Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
తెలుగు వెలుగంతా తెలుగునాట కేంద్రీకృతమవ్వటం పరమేశ్వరునకు ఇష్టం లేనట్టుంది – సాధు సచ్చరిత్రలు చూస్తూంటే.
విశిష్టాద్వైతి రామానుజులు శ్రీరంగంలోనూ, విద్యారణ్యులు శృంగేరిలోనూ – ఇలా ఎందరో ఉన్నారు.
ఇటీవలి ఉదాహరణగా సాయి సాంప్రదాయానికి చెందిన శ్రీ శివనేశన్ స్వామీజీని తీసుకోవచ్చును. స్వామీజీ తెలుగు వారు. జన్మించింది కోయంబత్తూరులోని రత్నషేగపల్లి.
వారి పూర్వీకులు తెలుగునాడు నుండి తమిళ ప్రాంతంలో స్థిరపడిన వారు. స్వామీజీ జన్మ దినం 1927 ఏప్రిల్ 12. ఆ దినం శ్రీరామనవమి.
భ్రమర కీటక న్యాయంలో కీటకం భ్రమర భయంవలన భ్రమర రూపం పొందుతుంది. ఆ న్యాయం సాయి భక్తులకు కూడా వర్తిస్తుంది.
భక్తుడైన శ్రీ శివనేశన్ స్వామి సాయి ఆకారాన్ని పొందకపోయినా సాయి అపార కరుణతోపాటు, సాయి విభూతిని దర్శింపచేయగల శక్తిని పొందారు.
సాయి వలె తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు స్వామీజీ. సాయి భక్తికి ఆయన జీవితం ప్రయోగశాల.
సాయి తన భక్తుని సర్వావస్థలలోను కాపాడుతారనేది ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఏ కొద్దిపాటి భక్తి తోనే పరవశించిపోయే సాయి, అనన్య భక్తి గలవారికి సిద్ధులను ప్రసాదిస్తాడు.
అయితే అనుక్షణం తన ద్వారా ఆ మహిమను సాయి చూపాడని, ఆ మహిమ తనది కాదనే స్పృహ క్షణక్షణం ఉండాలి. శివనేశన్ స్వామి అనేక లీలలు చూపినా కారణం సాయిబాబాయే అని నిర్ద్వంద్వంగా చెప్పేవారు.
పేదవారికి గాని, ఇతర జీవులకు గాని సేవ చేసినప్పుడు ”నీది నీకే అర్పిస్తున్నాను, నాదేమీ లేదు” అనే భావనే ఊపిరి కావాలి.
చేసే ప్రతి పనిలోను శ్రద్ధ ఉండితీరాలి. ప్రతి పనిని సేవాకార్యంగా ఎలా మలచుకోవచ్చో చింతన చేయాలి.
సాయికి అర్పించిన పూల దండలను మరునాడు పశువులకు ఆహారంగా ఇవ్వవచ్చును. అలా చేసేముందు స్వామీజీ వలె పూల దండలకున్న దారాలను తీసివేయాలి.
నేడు ఏప్రిల్ 12. స్వామీజీ జన్మదినం. సబ్‌కా మాలిక్‌ను సేవించి సాయి సేవక్‌ను స్మరిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సబ్ కా మాలిక్ సాయి …. మహనీయులు – 2020… ఏప్రిల్ 12
- జిత్తులమారితనం…. సాయి@366 ఫిబ్రవరి 12….Audio
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
- గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio
- సాయి పాదానంద …..సాయి@366 జనవరి 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments