నిర్ణేత సాయి …..సాయి@366 సెప్టెంబర్ 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబాను ఎందరో దర్శిస్తూనే వచ్చారు, ఆయన సమాధి చెందేదాక. భక్తులు అది కావాలి, ఇది కావాలని కోరేవారు. ఇంకొందారు ఏకంగా ప్రాణ దానాన్నే కోరేవారు.

భీమాజీ పాటిల్‌కు క్షయ రోగం. నేడో, రేపో అనుకుంటున్న సమయంలో సాయి పేరు విని, షిరిడీ చేరాడు. అతని జీవిత కాలాన్ని పొడిగించాడు సాయి.

హైదరాబాదుకు చెందిన మాలన్‌బాయి మరణించింది షిరిడీలోనే. సాయి ఆమెకు తిరిగి ప్రాణం పోశాడు.

హార్దాలో ఒక క్షయ రోగి ఉన్నాడు. అతడు షిరిడీలోనే మరణించాడు. సాయి అతనిని సజీవుని చేయలేదు.

హార్దా భక్తుని కుటుంబం వారంతా సాయి భక్తులే. అయినా సాయి కాపాడలేదు. దానికి కారణం సాయి చెపితే గానీ తెలియదు.

 ”శరీరం వదలటమే అతనికి మేలు” అన్నాడు సాయి. పూర్వ కర్మల దృష్ట్యా భక్తులకు ఏది మేలు జరుగుతుందో సాయి అదే చేస్తాడు. నిర్ణేత సాయి.

సాయి మహాసమాధి చెందిన అనంతరం కూడా తేడా ఏమీ లేదు. అంటే సాయి రక్షణ ఇస్తే, ఆతని భక్తి ప్రపత్తులను సాయి అంగీకరించాడని అర్థం.

ఈ విషయాన్నే తన జీవితంలో జరిగిన (సాయి మహా సమాధి చెందిన 14 ఏండ్ల తరువాత) సంఘటనను సెప్టెంబరు 23, 1936న తెలిపారు, ఎం.జి. ప్రథాన్‌ గారు.

సాయిబాబాను సజీవంగా ఆయన ఒకేసారి దార్శించాడు. 4 రోజులు షిరిడీలో సాయి సన్నిధిలో ఉన్నారు. సాయిపై ఏర్పడిన నమ్మకం, ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతగానే తోడ్పడ్డది అంటారాయన.

దీనిని ధృవ పరచే ఒక సంఘటనను ఆయన చెప్పారు. 1932 ఆయన చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3, 4 రోజుల తరువాత బిడ్డడి నాడి అందలేదు.

అనుమానం వచ్చి డాక్టరును పిలిచాడు ప్రథాన్‌. ఆయన క్షుణ్ణంగా పరీక్షించాడు. నాడి ఆగిపోయింది బిడ్డడు మరణించాడని ఆయన తెలిపారు.

అక్కడే ఉన్న ప్రథాన్‌ భార్యను ఓదార్చటం మొదలు పెట్టాడు. బిడ్డడి ముందు సాయి ఫోటో పెట్టి, నుదుట ఊది వ్రాసి, ఆర్తితో సాయిని ప్రార్ధించసాగాడు.

పిల్లవానిని సాయి బ్రతికిస్తాడని ప్రథాన్‌ విశ్వాసంతో చెప్పాడు. 45 నిమిషాలు గడిచిన తరువాత పిల్లవాడు తిరిగి సజీవుడయ్యాడు. లేచి ఆడుకోసాగాడు.

సాయిపై భక్తిని నిలుపుకొందుము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles