Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మహత్మలు ఏ మతానికి చెందిన వారైనా వివిధ మహిమలను అప్పుడప్పుడూ చూపుతుంటారు.
అస్సీకి చెందిన సెయింట్ ప్రాన్సిస్ తరువాత, అన్ని లీలలను చూపిన మహనీయుడు సెయింట్ పియో.
జియోవన్నీ (Giovanni) అనే వ్యక్తి ఒక కూలీ. భవనాలు కట్టే పనిలో ఉండే వాడు.
ఒకనాడు ఒక డైనమైట్ పేలిన సందర్భంలో ఈతని ముఖం నుజ్జునుజ్జు అయింది.
కుడి కంటిలో కనుగ్రుడ్డు లేదు. ఎడమ కన్ను పూర్తిగా పాడైంది.
అప్పుడు ఆ ప్రమాద స్థలంలో ఉన్న జియోవన్నీని చర్చిలోని వారు, ఇతరులు ఆసుపత్రిలో చేర్చారు.
అతని ముఖమంతా కట్లతో నిండి పోయింది. కంటి చూపు రాదని డాక్టర్లు నిర్దారించారు.
మూడు రోజుల తరువాత సర్జను రాగా, ఆయనతో జియోవన్నీ రాత్రి ‘పియో’ వచ్చారని సంతోషంగా చెప్పాడు.
ముఖమంతా పూర్తిగా కట్లతో ఉండగా ఎలా చూడ గలిగావు అనే ప్రశ్నకు, ఆయన ఇలా జవాబిచ్చాడు “ఆయన గదిలోనికి రాగానే ఒక రకమైన సుగంథం రావటం నాకు తెలుసు” అన్నాడు.
మొత్తం మీద ఒక వారం అయింది. జియోవన్నీని ఎవరో చెంప మీద కొట్టారని నిద్ర నుండి లేచాడు. చుట్టు ప్రక్కల ఎవరూ లేరు.
కంటి డాక్టరు ఒక నాస్తికుడు. అయన వచ్చాడు. ముఖానికున్న కట్లన్నీ విప్పాడు. ముఖం మీద ఏ గాయమూ లేదు. మామూలు స్థితిలో ఉంది.
“నేను చూడగలుగుతున్నాను” అని సంతోషంగా అరచాడు జియోవన్నీ.
కంటి డాక్టరు పరీక్ష చేశాడు. కుడి కంటిలో గ్రుడ్డు వచ్చింది. కళ్లు మామూలుగా పని చేస్తున్నాయి.
అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కువగా ఆశ్చర్యపోయింది కంటి డాక్టరే. నమ్మి చెడిన వారు లేరు.
పియో చర్చిలో సంభాషిస్తున్నాడు. అంతలో భార్యతో కలసి ఒక భర్త వచ్చాడు.
భర్తను చూడగానే పియో ఆగ్రహంతో “వెళ్ళిపో, చేతులను రక్తంతో కల్మషం చేసుకోరాదని తెలియదా? వెళ్లి పో” అన్నారు.
ఆ భర్త నివ్వెరపోయాడు. తన సంకల్పం పియోకు ఎలా తెలిసిందా? అని ఆశ్చర్యపోయాడు.
ఆ భర్త సంకల్పం ఏమిటంటే ఆ భార్యను హత్య చేయాలని ఆలోచించాడు.
ఆ భర్తకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తాను సంకల్పించిన ఘాతుకం ఎట్టిదో తెలుసుకున్నాడు. పశ్చాత్తప్తుడైనాడు.
మరల పియో సన్నిధికి చేరాడు. ఈ మారు పియో ఆగ్రహించలేదు. మృదువుగా మాట్లాడి “నీకు పిల్లలు కావాలి కదా. సరే. ఒక కొడుకు పుడతాడు” అని దీవించారు.
అలాగే పిల్లవాడు జన్మించాడు. భార్యా, భర్త కుమారునితో కలిసి సంతోషంతో మరల పియోను దర్శించారు.
సాయి కూడా సాఠేను భార్యతో క్రూరంగా ప్రవర్తించబోయే సమయానికి ఆ పాపం నుండి అతనిని కాపాడారు.
పియో సెప్టెంబర్ 23, 1968లో దేహాన్ని విడిచారు.
భగవంతుని శక్తిని చూప గలిగే వారు మహనీయులు.
నేడు సెప్టెంబర్ 23. పియో వర్థంతి. ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మరో బుద్ధుడు …. మహనీయులు – 2020… నవంబర్ 4
- బోధనలే మతం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 28
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- లక్ష్మణ్ బజీ అవరె
- పితృత్రయం …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 20
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments