సువర్ణ కలశ స్థాపన…..సాయి@366 సెప్టెంబర్ 29….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబా చేష్టలు, మాటలు విచిత్రంగా ఉంటాయి. ”మా పద్ధతే వేరు” అంటారు సాయి. అది నిజమే అని అనిపిస్తుంది అనేకమార్లు.

హిందూ దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట అనంతరం కలశ స్థాపన జరుగుతుంది. కానీ సాయి మందిరంలో అది భిన్నంగా జరిగింది.

బుట్టివాడా సాయినాథుని మహాసమాధి మందిరమైనది. ఆ బుట్టివాడా పై కలశ స్థాపన కార్యక్రమం మూడు రోజులు జరిగింది.

ఆ మూడు దినములలో ముఖ్యమైన రోజు 29 సెప్టెంబరు, 1952. ఆనాడే సువర్ణ కలశ స్థాపన జరిగింది. పండుగ వాతావరణం నెలకొంది ఆ 3 రోజులు.

సాయిబాబా 1918లో ఆశ్వయుజ శుక్ల దశమి తిథి అనంతరం వచ్చిన ఏకాదశిన మహాసమాధి చెందాడు.

ఆనాడున్నటువంటి నక్షత్ర గ్రహ కూటమి మరల 34 సంవత్సరాల తరువాత సంభవించింది.

పూనా, ఆలంది, నాసిక్‌ మొదలైన పవిత్ర ప్రదేశాలనుండి పండితులు, సకల శాస్త్ర కోవిదులు విచ్చేశారు.

ఉదయం ఆరున్నర గంటలకు పూజ ప్రారంభమైనది. మూడున్నర అడుగుల కలశం షిరిడీ గ్రామంలో అతి సుందరముగా అలంకరించిన రథమునందు ఉంచి, మేళ తాళములతో ఊరేగించిరి.

భక్తులందారూ గావించిన ”సాయినాథ్‌ మహారాజ్‌ కి జై” అనే జయకారాలు ఆకాశంలో ప్రతిధ్వనించినవి.

ఉదయం పదిన్నర గంటలకు స్వర్ణ కలశాన్ని సమాధి మందిరముపై చేర్చి 11 గంటలకు మంత్రోచ్ఛరణలతో కన్నుల పండువగా కలశ స్థాపన జరిగినది.

సత్పురుషుడు, సకల శాస్త్ర కోవిదుడు అయిన డాక్టర్‌ రామచంద్ర ప్రహ్లాద పర్నేకరుగారు గోపురముపై ఈ కలశ స్థాపన చేసినారు.

ఆ సమయమున భక్తులు జయ జయ ధ్వానములు చేయుచుండ 25 ఫిరంగులు మ్రోగించారు.

నాగేష్‌ ఆత్మారాం సావంత్‌ కాషాయ రంగు పతాకమును సువర్ణ కలశము చెంత నుంచుటతో, సాయినాథుని కీర్తి పతాకము రెపరెపలాడసాగింది.

హిందూ సాంప్రదాయ ప్రకారము కలశ స్థాపన ముఖ్య ఘట్టము. ఈ కలశమును బంగారము, వెండి, పంచలోహములతో తయారుచేసి, వివిధ ధాన్యములతో నింపి, బ్రహ్మరంధ్రము మధ్యన వచ్చునటుల కలశమును ప్రతిష్టిస్తారు.

తగు కాలములో సంప్రోక్షణ కార్యక్రమమును చేపడతారు. ఇది పిడుగుపాటు మొదలగు వాటినుండి రక్షణ ఒసగగలదు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles