Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
భక్తులు పండరీపురం పోయి పాండురంగని దర్శిద్దామనుకుంటారు. కనీసం ఆషాఢ శుద్ధ ఏకాదశినాడైనా, కార్తీక శుద్ధ ఏకాదశి నాడైనా. కొందరికి వెళ్లటం కుదరదు.
ఉదాహరణ:
సవితామాలి. ఈయన తోటమాలి. పరిస్థితుల కారణంగా ఊరు దాట వీలులేని వాడు.
ఆ తోటమాలి పాండురంగని పండరీపురం వెళ్ళి దర్శింపలేకున్నా తన ఉద్యానవనంలోనే దర్శిస్తున్నాడు.
ఒక్కొక్క కాయను, ఒక్కొక్క పండును వాటి వాటి వృక్షనామాలతో పిలిచి మీరంతా హరి స్వరూపాలే, పాండురంగని దివ్య కాంతులే అనే వాడు.
గల గల పారే నీరు, నుయ్యి, త్రాడు, నీళ్ల సంచి (మోట) ఇవన్నీ పండరీనాథునిలో నిమగ్నమయ్యాయి అనే వాడు.
చెట్లకు నీళ్లను మళ్లిస్తూ చర చరా పారే గంగమ్మను చూచి కేరింతలు కొట్టేవాడు.
ఆ గంగ సాక్షాత్తు విష్ణుపాదముల నుండి ఉద్భవించినదే కదా! ఏకనాథుడు కూడా చంద్రభాగ నది నా సోదరి అనేవాడు.
అనంత ప్రకృతిని తన ఉద్యానవనంలో చూచేవాడు. చెట్లను ప్రేమ అనే నీటితో తడిపే వాడు. శాంతి అనే పండును పండించే వాడు. కొమ్మల్లో, రెమ్మల్లో రంగని విభూతి చూచేవాడు. అట్టివాడు పండరికి పోవాలా?
ఒకసారి సవతామాలి భగవత్ ప్రేమ ప్రవాహంలో మునిగి సమాధి స్థితిలో ఉండిపోయాడు.
పాండురంగడు ఉద్యాన వనానికి వచ్చి సవతామాలి తలపై చేతులుంచి మామూలు స్థితికి తెచ్చాడు.
రంగడు సవతామాలిని మనసారా కౌగిలించుకున్నాడు. ఈ సంఘటనను జ్ఞానదేవ్, నామదేవులు చూచారు.
అంతేకాదు…
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరీపురానికి అనేక పల్లకీలతో వార్కరీలు పోయి, రంగని దర్శిస్తారు.
కానీ, ఆషాఢ బహుళ చతుర్దశినాడు అంటే సవితామాలి పాండురంగనిలో ఐక్యమయిన రోజున పండరీనాథుని పల్లకి సవితామాలి గ్రామమైన అరణ్కు పోతుంది.
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశినాడు షిరిడీలో సాయి సన్నిధిలో సవితామాలి చిత్తరువును ఉంచుతారు.
అది భక్తికి కిరీటం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నేనే జగన్మాతను …..సాయి@366 జూలై 22…Audio
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
- తొడిమను వీడిన దోసపండు …..సాయి@366 డిసెంబర్ 15….Audio
- గౌరవం అక్కరలేదు, ద్వేషించకు …..సాయి@366 జూలై 23…Audio
- ఆసుపత్రికి కాదు, సాయి వద్దకే!…..సాయి@366 ఏప్రిల్ 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments