అఘోరం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాను దత్త సాంప్రదాయంలోను, నవనాథ సాంప్రదాయాంలోను మహావతారునిగా భావిస్తారు.

కీనారాం బాబా భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించాడు తనకు దత్తాత్రేయుని దర్శనం కావాలని తహతహ లాడాడు.

గిర్నార్ కొండలపై నిరాహారిగా దత్త దర్శనం కోసం తపిస్తుంటే నవనాథులలో ఒకరైన గోరక్షనాథుడు ప్రత్యక్షమై “యోగ సాధన అనేది తగిన ఆహారం తీసుకుంటూ చేయాలి. అంతే గాని కడుపు మాడ్చుకున్నంత మాత్రాన భగవంతుడు కనబడదు” అన్నాడు.

“నాకు దత్త దర్శనం లభించదా?” అని అమాయకంగా అడిగాడు కీనారాం.

“దత్తాత్రేయ దర్శనం కలుగుతుంది. నీకు అఘోరీ మంత్రం ఉపదేశించబడుతుంది. అవధూత తత్వ జ్ఞానం కూడా వివరించబడుతుంది” అని అదృశ్యుడయ్యాడా గోరఖ్ నాథ్ (గోరక్షనాథుడు).

కీనారాం గిర్నార్ కొండ దిగాడు. గిరి ప్రదక్షణ మొదలు పెట్టాడు.

దత్త ప్రభువు దర్శనమిచ్చాడు. కీనారాం కుడి చెవిలో అఘోర మంత్రాన్ని చెప్పి అఘోర దీక్ష నిచ్చి, అదృశ్యమయ్యాడు.

కాశీలోని కృమికుండము వద్ద స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.

అక్కడ ఉన్న ఒక చింత చెట్టు వద్ద ఉండిపోయాడు. సాయి వలన వేప ఆకులు తీయనైనట్లు, కీనారాంకు నీడ నిచ్చిన ఆ చింత చెట్టు ఆకులు పులుపుదనాన్ని విడిచి తీయనైనాయి.

ఆరవ నెల ఆరవ తిథినాడు అంతే భాద్రపద మాసం షష్ఠి తిథినాడు కీనారాం బాబా మరో అద్భుతాన్ని చూపారు.

ఆయనకు సంగీతం వినటం ఎంతో ఇష్టం. ఆ నాడు కాశీ ప్రజలను పిలిచి వారి వినోదార్థం నృత్య, వాద్య ఘోష్టి ఏర్పరచాడు.

అర్ద రాత్రి అయింది. అయితే దీపాలలో చమురు అయిపోయింది. ఆరిపోయాయి.

కీనారాం ఒక పాత్రను తెప్పించి, అందులో మూత్రము పోసి, దానితో దీపాలను వెలిగింపుమని శిష్యులను ఆదేశించారు. శిష్యులట్లే చేశారు.

దీపాలు కాంతివంతంగా వెలిగాయి. ఈ సంఘటనను కాశీపుర వాసులు మరువలేకపోయారు. ‘లాలాక్కీ భట్’ అనే పేరుతొ దానిని జరుపుతుంటారు కాశీలో.

కీనారాం తులసీదాసు సమకాలికులు.

150 సంవత్సరాలు జీవించిన కీనారాం బాబా తాను దేహం చాలిస్తానని ముందుగానే చెప్పారు.

దేహాన్ని చాలించారు ఆయన. ఒక్కొక్కసారి అయన సమాధి వద్ద రాత్రి సమయాలలో దివ్యమైన వాసనలు వస్తుంటాయి. ఇంకా సంగీతము కూడా వినబడుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు.

ఈనాటికి ఆ మఠంలోనికి కాలే ఒక శవపు చితి నుండి నిప్పులు తెస్తారు. ఆ నిప్పులతో ఆశ్రమంలో వంట చేస్తారు, హోమాలు చేస్తారు. సాయి కాలం ఆ నిప్పును మరల పంపివేస్తారు.

సామాన్యంగా సెప్టెంబర్ లో వచ్చే భాద్రపద బహుళ చతుర్దశి ఆయన జయంతి.

ఆయనను స్మరిద్దాం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles