర్తలు.
హరి నామ సంకీర్తన ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రభు జగత్ బంధు సెప్టెంబర్ 17, 1921న దేహాన్ని విడిచారు.
నేడు సెప్టెంబర్ 17. వారి పుణ్య తిధి. ప్రభు జగత్ బంధును స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
- అఘోరం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 29
- కావవే మహానుభావ కరుణతో …. మహనీయులు – 2020… సెప్టెంబరు 13
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments