Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
దేవీ, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేస్తారు. పాండురంగడు తన సన్నిహిత భక్తుడైన నామదేవుని విఠోబా వద్దకు పంపుతాడు.
ఒకసారి రేగేకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు.
విష్ణుమూర్తి ఆయనను చూపిస్తూ రేగేతో ”షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీ వాడు. నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి” అన్నారు. అనంతరం సాయిబాబాను ఆశ్రయించాడు రేగే.
సాయి సచ్చరితలో కాకాజీ వైద్య అనే తన పూజారిని సప్తశృంగి దేవత సాయి వద్దకు పంపుతుంది.
కాకాజీ వైద్య ప్రాపంచిక విషయంలో చిక్కుకుని అనేక కష్టాలతో బాధపుతుండే వాడు. ప్రాపంచిక విషయాలు అంటే విద్య, సంతానం, ఆరోగ్యం లాంటివి.
కాకాజీ ఈ విషయంలో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోయాడు. అతడు తన దేవీ మాతను కోరుకున్నది తన భౌతికమైన కోర్కెలు తీర్చమని కాదు.
ఆ కోర్కెల ఫలితంగా కలిగే మనో వికలతను తొలగింపుమని అతని అభ్యర్ధన.
మనో వికలత లేని వాడు కోర్కె తీరినా, తీరకున్నా శాంతితోనే ఉంటాడు. కోర్కెలు అటు, ఇటైనా, చిత్తం మాత్రం శాంతంగా ఉంటే చాలు.
జయాపజాయాలను స్థిర చిత్తంతో స్వీకరించినట్లు అవుతుంది. ఏ ఉపనిషత్తు గాని, గీత గాని, ఏ మహనీయుడు గాని తెలిపేది అదే.
సుఖాలు పొందలేకపోయినా, కష్టాలలో ఉన్నా మనో చింతన లేకుంటే అదే పది వేలు. అట్టి మనో చింతన లేని స్థితి కోసమే కాకాజీ వైద్య తపన.
కాకాజీ వైద్య సాయిని దర్శించాడు. ఆత్మ శాంతిని పొందాడు. ఆయన ఆషాఢ శుద్ధ ఏకాదశి (జూలై మాసం) నాడు సాయిబాబాకు ఇలా ఉత్తరం వ్రాశాడు ..
”శ్రీ జగదాంబ ఆజ్ఞానుసారం మీ చరణ దర్శనానికి వచ్చాను. మీ అనుమతితో నింబ వృక్షం క్రింద పాదుకలకు సేవ చేసుకున్నాను.
చాలా రోజుల నుండి ఆందోళనకు గురయ్యాను. శ్రీ గురు దర్శనంతో మనసుకు శాంతి, ఆనందం కలుగుతోంది. మీ కృప పొందినందుకు ధన్యుడిని” అని.
స్త్రీపుంసాత్మక భేద శాన్యముగ, జగత్‌చ్ఛిద్రూప తేజమ్ముగా, మాయోపాధి ప్రకటమ్ముగ, నిర్గుణమ్ముగ వెలుగొందె ఆ పరాశక్తియే సప్తశృంగి దేవత.
ఆ పరాశక్తియే సాయినాథుడు.
సాయియే చెప్పాడు ”నేను జగన్మాతను” అని.
ఓం జగన్మాత్రే నమః
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మనసెరిగినవాడు మా దేవుడు …..సాయి@366 ఏప్రిల్ 6….Audio
- అమృతపు జల్లు – ఆ చిరునవ్వు …..సాయి@366 జనవరి 17….Audio
- సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio
- నాడే కాదు – నేడు కూడా!…..సాయి@366 జూలై 24…Audio
- న్యాయవాది …..సాయి@366 జూలై 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments