గ్యారా సాల్ బాద్ ….సాయి@366 సెప్టెంబర్ 19….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఆ రోజు 19 సెప్టెంబరు 1953. శశికాంత రాట్వే అనే వ్యక్తి దత్తాత్రేయుని భక్తుడు.

గాణుగాపూర్‌, అక్కల్‌కోట మొదలైన దత్త క్షేత్రాలను సందర్శించే వాడు. ఆ రోజున రాట్వేకు స్వప్నం వచ్చింది.

ఆ స్వప్నంలో ఒక దర్గా. ఆ దర్గా ఎదురుగా ఒక ముసలి సాధువు ఉన్నాడు. ఆ సాధువు మోకాళ్ళ క్రింద వరకు ఎర్రని జుబ్బా వేసుకున్నాడు.

ఎడమ చేతిలో భిక్షా పాత్ర, నొసట చందనము, దాని మధ్య కుంకుమ ఉన్నాయి.

 ”యా అల్లా, అల్లా మాలిక్‌ హై” అనసాగాడు ఆ సాధువు. తన భిక్షా పాత్రలో చేయి పెట్టి  కొంత అన్నము, ఒక అణా కాసు తీసి రాట్వేకు ఇచ్చాడు.

దర్గా ఎదురుగా ఫకీరు దుస్తులతో ఉన్న ముసలి సాధువును ముస్లిం అని సహజంగానే భావించాడు. ”మీరు ముస్లింలు కనుక నేను ఏమీ తీసుకోను” అన్నాడు రాట్వే.

ఆ పరబ్రహ్మ అనేక రకములయిన దుస్తులను ధరిస్తాడు. ఆ ఫకీరు ప్రశాంతముగా ”బిడ్డ నేను సాయినాథుడను. నేను ఫకీరు వేషంలో తిరుగుతాను. కానీ నేను ఫకీరును కాను. దర్గా లోనికి గాని, ఆలయంలోనికి ప్రవేశించటం అంత సులభం కాదు” అన్నారు.

 ”మీరు ఎక్కడ ఉంటారు?” ప్రశ్నించాడు రాట్వే. ”అహ్మద్‌నగర్‌ జిల్లాలో సాయి బాబా సంస్థాన్‌ ఉన్నది. ఈ షిరిడీ నా రాజ్యానికి ముఖ్య పట్టణం. ఇది దర్గా కాదు. లోపలికి వెళ్ళి చూడు” అన్నారు సాయి ఆ స్వప్నంలోనే.

అతడు లోపలికి వెళ్ళి చూచాడు. ఒక గది ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అనే బోర్దు ఉన్నది.

రాట్వే బయటకు వచ్చి ”నేను షిరిడీ ఎప్పుడు వెళతాను?” అని అడిగాడు ఆ ఫకీరును.

”సెప్టెంబరు 19, 1964న సాయంత్రం నాలుగు గంటలకు నా దర్బారులో కాలు పెడతావు. ఈ రోజు నా వంటి మీద ఉన్న గుడ్డలే ఆ రోజూ ఉంటాయి” అన్నాడు.

అంటే సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత సాయి అతనికి జరగబోయే విషయం గూర్చి చెప్పాడు.

ఈ 11 సంవత్సరాలలో ఆ విషయమే మరిచాడు రాట్వే. ఉద్యోగాన్వేషణలో కోపర్గాం వెళ్ళాడు

రాట్వే. ఉద్యోగం ఇచ్చే ఆసామి ఊళ్ళో లేడు. పైగా సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడట. ఇక పనిలో పనిగా రాట్వే షిరిడీ వెళ్ళి సాయి సమాధి మందిరంలో ప్రవేశించాడు.

అప్పుడే గోడమీద గడియారం నాలుగు గంటలు కొట్టింది. ఉలిక్కి పడ్డాడు. ఆ రోజు 19.9.1964. సాయి విగ్రహాన్ని చూచాడు.

 11 సంవత్సరాల క్రితం అతనికి స్వప్నంలో ఫకీరు ధరించిన బట్టలే ఉన్నాయి విగ్రహానికి. ఆశ్చర్యం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles