లేవండి, మేల్కొనండి …. మహనీయులు – 2020… జూలై 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


స్వామి వివేకానంద నామధేయం తన గురువైన రామకృష్ణ పరమహంసతోనే ముడిపడి ఉండలేదు. మానవ చరిత్రలో అది ముడిపడి ఉన్నదనటం అతిశయోక్తి కాదు.

ఆయన యతిరాజు. ఖేత్రీ మహారాజుతోపాటు ఆయన అడవికి వెళ్ళారు. స్వామీజీ  వద్ద  ఒక చేతికర్ర మాత్రమే ఉంది.

ఒక తుపాకీని రక్షణార్థం తమవద్ద ఉంచుకొనమని ఖేత్రీ మహారాజ్ అన్నాడు. “ఒక సన్యాసి రక్షణార్థం తుపాకీ అవసరంలేదు. ఏ పులి వారిని ఏమీ చేయదు. నా వలన ఏ ప్రాణి భీతిల్లకూడదు” అన్నారు వివేకానంద.

మైసూరు మహారాజు ఆయన పాదాలకు మోకరిల్లాడు, ముఖ్యమంత్రి ఆయనకు నోట్ల కట్లను ఇవ్వబోయాడు.

“మీరు నాకు రైలు టిక్కెట్టు కొనివ్వండి చాలు” అని నోట్ల కట్టను నిరాకరించారు వివేకానందులు.

మెరీనా బీచ్ లో ఆయన తైల సంస్కారం లేని తల. వెన్నుకు అతుక్కుపోయిన కడుపుతో కనబడ్డ మత్స్యకారుల పిల్లలను చూచి “భగవంతుడా! వీరిని ఎందుకు సృష్టించావు. నా హృదయం తల్లడిల్లిపోతోంది. ఎంతకాలం ప్రభో ఎంత కాలం!” అంటూ కన్నీటితో భగవానుని ప్రార్ధించారు స్వామి.

ఆయన సామాజిక స్పృహతో కూడిన ఆధ్యాత్మికతలను చాటిచెప్పారు.

సెప్టెంబరు 11, 1893న ఆయన చేసిన ప్రసంగంద్వారా భారతీయ ఆధ్యాత్మిక మహాత్మ్యం అంతర్జాతీయంగా తెలిసింది.

ఒకే ప్రయత్నంలో బంతిని గుంటలో వేస్తాను అన్నారు వివేకానందులు. అలా వేయలేరని ఇతరులు పందెం కట్టారు.

ఆయన ఒకే దెబ్బతో బంతిని గుంటలో వేశారు. “మీరు యోగశక్తిని ఉపయోగించారా?” అని ఎవరో అడిగారు.

“ఇలాంటి స్వల్ప విషయాలకు నేను యోగశక్తిని ఉపయోగించను” అన్నారాయన. ఉపయోగించింది మానసిక శక్తిని. మానసిక శక్తికి ఉన్న ప్రాదాన్యతలను ఆయన అలా తెలిపారు. ఉపయాగించు కోవటం మానవుల చేతిలో ఉంది.

ఒకసారి వివేకానందులు రైలు ప్రయాణం చేస్తున్నారు. ఆయన చేతిలో పైసా కూడా ఉంచుకోరు.

అదే పెట్టెలో ఒక ధనికుడు పూరీలు, లడ్డులు తెప్పిచుకుని తినసాగాడు. అంతటితో ఊర్కొనక “సంపాదనాపరుడైన నాకు పూరీలు, లడ్లు లభిస్తున్నాయి. సంపాదించని నీకు ఆకలిదప్పులు, మండుటెండలు మాత్రమే దక్కాయి” అన్నారు వివేకానందులను చూస్తూ.

అందరూ చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చి వివేకానందులను పిలిచి, తాను తెచ్చిన భోజనం చేయమని కోరాడు.

“నన్ను ఎవరిగానో భావించి తినమంటున్నావు. నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు” అన్నారు వివేకానందులు.

ఆ వ్యక్తి “రామచంద్రులు కలలో కనిపించి మిమ్ములను చూపి నా కుమారుడు భోజనం లేకుండా ఉన్నాడు. తీసుకుపో అని మరీ మరీ చెప్పాడు” అన్నాడు.

దైవాన్ని నమ్మిన వారు దేనిని కోరనక్కరలేదు. “నేను వీరుణ్ణి, ధీరుణ్ని…” అని చైతన్యవంతుడై ముందుకు సాగాలి అని తెలిపిన వివేకానందులు జూలై 4, 1902లో దేహాన్ని త్యజించారు.

నేడు జూలై 4  స్వామి వర్ధంతి. “మనం లేద్దాం, మేల్కొందాం, గమ్యం చేరుదాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles