Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మహారాష్ట్రను సాయిబాబా, తెలుగు గడ్డను సొరకాయలస్వామి కార్యరంగంగా చేసుకున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టారో తెలియదు వాళ్లిద్దరు.
ఏ మహనీయునికైనా అయన చూపే మహిమలను బట్టి గుర్తింపు వస్తుంది. అంతవరకు ఆయనవి పిచ్చి చేష్టలే.
ఒకసారి చెంగల్రాయ మొదలియార్ సొరకాయల స్వామి వారు బండిలో పోతుంటే వారి వెంట కాలినడకన పోతున్నాడు. వర్షం కురుస్తుంది. స్వామి గమనించారు.
“తల్లీ, నా బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు. వారిని తడిపి కష్ట పెట్టకు” అన్నారు స్వామి. ఆ భక్తుల మీద వర్షం పడనేలేదు.
నారాయణవనవాసి పాపయ్య చెట్టి ఇంటికి భిక్షకు వెళ్ళారు స్వామి. ఒక దోసెను భిక్షగా ఇచ్చాడాయన.
“ఇంట్లో 18 దోసెలు పెట్టుకొని, ఒక్కటి ఇచ్చినావా?” అన్నారు స్వామి. ఇంట్లోకి పోయి లెక్కిస్తే 18 దోసెలు ఉన్నాయి.
భిక్ష ఇచ్చేటప్పుడు, తూచితూచి ఇవ్వకూడదు, ధారాళంగా ఇవ్వాలి అని అయన అర్ధం చేసుకున్నాడు.
ఏ యోగి తన నిజ తత్వం ఇది అని చెప్పడు. అర్థమైనంత అవుతుంది, అంతే.
స్వామి తాను విసర్జించిన మలాన్ని ఒక పాత్రలో భద్రపరచి, నదీ ప్రవాహంలో దానిని కలిపేవారు.
అలా ఎందుకు చేస్తారో తెలియదు. ఆ మలానికి స్వర్ణయోగ శక్తులున్నాయని కొందరనే వారు.
ఒక రోజు ఒకడు స్వామి నిద్రిస్తుండగా మల పాత్రను దొంగిలించబోయాడు. ఆ పాత్రను చేతులలోనికి తీసుకోగానే, కాళ్లు, చేతులు ఆడలేదు. నేలపై పడిపోయాడు. అప్పటి నుండి స్వామి రహస్యాలను కనిపెట్టటం మానేశారు అందరూ.
ఒకసారి సుబ్బ అయ్యర్ కార్వేటినగరం మహారాజుగారి ఆజ్ఞ ప్రకారం థియోసాఫికల్ సొసైటీకి చెందిన మేడం బ్లావట్ స్కీ, కర్నల్ ఆల్కాట్ లను తీసుకు వెళ్లాడు స్వామి దగ్గరకు.
స్వామి ఆ పాశ్చాత్యులను చూచి “ధార్మిక రంగంలో ఇంతవరకు నల్ల కాకులే సేవ చేస్తుండేవి. ఇప్పుడు తెల్ల కాకులు కూడా వచ్చి వాటికి సహకరిస్తున్నాయి” అన్నారు.
అప్పుడు సుబ్బ అయ్యర్ ఎదురింటికి పోయాడు. అయ్యర్ కు తేలు కుట్టింది అక్కడ, బాధలో స్వామి దగ్గరకు వచ్చాడు అయ్యర్.
“అయ్యో! నేనేమి చేయగలను? ఆవు పేడ రాయి” అన్నారు స్వామి. ఆవు పేడ రాయగానే బాధ తగ్గిపోయింది. ఆ విదేశీయులు ఆశ్చర్యపోయారు.
ఒక సత్యాన్వేషి స్వామి వద్దకు వచ్చి మూడు వారాలున్నాడు. ఆ సత్యాన్వేషికి హిందీ తప్ప, ఏ ఇతర బాషా రాదు.
స్వామికి తమిళం తప్ప వేరే భాష రాదు. ఆ సత్యాన్వేషి పోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోయాడు.
తనకు కలిగిన శంకలు, సమస్యలు ఒక దాని తరువాత ఒకటి ఆ మహాత్ముని సన్నిధిలో తొలిగిపోయాయని హిందీ వచ్చిన వారికి చెప్పారు. అది దక్షణామూర్తి పథం.
సొరకాయలస్వామి ఆగస్టు 9, 1902 (శ్రావణ శుద్ధ గరుడ పంచమి) నాడు దేహాన్ని విడచినా నేటికీ అయన సజీవియే.
నేడు ఆగస్టు 9 సొరకాయలస్వామి వర్థంతి. ఆయనను స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- అడ్డదారి …. …. మహనీయులు – 2020… ఆగస్టు 3
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments