కృతజ్ఞత ఉత్సవమైన వేళ!…..సాయి@366 ఏప్రిల్ 11…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా జీవిత చరిత్రలో ప్రప్రధమంగా సాయి దీవెన పొంది పుత్ర సంతానాన్ని పొందిన వ్యక్తి గోపాలరావు గుండు.

”తనలాగే అందరూ సంతోషంగా ఉండలని, షిరిడీ గ్రామంలో ప్రతి ఏడాది ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని ఆలోచన కల్గింది” అని గోపాలరావు గుండును గూర్చి హేమాడ్‌పంత్‌ వ్రాశారు.

షిరిడీలో ఎక్కువ మంది హిందువులే కనుక ఆయన జాతరను చేద్దామని ఆలోచించి ఉండవచ్చును.

సాయినాథుని వేష భాషలను చూచి సాయిని ముస్లిముగా భావించి ‘ఉర్సు’ ను చేద్దామని కూడా ఆలోచించి ఉండవచ్చును.

ఉర్సు అంటే సూఫీ సాంప్రదాయంలో ఒక ముస్లిం సత్పురుషుడు దివంగతుడు అయినప్పుడు, ఆయన దర్గా (సమాధి) వద్ద ప్రతి ఏటా చేసే ఆరాధన ఉత్సవం.

సూఫీ సాంప్రదాయంలో సత్పురుషుడు తన ఆత్మను స్త్రీ గాను, భగవత్‌ తత్వాన్ని పురుషుని గాను భావిస్తారు.

సూక్షంగా చెప్పాలంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటం అని అర్థం. ఆ ఐక్యతకు గుర్తుగా ప్రతి సంవత్సరం భక్తులు చేసే ఉత్సవమే ఉర్సు.

స్థూలంగా జాతర హైందవులది, ఉర్సు మహమ్మదీయులది అనిపిస్తుంది. కాని సాయి మతాతీతుడు. ఒక మహాత్ముని ఉర్సు దినాన్ని, సాయి శ్రీరామ నవమి నాడు జరిపించటం మొదలు పెట్టటం విశేషమే.

ఆ మహమ్మదీయుడు ఎవరో సాయి తెలుప లేదు. ఆ నాడే హిందూ, ముస్లింలను ప్రేమ బంధంతో ఉండమని ఆదేశించటమే కాని వేరు కాదు.

ఉర్సు అనేది సూఫీ సాంప్రదాయం ప్రకారం సాయి పరోక్షంగా తాను చేయించుకున్న పండుగ కాదు. ఉర్సు జరిగేది గతించిన మహాత్ములకే.

భౌతికంగా శ్రీరామ నవమి నాడు జరిగేది సీతారాముల వివాహం, రామ జనన వేడుకలు.

అయితే ఆధ్యాత్మిక పరంగా రాముడు పరమాత్మ, సీత ఆత్మ. ఆత్మ పరమాత్మల భౌతిక రూపాల కలయిక జరిగేది ఆ వివాహం నాడే.

సూఫీ సాంప్రదాయం ప్రకారం భౌతికంగా కాకుండా పారమార్ధికంగా ఆ దినం ఉర్సు దినం.

భౌతిక, పారమార్ధికాలు నాణేనికి బొమ్మ, బొరుసులే. మొదిసారిగా అది జరిగింది 1897 ఏప్రిల్‌ 11వ తేదీ శ్రీరామ నవమి నాడు.

గోపాలరావు గుండుకు సాయిపై ఉన్న కృతజ్ఞతా భావం, రెండు మతాలలో పండుగైనది, ఏకత్వాన్ని కూర్చి పెట్టింది.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles