Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిబాబా మహా సమాధికి పూర్వం నుండి శాంతి కిర్వాండికర్ సాయిబాబాను దర్శించేది.
ఒక రోజు ఆ బాలిక ప్రమాదవశాత్తు షిరిడీలో మారుతీ మందిరం ఎదురుగా గల బావిలో పడిపోయింది.
వెంటనే ”బాబా, బాబా” అని కేకలు పెట్టింది. అప్పుడు – ఆ సమయంలో సాయిబాబా ద్వారకామాయిలో బూటీ, దీక్షిత్‌లతో మాట్లాడుతున్నారు.
హఠాత్తుగా బాబా తన హస్తాన్ని చాచి, అరచేతిని ప్రక్కనే ఉన్న కుండపై కొన్ని క్షణాలుంచారు. తిరిగి మామూలుగా కూర్చున్నారు.
శాంతి బావిలో సగము వరకే మునిగి ఉండటము, ఆమె కేకలు విన్న వారు వచ్చి చూచారు. ఆమెను పైకి లాగారు.
సాయిబాబా తనను పడిపోకుండా తన చేతితో పట్టుకున్నారని చెప్పింది ఆ బాలిక.
సాయి చేసిన ఆ వింత చర్య అర్థం బూటీ, దీక్షిత్‌లకు అర్థమైంది. ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు సాయి మహిమకు.
సాయి మహా సమాధి చెందారు.
సాయి భక్తు వేమూరి వేంకటేశ్వర్లు గారు రేపల్లె నివాసి. 1957 సెప్టెంబరు 6న ఆయన తన ఆఫీసు గదిలో శ్రీ సజ్జ వెంకయ్యతో మాట్లాడుతుండగా వేంకటేశ్వర్లు గారి భార్య పరుగు పరుగున వచ్చి పిల్లవాడు బావిలో పడ్డాడని చెప్పింది.
ఆ మాటను విన్న వెంటనే వేంకటేశ్వర్లు గారు తత్తరపకుండా లేచి ”బాబా, బాబా” అన్నారు.
అది వరల బావి. బొడ్డు బావి. గిలకలు లేవు. వరలకు పాచి పట్టి ఉన్నది. ఎనిమిది అడుగుల లోతు వరకు నీరు ఉన్నది. అందరూ బావి దగ్గరకు వచ్చారు.
అలా రావటానికి కనీసం రెండు నిమిషాలు పట్టింది. అప్పటికి పిల్లవాడు బావి గట్టుపై నిలబడ్డాడు తలంతా తడిసి ఉన్నది.
”ఎలా పైకి వచ్చావురా?” అని అడిగారు తండ్రి. ”ఏమిటి నాన్నా! నేను తడిసానే కాని అసలు బావి అడుగుకు పోలేదు నాన్నా,
సగం పోయేసరికి ఒక ఇటుక రాయి కాలి క్రిందకి అడ్డువచ్చింది. దాని మీద నిలబడ్డాడు. ఎవరో నన్ను ఇక్కడ దింపారు”.
నీటిపై రాయి తేలటమేమి? 15 ఏండ్ల ఆ పిల్లవానిని ఆ ఇటుక రాయి మోయుట ఏమి? పైకి లేవనెత్తి దింపినది ఎవరు?
ఇవన్నీ ప్రత్యక్షంగా చూచి సజ్జా వెంకయ్య గారు ”బాబా” అని మీరు తలచిన క్షణంలోనే జరిగిపోయాయి. ఇవి నేను చూచాను గనుక నమ్ముతున్నాను లేకపోతే చెపితే ఎట్లా నమ్మటం?” అన్నారు.
”ఆ తండ్రి (బాబా) లీలలే అట్టివి” అన్నారు శ్రీ వేంకటేశ్వర్లు గారు – సాయికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేస్తూ.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- న్యాయవాది …..సాయి@366 జూలై 26….Audio
- చేజారే మణిపూస…..సాయి@366 సెప్టెంబర్ 30….Audio
- మాటే .. మంత్రం ….సాయి@366 సెప్టెంబర్ 13….Audio
- తగిన బిడ్డలు…..సాయి@366 సెప్టెంబర్ 21…Audio
- సాయి అభిన్నత్వం…..సాయి@366 సెప్టెంబర్ 2….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments