Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సిపాయిల తిరుగుబాటు కాలంలో జన్మించింది మృదాని. మృదానిని గౌరీమా అని, గౌర్ దాసి అని పిలుస్తారు.
ఆ బాలికకు ఎవరో విష్ణు ప్రతిమను ఇచ్చి “ఈ ప్రతిమ సజీవమైనది. నీకు మేలు చేస్తుంది” అన్నారు.
గౌరీమాకు భక్తి ప్రపత్తులు ఎక్కువయ్యాయి. భక్తి మార్గంలో జీవితాంతం ఉందామనుకుంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిర్ణయించారు. “నేను వివాహం చేసుకోను” అన్నా తల్లిదండ్రులు వినలేదు.
రేపు వివాహమనగా గౌరీమా ఇంట్లోంచి పారిపోయింది. దేశం అలజడిగా ఉంది ఆ రోజుల్లో.
అలనాడు బుద్ధుడు గృహాన్ని వదిలినా, ఆయన యువకుడు, సాహసవంతుడు. కానీ, గౌరీమా తల్లిదండ్రుల చాటున పెరిగినా, ధైర్యంగా ఇల్లు విడచి వెళ్ళిపోయింది.
తల్లిదండ్రులు వెదకి ఆమెను మరల తెచ్చారు. ఆధ్యాత్మిక పథంలో నడిచేందుకు మరొకసారి గృహ త్యాగమే చేసింది. ఆధ్యాత్మికముగా ఎదగసాగింది.
ఒకనాడు విష్ణు పూజ చేస్తుండగా సజీవ పాదాలు దర్శనమిచ్చాయి. ఆమెకు అర్థంకాలేదు.
ఒకసారి ఆమె రామకృష్ణ పరమహంసను దర్శించినప్పుడు, తనకు సాక్షాత్కరించినవి ఈయన పాదాలేనని గుర్తించింది. ఆమె రామకృష్ణుల భక్తురాలైంది.
ఒకనాడు రామకృష్ణులు ఆమెతో “ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగా, బాధాకరంగా ఉంది. వారికోసం నీవు పాటుపడాలి” అన్నారు.
సాయిబాబా కూడా తిలక్ తో “నీవు దేశంకోసం ఎంతో శ్రమించావు. ఇక నీ కోసం నీవు చేసుకోవాలి” అన్నారు.
గౌరీమా వ్యక్తిగా ఆధ్యాత్మిక స్థాయి పెంచుకుంది. ఇక ఆమె మహిళలను అంటే సమాజాన్ని సేవించాలి అని రామకృష్ణుల ఆంతర్యం.
“లోకికులతో మెలగడం నాకు చాలా కష్టం. నాకు కొంతమంది అమ్మాయిలను ఇవ్వండి. వారిని హిమాలయాలకు తీసుకొని వెళ్ళి. వారిని సౌశీల్యవంతులుగా చేస్తాను” అన్నది గౌరీమా.
రామకృష్ణులు మహా సమాధి చెందారు. గౌరీమా సంస్థను నెలకొల్పింది.
భారతీయ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు విద్యా సంస్థను నెలకొల్పింది. దేశంలో మహిళలకు విద్యావశ్యకతను మహాత్మా గాంధీజీతో చర్చించింది.
ఒకనాడు ఆమె నెలకొల్పిన సంస్థలోనికి ఒక అపరిచితుడు దైర్యంగా వచ్చాడు. బలవంతుడు.
ఆ గంభీర పురుషుడిని చూచి, మహిళలందరూ కెవ్వున అరిచారు. ఆ పురుషుడు తన దుస్తులను తీసివేసి చూపాడు. ఆ యువకుని వేషంలో గౌరీమా వచ్చిందని ఆనందపడ్డారు.
గౌరీమా “ఒక పురుషుని చూచి మీరెందుకు భయపడ్డారు? స్త్రీలు ఉత్తమ గృహిణులుగా ఉంటె చాలదు. బలిష్టంగా ఉండి తనకు తానే రక్షించుకోవాలి” అన్నారు.
గౌరీమా మార్చి 1, 1928న సమాధి చెందినది.
ఆ మహిళామూర్తిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- ఆకలుండదు, దహముండదు. …. మహనీయులు – 2020… ఏప్రిల్ 29
- సాధన చేయుమురా నరుడా! …. మహనీయులు – 2020… మార్చి 17
- త్రివేణి సంగమం … …. మహనీయులు – 2020… మార్చి 26
- గులాబీ పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments