Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
దామారెడ్డి హనుమంతరావు నాయుడు ఇమాం ఆలీ బాబా భక్తుడు.
కరీంనగర్ లో జరిగే సత్యనారాయణ వ్రతానికి వెళ్ళారు. ఎల్లారెడ్డి పెట్టకు వెళ్ళారు. ఎల్లారెడ్డి పేటలో ఆయనకు ఇమాం ఆలీ బాబా దర్శమైంది.
అక్కడున్న భక్తుల కోరికపై ఎల్లారెడ్డి పేటలోనే మధ్యాహ్నం దాక ఉండి ఇమాం ఆలీ బాబా మహా ప్రసాదాన్ని స్వీకరించి కరీంనగర్ కు ప్రయాణమయ్యాడు.
అప్పటికి సత్యనారాయణ వ్రతం పూర్తి అయింది, భోజనాలు కూడా అయిపోయాయి.
భోజనం చేసి దైవ దర్శనం (సత్యనారాయణ స్వామి) చేసుకుంటే బాగుండదని అయన లోపలకు పోకుండా కలశానికి నమస్కరించాడు.
అక్కడ ఆయనకు కలశం స్థానంలో సత్యన్నారాయణ స్వామి దర్శనమిచ్చారు. అది నిజమేనా అని అయన కన్నులు నులుముకొని మరీ, మరీ చూచాడు నాయుడు. సాక్షాతు సత్యనారాయణుడే.
ఆ దివ్య మంగళమూర్తి గోచరించటం ఇమాం ఆలీ గారి అనుగ్రహమని గ్రహించాడు.
సాయిబాబా కూడా రామునిగా, కృష్ణునిగా దర్శనం ఇచ్చాడు. ఇమాం ఆలీ బాబావలన ప్రసాదం ఒకచోట, దర్శనం మరోచోట లభించింది.
కామారెడ్డి రైల్వే స్టేషన్ లో సిగ్నలర్ పోస్టు అక్కరలేదని, ఆ పోస్టును రద్దు చేస్తున్నామని అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చాయి.
సిగ్నలర్ గా పనిచేస్తున్న వ్యక్తి నెత్తి మీద పిడుగు పడ్డట్లయింది. ఏడుస్తున్న సిగ్నలర్ ను, స్టేషన్ మాస్టర్ ఎల్లారెడ్డి ఇమాం ఆలీ బాబాను దర్శించమన్నాడు.
సిగ్నలర్ వెళ్ళాడు. తన గోడు చెప్పుకున్నాడు. బాబా కోపంతో అతడిని కొట్టసాగారు. చూచేవారికి అర్ధం కాలేదు. ఐనా సిగ్నలర్ బాబా పాదాలను వదలలేదు.
చివరకు బాబాయే “బాగవుతుంది పో” అన్నారు, సిగ్నలర్ ఉద్యోగం ఊడలేదు. నిలచింది.
అందరిని సంరక్షించే బాబా సిగ్నలర్ ను ఎందుకు కొట్టారు అంటే, సత్యా సత్యాలు తెలుసుకోకుండా బాబాపై నిందలు వేసేవాడు సిగ్నలర్.
ఇప్పుడు బాబా అలా కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే, బాబాను గాని సత్పురుషులను తిట్టినా ఫరవాలేదు, వారి ఏమి అనుకోరు అనే ఆలోచనలతో, ఇక లేనిపోని నిందలు వేస్తారు.
అలా నిందలు వేయకూడదని చెప్పటానికే బాబా తిట్లు దెబ్బలూనూ.
ఎల్లారెడ్డిపేటలో ఒక పోకిరి పిల్లవాడు కుక్కతోకకు పటాకులను కట్టి వినోదించాడు. కొన్ని దినాల తరువాత ఎవరో జోడు బార్ల తుపాకీతో వేరొకరిని కాల్చినాడని తెలిసింది. ఇవన్నీ జరగబోతాయని బాబాకు ముందుగానే ఎలా తెలిసింది?
ఒకసారి సాయిబాబా ద్వారకామాయిలో ఉన్న ఒక బల్లిని చూపి, దీని సోదరి ఔరంగాబాదు నుండి వస్తోంది అన్నారు. అలాగే వచ్చింది. వారందరూ ఘటనా ఘటన సమర్థులు.
హజ్రత్ ఇమాం ఆలీ బాబా జూలై 22, 1934లో దేహంచాలించారు.
నేటికీ ఆయన తన సమాధి నుండి రక్షిస్తుంటారు భక్తులను.
నేడు జూలై 22. బాబా వర్థంతి. ఆయనను స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రకాశించే ప్రసాదం …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 23
- జయహో మాతా! …. మహనీయులు – 2020… జూన్ 12
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- దర్శనం…. మహనీయులు – 2020… అక్టోబరు 19
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments