Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సెల్వపెరుమాళ్ జాతకాన్ని, తల్లిదండ్రులు జ్యోతిష్యం బాగా తెలిసిన జ్యోతిష్యునికి చూపారు.
సాధు జీవితం ఆ జాతకునిది అని తేల్చడా జ్యోతిష్యుడు. దానికి భిన్నంగా ఉండేటట్లు తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు.
అదేదీ ఫలించలేదు. చివరకు సాధువే అయ్యాడు, తల్లిదండ్రులు అంగీకరించ వలసి వచ్చింది.
భగవాన్ రమణుల ఉపదేశసారం చదివాడు. అందులో ఆయన(రమణుల) చిత్రపటం చూచాడు.
భగవాన్ కొండపై నుండి దిగి వచ్చి ఆశ్రమంలో పాదాలు కడుగుకొను చుండగా తాను భగవానుని పాదాలపై వ్రాలినప్పుడు, భగవాన్ అతనిపై నీళ్లు చల్లి లేవదీశారని కల వచ్చింది.
కల మధురంగానే ఉంది.
ఒకనాడు అతను రమణాశ్రమంలో అడుగు పెట్టాడు. తనకు అచ్చంగా కలలో కనిపించిన మాదిరే జరిగింది.
భగవాన్ కొండపై వచ్చి కాళ్లు కడుగుకొని హాలులో ప్రవేశించారు. అణ్ణామలైస్వామి సమర్పించిన కలకండ పలుకులను భగవాన్ నోట్లో వేసుకుంటూ ఉంటే, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ప్రసాదం స్వీకరించాడన్న అనుభూతి కలిగింది అతనికి. ఆ సెల్వపెరుమాళ్ అన్నామాలై స్వామి అయ్యాడు.
ఇక అన్నామలై స్వామి అక్కడే ఉండిపోయాడు.
ఒకసారి భగవాన్ ఉదయం అల్పాహారం (ఇడ్లి) తింటున్నప్పుడు అన్నామలై స్వామి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్న వేశాడు.
చిన్న స్వామి జోక్యం చేసుకొని “భగవాన్ తినేటప్పుడు కూడా ప్రశ్నలు వేయటమైనా? మరొక సమయంలో అడగవచ్చు గదా?” అన్నాడు.
భగవాన్ చిన్న స్వామితో “ఇడ్లీ తినటం కంటే జ్ఞానమే ముఖ్యం. ఈ సమయం మళ్లీ రాదు. ఇప్పుడు మాట్లాడకపోతే మళ్లా రాదు” అన్నారు.
సాయిబాబా కూడా ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసిన వానిని ప్రోత్సహిస్తూ “భలే మంచి రోజు” అన్నారు.
ఒకసారి అన్నామలై స్వామి భగవానుని “మీరు ఏ పనిచేస్తున్నా మనస్సు భగవంతునిపై లగ్నం చేయాలని చెబుతారు గదా. అది ఎట్లా సాధ్యం?” అని అడిగాడు. భగవాన్ కాసేపు ఆగారు.
కొంతసేపటికి బాల నర్తకులు రమణుల సన్నిధికి వచ్చి నృత్యం చేశారు.
వారి తలలపై నీళ్లు నింపిన పాత్రలున్నాయి. వారు వాటిలో నీరు తొణకకుండా అద్భుతంగా నృత్యం చేశారు.
భగవాన్ అన్నామలై స్వామి వైపు తిరిగి “నీవడిగిన ప్రశ్నకు జవాబిదే’ అన్నారు.
అన్నామలై స్వామి నవంబర్ 9, 1995న భగవాన్ లో లీనమయ్యారు.
నేడు నవంబర్ 9. అన్నామలై స్వామి వర్థంతి.
అన్నామలై వలె మనలను కరుణింపుమని ప్రార్థిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
- ఒక్కడూ రాడు!! … …. మహనీయులు – 2020… ఆగస్టు 9
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- పాశ్చాత్య కలం – భారతీయ గళం…. మహనీయులు – 2020… మే 8
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments