Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా “రుణము, శతృత్వము, ఖూనీ చేసిన దోషము చెల్లించియే తీరవలయును. దాని నుండి తప్పించుకొను మార్గమే లేదు” అన్నారు.
ఈ మూడు అనగా ఋణము, శతృత్వము, ఖూనీలను చేసిన, ఆ కర్మల నుండి ఆ జన్మలో తప్పించుకొనిన, మరు జన్మలో తప్పించుకొనుట అసాధ్యము.
“రుణాను బంధ రూపేణా పశుపత్ని సుతాలయా” అని అంటారు. శతృత్వము విచిత్రంగా ఉంటుంది. బాబా ఆ విషయమై జనవరి 18 , 1912న ఒక కథను వినిపించారు.
ఒక చోట ఒక అంధుడు ఉండేవాడు. అతను తకియా దగ్గరే ఉండేవాడట. ఒక మనిషి అతని భార్యకు ఆశ చూపి వశపరుచుకొని ఆ అంధుడిని హత్యచేశాడట.
చావడి వద్ద నాలుగు వందల మంది గుమిగూడి అతడిని తిట్టి అతని తలను తీయించ దలచుకున్నారట. ఉరి తీసేవాడు ఈ ఆజ్ఞను పాలించాడట.
కానీ దాన్ని కేవలం తన విధి నిర్వహణగా గాక, ఎదో ఉద్దేశం మనసులో పెట్టుకుని చేశాడట. కనుక తరువాత జన్మలో ఆ హంతకుడు ఉరి తీసేవాడి కొడుకుగా పుట్టాడట”. ఇది సాయి చెప్పిన కథ.
ఇక్కడ ఒక వ్యక్తి దుష్టుడు వేరొకరి భార్యను లొంగదీసుకున్నాడు, ఇంకా హత్య చేశాడు. ఆ దుష్టుడు తన దుష్టకార్యానికి ఈ జన్మలోనే శిక్షను పొందాడు, చేసిన హత్య నుండి తప్పించుకొను మార్గమే లేదు.
ఈ జన్మలో తప్పించుకొన్నను రాబోవు జన్మలలో అందుకు తగిన శిక్షను అనుభవించవలెను.
ఆ దుష్టుడు ఉరి తీయబడ్డాడు. ఇంకను సాయిబాబా కథను చెప్పుచున్నాడు కనుక ఆ తరువాత జరిగిన జన్మను కూడా చెప్పగలడు, కనుక ఈ కథను సాగించినాడు.
ఇప్పుడు ఉరితీయు వాని ప్రసక్తి వస్తుంది. ఉరి తీయుట అతని వృత్తి. ఉరి తీయు వానికి, ఉరి పడిన వానికి వైరము ఉన్నది.
ఉరి తీయువాడు ఆ వైరమును మనసులో ఉంచుకొని కక్ష సాధింపు చర్యగా ఉరి తీసినాడు. ఇది శిక్షార్హమే.
ఉరి తీయు వాని ద్వేషమునకు తగిన ఫలితమును ఈ జన్మలోనే కలిగినది. తనకు అయిష్టమైన వ్యక్తియే కుమారుడుగా పుట్టినాడు.
ఉరి తీయు వాడు అట్లు గాక నిర్వహణగా ఉరి తీసిన ఈ విరోధికి బదులు వేరొక సజ్జనుడు పుట్టి ఉండేవాడు.
ఇప్పుడు తప్పనిసరిగా తాను అయిష్టపడి, విరోధిగా భావించిన వానినే కుమారునిగా భావించి, ప్రేమించి, పోషించ వలసిన స్థితి కలిగింది.
కాబట్టి ఎట్టి పరిస్థితులలోను హత్యను, రుణమును, శతృత్వమును మనసులోకి, మాటలలోనికి, ఆచరణలోకి రానీయకుందురు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- శిక్ష తప్పదు …. మహనీయులు – 2020… మే 4
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- ఎన్నో జన్మల పుణ్య ఫలం …..సాయి@366 జనవరి 1….Audio
- అల్లా అచ్చా కరేగా!…..సాయి@366 అక్టోబర్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments