Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా శాంత స్వభావుడే. ఎప్పుడైనా కోపం నటించేవాడు. భక్తులు భయపడేవారు.
దైవంపట్ల, సద్గురువుపట్ల భక్తి మాత్రమే కాదు, భయంకూడా ఉండాలి. భయంకూడ మంచి ఫలితాలనిస్తుంది.
బోధిధర్ముడు దక్షిణ భారత దేశంలోని పల్లవ రాజకుమారుడు. భారతదేశం నుండి బౌద్ధ గ్రంథాలు చైనా భాషలోనికి అనువదించబడుతున్నాయి.
‘వు’ అనే రాజు చైనాను పాలిస్తున్నాడు, బోధిధర్ముడు చైనా వెళ్ళినప్పుడు ‘వు’ వేలకు వేల బౌద్ధ సన్యాసులను పోషిస్తూ, అనేక ఆరామాలను కట్టించాడు.
బోధిధర్ముడు ‘వు’ను కలిశాడు. బోధిధర్ముని మాటలు కఠినంగా ఉంటాయి.
“నేను అనేక ఆరామాలు కట్టించాను. వేలాది భిక్షుకులకు వసతి ఏర్పాటు చేశాను. నాకు ఎటువంటి బహుమతి లభిస్తుంది?” అని ప్రశ్నించాడు ‘వు’.
“నీకు బహుమానం లభించదు. నరకానికి వెళ్ళాలి” అన్నాడు బోధిధర్ముడు. “ఎట్లా” అని ప్రశ్నించాడు ‘వు’.
బౌద్ధ ధర్మంలో కోరిక ఉండరాదు. అది వినాశకారి. కోరికలతో సేవచేయరాదు. నీ అంతరాత్మ ప్రబోధం చేయలేదా?” ప్రశ్నించాడు బోధిధర్మ.
“నా మనస్సంతా గజిబిజిగా ఉంది. మనశ్శాంతి లేదు. నాకు అంతరాత్మ అంటే ఏమిటో తెలియదు” అన్నాడు ‘వు’.
“ఐతే రేపు ఉదయం 4 గంటలకు ఒంటరిగా, కొండవద్ద ఉన్న గుడి దగ్గరకు రా! నీ మనస్సుకు శాశ్వత శాంతి కలుగచేస్తాను” అన్నాడు బోధిధర్మ.
‘వు’ భయభ్రాంతుడయ్యాడు. బోధిధర్ముని దగ్గర పెద్ద లావుపాటి దుడ్డు కర్ర ఉంటుంది. దానితో తల చితకబాదడు కదా అని పరిపరి విధాల అతని మనసు ఆలోచించింది. అనేక విధాల ఆలోచనల తరువాత ‘వు’ వెళ్ళాడు.
“రాత్రి నీ మనస్సంతా భయంతో నిండిపోయింది కదూ. ఇప్పుడు కన్నులు మూసుకుని చూడు. నీకు మనసు కనిపిస్తే చెప్పు. ఈ దండంతో దాని పనిపడతా” అన్నాడు బోధిధర్ముడు.
‘వు’ కన్నులు మూసుకున్నాడు. ఒక్క ఆలోచనా రాలేదు. ఎంతగా మనసుకు జ్ఞప్తికి తెచ్చుకుందామన్నా మనసు జాడే లేదు. మనసు ఏది? మనసుకోసం వెదకసాగాడు.
నిముషాలు గంటలయ్యాయి. మధ్యాహ్నం దాటింది. “మనసు కనిపించిందా?” ప్రశ్నించాడు బోధిధర్మ.
“లేదు” నా మనసు ప్రశాంతమైంది. అంతరాత్మ పలకటం మొదలైంది. మీరు అక్కడే ఉండి నన్ను మార్చగలిగారు. కృతఙ్ఞతలు” అన్నాడు ‘వు’.
“నీవు” నా అరుదైన శిష్యుడివి. ఒక్కసారిగా మనసు అంధకారం నుండి బయటపడదు. నీకు జరిగింది.
నీవు నా ప్రియ శిష్యుడవు. నిన్ను దీవిస్తున్నాను” అంటూ బోధిధర్ముడు పర్వతాల వైపు వెళ్ళిపోయాడు.
కాల, దిన వివరాలు అలభ్యములు.
భక్తియే కాదు, భయం కూడా అవసరమే.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి సామ్రాజ్యం … .మహనీయులు – 2020… అక్టోబరు 7
- సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17
- నీకు అర్ధం కాదులే! …. మహనీయులు – 2020… నవంబర్ 15
- జయ నిత్యనందరాం… …. మహనీయులు – 2020… మార్చి 25
- రాముని వారము, మాకేమి విచారము …. మహనీయులు – 2020… ఏప్రిల్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments