Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా అందగాడా? బుక్కా ఫకీరు, చిరిగిన అంగీ, పెరిగిన గడ్డం, తలకు గుడ్డ, చేతిలో చిప్ప, ఏ లోకాలనో చూస్తున్న చూపు, ఇదీ సాయినాథుని రూపం.
అయితే సాయిబాబా అందగాడా? కాదా? తన తల్లి ఎంత వికారి అయినా పాపకు మోహనంగానే కనిపిస్తుంది. సాయి కూడా అంతే.
సాయి అందాన్ని చూచి కళ్లు తిప్పుకోలేని వారున్నారు. “పుంసాం మోహన రూపాయా” అని శ్రీరాముని గూర్చి చెప్పినట్లే ఉంటుంది సాయి గురించి చెపుతుంటే.
నిశ్చలంగా, గంభీరంగా ఉండే సాయి చూపు, మధుర మందహాసం మనలో ఎదో అందుకోలేని దానిని అందించేటట్టు ఉంటుంది.
ఇంకా మాయలోనే ఉన్నావా? మాయను చీల్చుకుని పో అంటుంది. కన్నులు కారుణ్యాన్ని వర్షిస్తుంటాయి. పాదాలు పట్టుకో ఆవలి తీరానికి చేరుస్తాను అంటాయి.
మందహాసం ఏమిటీ ఒక్క అడుగు వేయలేవా? నేను పది అడుగులు వేయాలా? అని అంటాయి.
సాయిబాబా మోహన రూపాన్ని దర్శించిన వారెందరో ఉన్నారు. కానీ ఆ రూపాన్ని అనుభవాన్ని అందించిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
కపర్దేకు “సాయిబాబా తమ మోమును మృదు మధుర దరహాసా లొలికిస్తూ చూపారు. అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడడం కోసం ఇక్కడ ఇన్ని సంవత్సరాలైనా పడి ఉండవచ్చు.
నేను పారవశ్యంతో పిచ్చివాడిలా అలా చూస్తూ ఉండి పోయాను” అని తన డైరీలో వ్రాసుకున్నాడు జనవరి 17, 1912లో.
కాకాజీ వైద్యని సాయిని దర్శించమని సప్తశృంగి దేవత చెబితే, సాయి దర్శనం చేసుకున్నాడు.
అయన చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి, మనో చాంచల్యం వినాశనమయింది దర్శనంతోనే.
సాయి, కాకాజీ వైద్య ఒక్క మాట కూడ మాట్లాడుకో లేదు. ఇదే సాయి రూప దర్శనం ఫలం అని ఆయనకు తెలిసింది.
సాయిబాబాయే స్వయంగా ఇలా తెలిపాడు – అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి.
దానినే నిత్యమూ ధ్యానించాలి లేదా నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని నఖ శిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్లు మనసులో పెట్టుకోవాలి.
సాయినాధుని మృదుమధుర మందహాస విధానాన్ని చూస్తుంటే బ్రహ్మానందంతో తనువెల్లా పరవశిస్తుంది. అట్టి మధురానుభూతి అందరకూ సాయి ప్రసాదించు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….Audio
- గ్రహణం వీడింది.! …..సాయి@366 జనవరి 21….Audio
- తమ యొక్క సగుణ రూపాన్ని చూసేందుకు దృష్టిని ప్రసాదించారు బాబా–Audio
- పటం కాదు, సాయిబాబాయే …. సాయి@366 ఫిబ్రవరి 17….Audio
- నీవే నా తోడు నీడ …..సాయి@366 జనవరి 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments