Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
లెఫ్ట్ నెంట్ కర్నల్ యం.బి. నింబాల్కర్ గారు సాయి భక్తులైనారు. ఆయన తన అపార కృషితో సాయి ధనాగరాన్ని వృద్ధి చేశారు.
ఆయన సెప్టెంబరు 13, 1983న సాయి సచ్చరిత్రలో 48వ అధ్యాయంలో వచ్చే సపత్నేకర్ దంపతులలో పార్వతీబాయి సపత్నేకర్ను కలసి ఎన్నో తెలియని విషయములను తెలిపారు.
పార్వతీబాయిని మహదేవ సపత్నేకర్ మొదటి భార్య గతించిన తరువాత వివాహం చేసుకున్నాడు.
సాయిబాబాను గురించి మహదేవకు ఆయన సహాధ్యాయుడైన షెవడే చెప్పటం పార్వతీబాయి కూడా విన్నది. కానీ సాయి బాబాపై సపత్నేకరుకు నమ్మకం కలుగలేదని చెప్పింది ఆమె.
తండ్రి ఆజ్ఞతో మహదేవ తన తమ్మునితో షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించాడు. తన వద్దకు రాగానే సపత్నేకర్ను సాయి ఎంతో గట్టిగా ”చల్ హ్” అంటూ నెట్టడంతో సపత్నేకర్ తలపాగా దూరంగా పడిపోయింది.
అక్కల్కోటకు తిరిగి వచ్చిన సపత్నేకర్ తనను షిరిడీ పంపినందుకు తండ్రిపై కోపగించుకున్నాడు. కాని తరువాత తన భార్యతో, వదినతో సాయి దర్శనం చేసుకున్నాడు.
సాయి చేష్టలు వింతగా ఉంటాయి, అనూహ్యంగా కూడా.
పార్వతీబాయి సపత్నేకర్ షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకుంది. సాయి ఆమెను చూడగానే తన కడుపు పట్టుకుని ”అమ్మా! కడుపునొప్పి” అంటూ బాధతో మెలికలు తిరిగిపోయారు.
పార్వతీబాయి కంగారుపడి బాబాకు ఏమైందని ప్రక్కన ఉన్నవారిని అడిగింది.
అప్పుడు అక్కడున్నవారు సాయి బాబా ఇతరుల నుండి బాధలను స్వీకరించేటప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటారని చెప్పారు.
సాయి అలా బాధను అనుభవించగానే, ఆ భక్తుల బాధలు నివారణ అవుతాయని కూడా చెప్పారు. పార్వతీబాయి ఆశ్చర్యానికి అంతులేదు.
సాయి బాబా భక్తుల నుండి బాధలను స్వీకరించే పద్ధతులలో అది ఒకటి కాబోలు అనుకున్నది ఆమె.
ఇంతకీ అంతటి అదృష్టవంతులెవరోకదా? ఈ సంగతి ఎలా తెలుస్తుంది? బాధను పోగొట్టుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది.
రెండు, మూడు నెలలు గడిచాయి. అప్పుడు ఆమెకు తెలిసింది,
రెండు, మూడు నెలల నుండి కడుపునొప్పి, నడుమునొప్పి తనను బాధించటం లేదని. అంటే సాయి ఆనాడు మెలికలు తిరిగిపోయి అనుభవించింది తన బాధనే అని గుర్తించింది.
ఇది సాయి మహిమ. ఎంతెంత దయనీది ఓ సాయీ!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శేవడే
- పడనీయను …..సాయి@366 జూలై 14….Audio
- వికటించిన కషాయం….సాయి@366 సెప్టెంబర్ 16….Audio
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
- నిర్ణేత సాయి …..సాయి@366 సెప్టెంబర్ 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments