బోధనలే మతం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


చైనాలో జన్మించిన కన్ఫ్యూషియస్, గౌతమ బుద్ధుని సమకాలికునిగా కొందరు భావిస్తారు.

సమకాలేయకుడైనా, కాకున్నా అయన గౌతమ బుద్దునివలె, జీసస్ క్రీస్తువలె, ప్రవక్త మహమ్మద్ వలె నూతన మతాన్ని స్థాపించలేదు.

కన్ఫ్యూషియస్ జీవన విధానమే మార్గదర్శకమైంది. చైనా ప్రజలకే కాదు, యావత్ ప్రపంచానికి. ఈయన బోధనలే మతమైంది.

ఆయన బోధనలలో ముఖ్యమైన బోధ తనకు జరగకూడని అన్యాయం తానితరులకు చేయకుండుట అనునది.

“ఒరులేయవి యొనరించిన

నరవర! యప్రియము తన మనంబునకు తా

నొసరులకు సేయకునియె

పరాయణము పరమ ధర్మ పదముల కెల్లన్”

ఈయన బాల్యము నుండి కష్టించి పని చేసేవాడు. సాయిబాబాను తన యజమాని దుస్తులనిచ్చి, జీతము పెంచి గౌరవించినను, తాను పొంగిపోలేదు. అట్లాగే కన్ఫ్యూషియస్.

అనేక పదవులు ఆయనను వరించివచ్చాయి. సాయి వలె ఈయన ఐచ్చిక  దారిద్య్రన్ని స్వీకరించాడు.

కన్ఫ్యూషియస్ సుఖంలోను, కష్టంలోను ఒకే రీతిన ఉండేవాడు. “ఇంత పెద్ద పదవిలో ఉంటూ కూడ మీరిట్లా బాధలు పడవలసినదేనా? స్వామి?” అని శిష్యులు అడిగారు.

“అవును. ఉద్యోగాలతోను, పదవులతోను పని ఏముంది? ఐచ్చిక దారిద్య్రన్ని మించిన పదవి ఏముంది?” అన్నాడు.

ఈయన చేసిన పనులకు గౌరవాలు, సన్మానాలు, గౌరవ భృతులు ఇచ్చేవారు.

“ఇవేవీ నాకక్కర లేదు. ముతక బియ్యం అన్నం తింటూ, మంచి నీరు మాత్రమే త్రాగుతూ, మోచెయ్యి తల క్రింద నుంచుకొని పడుకోవటంలోనే ఈ నాటికీ నాకు ఆనందం.

అక్రమంగా వచ్చే ధన, గౌరవాలు నాకు ఆకాశంలో తేలిపోయే మేఘంవంటివి” అనేవారు ఆయన.

ఒకనాడు ఈయన టాయ్ పర్వతం ప్రక్క నుండి శిష్యులతో పోతున్నాడు. అక్కడున్న ఒక సమాధి వద్ద ఒక స్త్రీ దుఃఖిస్తోంది. కారణం అడిగాడు ఆమెను.

“స్వామీ! నా తండ్రి, నా భర్త, ఇప్పుడు నా కుమారునికి ఒకే దుర్గతి పట్టింది. వారిని ఒక పెద్దపులి చంపివేసింది” అన్నదామె.

“మరి నీవు ఈ చోటును విడిచి ఎందుకు వెళ్లిపోవు?” ప్రశ్నించాడామెను.

“ఏలనంటే ఈ ప్రభుత్వం నిరంకుశం కాదు కనుక” అన్నదామె.

కన్ఫ్యూషియస్ “మిత్రులారా! నిరంకుశ ప్రభుత్వాలు పెద్ద పులలకంటే భయంకరం అనే విషయం మరువకండి” అన్నారు.

ఈ సంఘటనను అనేక విధాలుగా అన్వయించుకోవచ్చును. ‘ఎనలెక్ట్స్’ అనేది ఈయన బోధనల గ్రంథం.

చైనా ప్రభుత్వం 28.9. 1965లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.

ఇంకా 72 మీటర్ల కాంశ్య విగ్రహాన్ని (ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడే) చైనా 24 సెప్టెంబర్. 2018లో ప్రతిష్టించింది. నేడు సెప్టెంబర్ 28. కన్ఫ్యూషియస్ ను స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles