Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సప్త శృంగి దేవత కాకాజీ వైద్యను సాయిబాబాను దర్శింపమని పంపింది. శాంతి పొందాడు అతడు, సాయి దర్శనం చేసుకున్న తరువాత.
మధురలో గుజరాతీ దంపతులు నివసించేవారు. వారి దైవం మీనాక్షీదేవి. మీనాక్షిదేవి స్వప్నంలో ఆ దంపతులకు కనిపించి, తిరువణ్ణామలైలోని శేషాద్రి స్వామిని దర్శించండి అన్నది.
ఆ దంపతులు తనవద్దకు రాబోతుంటే “మిమ్ములను నా వద్దకు మీనాక్షి పంపిందా? అని అడిగారు శేషాద్రి స్వామి. వారాశ్చర్యపోయి అవునన్నారు.
ఆ భార్యాభర్తలను దగ్గరకు పిలచి కొంగు ముడి వేసి “ఇక పోవచ్చును”అన్నారు స్వామి. అలాగే వారికి మగబిడ్డ జన్మించాడు – కృతజ్ఞతగా ఆ బిడ్డకు “శేషాద్రి” అని పేరు పెట్టుకున్నారు.
మురుగన్ శేషాద్రి స్వామి భక్తుడు. ఒకనాడు స్వామి “ఏమిరా! బండి తోలటం లేదా?” అన్నారు. “గిరాకీ లేదు స్వామి” అన్నాడు మురుగన్.
“అయితే బండి అమ్మేయి” అన్నారు స్వామి. మురుగన్ తెల్లబోయాడు. బండియే అతని జీవనాధారము.
అతనికి ఇంకా వివాహం కాలేదు. స్వామి మాటలను విని ఎంచేద్దామా?అని ఆలోచిస్తున్నాడు.
మురుగన్ వద్దకు అతని దూరపు బంధువు ఒకరు వచ్చి తనకు అవివాహిత అయిన కూతురు కలదని ఆమెను వివాహం చేసుకోమ్మన్నాడు.
ఆ ధనవంతునకు ఇల్లరికపు అల్లుడు అయ్యాడు. ఇక బండి ఎందుకు? స్వామి మాటలు వృధా కావు.
శేషాద్రి స్వామి చొక్కలింగం అనే మంగలి వాని వద్ద క్షవరము చేయించుకునే వారు. చొక్కలింగం స్వామి భక్తుడు.
అందుకు డబ్బు ఇచ్చేవారు కాదు స్వామి, అడిగేవాడు కాదు చొక్కలింగము. కానీ అదే రోజున ఎవరో ఒకరు పని చేయించుకుని అధిక ధనము ఇచ్చేవారు.
చొక్కలింగం క్షవరము చేసేటప్పుడు ఒక చెంప, ఒక మీసము తీయగానే స్వామిజీ లేచి వెళ్ళిపోయేవారు.
ఒక రోజున “క్షవరం చేస్తావా చొక్కలింగం” అన్నారు స్వామి. “పూర్తిగా చేయించుకుంటే చేస్తాను” అన్నాడు చొక్కలింగం.
స్వామిజీ పూర్తిగా క్షవరము చేయించుకున్నారు. డబ్బు ప్రసక్తే రాలేదు వారిద్దరి మధ్య.
ఆనాడు క్షవరము చేయించుకొనుటకు చొక్కలింగం వద్దకు ఎవ్వరూ రాలేదు. చేతిలో పైసా లేదు. ఇంటికి వట్టి చేతులతో పోదామనుకున్నాడు చొక్కలింగం.
దారిలో అతనికి ఐదు రూపాయల నోటు దొరికింది. చాలసేపు ఆ నోటును పారవేసుకున్న వారు వస్తారేమోనని వేచి చూచాడు.
ఎవ్వరూ ఎంతసేపటికి రాకుండుటచే అతడు రూ. 5 నోటు స్వామి సేవా ఫలంగా ఇచ్చారని భావించి స్వామికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.
జనవరి 4, 1929 న శేషాద్రి స్వామి మహాసమాధి చెందారు. మనమందరము శేషాద్రి స్వామి మార్గమును అనుసరించెదము గాక! “ఓం సద్గురు శేషాద్రి స్వామిగళ్ తిరువడిక్కే”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- అనుమానించకు! …. మహనీయులు – 2020… నవంబర్ 24
- అద్భుతం కేశవం…..మహనీయులు – 2020 – జనవరి 22
- భయమెలా? ఓ మనసా! … మహనీయులు @2020 – జనవరి 3
- లేవండి, మేల్కొనండి …. మహనీయులు – 2020… జూలై 4
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments